Tata Motors కి కలిసొచ్చిన పండుగ సీజన్: పెరిగిన 2021 అక్టోబర్ అమ్మకాలు

భారతదేశంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ (Tata Motors) 2021 అక్టోబర్ అమ్మకాల నివేదికను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నెలలో దేశీయ మార్కెట్లో 65,151 యూనిట్ల వాహనాలను విక్రయించినట్లు తెలిసింది. అయితే ఈ విక్రయాలలో ప్యాసింజెర్ వెహికల్స్ మరియు కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి.

కలిసొచ్చిన పండుగ సీజన్: 2021 అక్టోబర్ అమ్మకాల్లో Tata Motors హవా..

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం 2020 అక్టోబర్ కంటే కూడా 2021 అక్టోబర్ నెల అమ్మకాలు ఏకంగా 31 శాతం పెరిగినట్లు తెలుస్తుంది. ఇది కంపెనీకి చాలా సంతోషకరమైన విషయం, గత సెప్టెంబర్ నెలలో అమ్మకాలు తగ్గినప్పటికీ అక్టోబర్ నెలలో మంచి వృద్ధిని సాధించగలిగింది. దీనికి ప్రధాన కారణం దేశంలో మొదలైన పండుగ సీజన్ అని చెప్పవచ్చు.

కలిసొచ్చిన పండుగ సీజన్: 2021 అక్టోబర్ అమ్మకాల్లో Tata Motors హవా..

2020 అక్టోబర్‌లో కంపెనీ 49,669 యూనిట్ల వాహనాలను మాత్రమే విక్రయించినట్లు నివేదికల ద్వారా తెలుస్తుంది. ఇక నెలవారీ అమ్మకా విషయానికి వస్తే, ఇందులో కంపెనీ అమ్మకాలు 16 శాతం పెరిగాయి. సెప్టెంబర్ 2021లో, టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో మొత్తం 55,988 యూనిట్ల వాహనాలను విక్రయించగలిగింది.

కలిసొచ్చిన పండుగ సీజన్: 2021 అక్టోబర్ అమ్మకాల్లో Tata Motors హవా..

Tata Motors యొక్క ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ విషయానికి వస్తే, 2021 అక్టోబర్ నెలలో కంపెనీ దేశీయ మార్కెట్లో మొత్తం 33,925 యూనిట్ల కార్లను విక్రయించగా, గత ఏడాది అక్టోబర్‌లో కంపెనీ 23,617 యూనిట్ల కార్లను విక్రయించింది. ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో ప్యాసింజర్ వాహన విభాగం యొక్క అమ్మకాల్లో ఏకంగా 44 శాతం వృద్ధి నమోదైంది.

కలిసొచ్చిన పండుగ సీజన్: 2021 అక్టోబర్ అమ్మకాల్లో Tata Motors హవా..

ప్యాసింజర్ వాహన సెగ్మెంట్ యొక్క నెలవారీ అమ్మకాలను పరిశీలించినట్లయితే, టాటా మోటార్స్ సెప్టెంబర్ 2021 లో 25,730 యూనిట్ల కార్లను విక్రయించింది. అక్టోబర్ 2021 లో కంపెనీ 32 శాతం వృద్ధిని సాధించింది. ప్యాసింజర్ సెగ్మెంట్ విక్రయాలలో ICE మరియు ఎలక్ట్రిక్ సెగ్మెంట్ కార్లు రెండూ ఉన్నాయి.

కలిసొచ్చిన పండుగ సీజన్: 2021 అక్టోబర్ అమ్మకాల్లో Tata Motors హవా..

టాటా మోటార్స్ యొక్క అమ్మకాలలో కమర్షియల్ వెహికల్ విభాగాన్ని గమనిస్తే, కంపెనీ 2021 అక్టోబర్ నెలలో దేశీయ మార్కెట్లో మొత్తం 31,226 యూనిట్ల వాహనాలను విక్రయించగా, గత ఏడాది అక్టోబర్‌లో కంపెనీ మొత్తం 26,052 యూనిట్ల వాణిజ్య వాహనాలను విక్రయించగలిగింది. ఈ ఏడాది అక్టోబర్‌లో దేశీయ మార్కెట్లో కంపెనీ 20 శాతం ఎక్కువ వాణిజ్య వాహనాలను విక్రయించింది.

కలిసొచ్చిన పండుగ సీజన్: 2021 అక్టోబర్ అమ్మకాల్లో Tata Motors హవా..

వాణిజ్య వాహనాల యొక్క నెలవారీ విక్రయాల విషయానికి వస్తే, టాటా మోటార్స్ సెప్టెంబర్ 2021 లో 30,258 యూనిట్ల వాహనాలను విక్రయించింది. సెప్టెంబర్ 2021తో పోలిస్తే అక్టోబర్ 2021లో కంపెనీ 3 శాతం వృద్ధిని సాధించింది. ఇది నిజంగా కంపెనీకి మంచి కాలమని చెప్పాలి.

కలిసొచ్చిన పండుగ సీజన్: 2021 అక్టోబర్ అమ్మకాల్లో Tata Motors హవా..

టాటా మోటార్స్ యొక్క కమర్షియల్ వెహికల్స్ యొక్క ఎగుమతి గణాంకాలను పరిశీలిస్తే, 2021 అక్టోబర్ నెలలో కంపెనీ మొత్తం 2,448 యూనిట్ల వాణిజ్య వాహనాలను విదేశీ మార్కెట్‌కు ఎగుమతి చేసింది. 2020 అక్టోబర్ నెలలో కంపెనీ మొత్తం 2,420 యూనిట్ల వాణిజ్య వాహనాలను విదేశీ మార్కెట్‌లకు ఎగుమతి చేసింది. ఈ ఏడాది వాణిజ్య వాహనాల ఎగుమతులు 1 శాతం వరకు పెరిగాయి. అంటే కొంతవరకు వృద్ధిని ఇందులో కూడా సాధించాయి.

కలిసొచ్చిన పండుగ సీజన్: 2021 అక్టోబర్ అమ్మకాల్లో Tata Motors హవా..

అయితే మరోవైపు, నెలవారీ ఎగుమతుల పరంగా కంపెనీ కొంత వరకు క్షీణతను ఎదుర్కోవలసి వచ్చింది. సెప్టెంబర్ 2021లో, కంపెనీ మొత్తం 3,000 యూనిట్ల వాణిజ్య వాహనాలను ఎగుమతి చేసింది మరియు అక్టోబర్‌ నెల అమ్మకాలు సెప్టెంబర్‌ నెల అమ్మకాలకంటే కూడా దాదాపు 18 శాతం తక్కువ నమోదు చేయగలిగింది.

కలిసొచ్చిన పండుగ సీజన్: 2021 అక్టోబర్ అమ్మకాల్లో Tata Motors హవా..

ఏది ఏమైనా కంపెనీ గత నెలలో ఆశించిన స్థాయిలో అమ్మకాలను చేయగలిగింది. అంతే కాకుండా ఈ నెలలో కూడా పండుగ సీజన్ ఉండటం వల్ల మరియు రానున్న పండుగలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ యొక్క అమ్మకాలు కూడా మరిన్ని పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. దీనికి తోడుగా ఇటీవల కంపెనీ కొత్త టాటా పంచ్ అనే మైక్రో SUV ని విడుదల చేసింది.

టాటా పంచ్ SUV ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది, అంతే కాకుండా ఇది అద్భుతమైన పనితీరుని కూడా అందిస్తుంది. దీని ధర కూడా ఇతర మోడల్స్ కంటే తక్కువగా ఉండటం వల్ల ఎక్కువమంది ఈ SUV ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది, టాటా పంచ్ సేఫ్టీ విషయంలో ఏకంగా 4 స్టార్ రేటింగ్ పొందటం వల్ల ఇది తప్పకుండా మార్కెట్లో ఎక్కువ అమ్మకాలను సాగిస్తుంది తద్వారా కంపెనీ యొక్క అమ్మకాలు పెరుగుతాయి.

Most Read Articles

English summary
Tata motors october sales 33925 units passengers vehicles details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X