2021 నవంబర్ సేల్స్.. అమ్మకాల్లో తగ్గేదే లే అంటున్న Tata Motors

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) గత కొంతకాలంగా సెమికండక్టర్ చిప్ కొరతను ఎదుర్కుంటోంది. అయినప్పటికీ కూడా.. 2021 నవంబర్ నెల అమ్మకాలు మాత్రం 32 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది నిజంగా కంపెనీ సాధించిన విజయం అని చెప్పాలి.

2021 నవంబర్ సేల్స్.. అమ్మకాల్లో తగ్గేదే లే అంటున్న Tata Motors

టాటా మోటార్స్ 2021 నవంబర్ నెలలో 28,027 యూనిట్ల ప్యాసింజర్ వెహికల్స్ విక్రయించినట్లు గణాంకాల ద్వారా తెలుస్తుంది. ఇదే నెల గత సంవత్సరం 21,228 యూనిట్లను విక్రయించింది. అంటే మునుపటికంటే కూడా కంపెనీ ప్యాసింజర్ వాహన విభాగంలో 32% ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది.

2021 నవంబర్ సేల్స్.. అమ్మకాల్లో తగ్గేదే లే అంటున్న Tata Motors

టాటా మోటార్స్‌ యొక్క అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. నవంబర్ 2020తో పోల్చితే 2021 నవంబర్ నెలలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల్లో ఏకంగా 324 శాతం వృద్ధిని నమోదు చేసింది. కార్ల తయారీ సంస్థ 1,751 యూనిట్ల టిగోర్ మరియు నెక్సాన్ EV లను విక్రయించింది. మిగిలిన ఏ సంస్థలు కూడా ఇంత ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించలేదని నివేదికల ద్వారా తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే టాటా మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలకు దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

2021 నవంబర్ సేల్స్.. అమ్మకాల్లో తగ్గేదే లే అంటున్న Tata Motors

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో ప్రతి నెల ఆశించిన పురోగతిని అందుకుంటోంది. నెలవారీ అమ్మకాలలో కనీసం 10 శాతం పెరుగుదల ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను భారతీయ రోడ్లపైకి తీసుకురావాలని టాటా మోటార్స్ లక్ష్యంగా పెట్టుకుంది.

2021 నవంబర్ సేల్స్.. అమ్మకాల్లో తగ్గేదే లే అంటున్న Tata Motors

నవంబర్‌లో టాటా మోటార్స్ మొత్తం వాహనాల విక్రయాలు 58,073 యూనిట్లుగా ఉన్నాయి. వీటిలో వాణిజ్య వాహనాలు కూడా ఉన్నాయి. గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌లో అమ్మకాలు 20 శాతానికి పైగా పెరిగాయి. అయితే 2021 అక్టోబర్ నెలలో విక్రయించిన 67,829 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు కొంత క్షీణించాయి అనే చెప్పాలి.

2021 నవంబర్ సేల్స్.. అమ్మకాల్లో తగ్గేదే లే అంటున్న Tata Motors

టాటా మోటార్స్ ఇటీవల కాలంలో టాటా పంచ్ అనే మైక్రో SUV ని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇది మొదటి నెలలోనే 8,453 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. టాటా పంచ్ ధర దేశీయ మార్కెట్లో రూ. 5.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ మైక్రో SUV ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

2021 నవంబర్ సేల్స్.. అమ్మకాల్లో తగ్గేదే లే అంటున్న Tata Motors

Tata Punch ఆల్ఫా ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఇది నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) మరియు క్రియేటివ్‌ వేరియంట్స్. ఈ నాలు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి.

2021 నవంబర్ సేల్స్.. అమ్మకాల్లో తగ్గేదే లే అంటున్న Tata Motors

Tata Punch అద్భుతమైన పర్ఫామెన్స్ అందింస్తుంది, దీని కోసం 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించనుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

2021 నవంబర్ సేల్స్.. అమ్మకాల్లో తగ్గేదే లే అంటున్న Tata Motors

ఇటీవల కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, టాటా మోటార్స్ తన లైనప్‌లోని ఎంపిక చేసిన మోడల్‌ల ధరలను పెంచింది. ఇందులో Tata Tiago, Tiago NRG, Tigor, Altroz ​​మరియు Nexon EV వంటివి ఉన్నాయి. అయితే కంపెనీ యొక్క Tata Safari, Harrier, Punch మరియు Nexon EVల ధరలు పెరగలేదు.

2021 నవంబర్ సేల్స్.. అమ్మకాల్లో తగ్గేదే లే అంటున్న Tata Motors

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ (XE ట్రిమ్ మినహా) మరియు టిగోర్ కాంపాక్ట్ సెడాన్ యొక్క అన్ని మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్‌ల ధర రూ. 3,000 పెరిగింది. ఇదిలా ఉండగా, ఇటీవల విడుదల చేసిన Tiago NRG యొక్క AMT వేరియంట్ ధర రూ. 3,000 పెరిగింది. ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మూడు ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది - 1.2-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్. న్యాచురల్లీ పెట్రోల్ వేరియంట్ ధర రూ.1,500 నుంచి రూ.5,500 వరకు పెరిగింది. మరోవైపు, డీజిల్ ట్రిమ్‌లు ఇప్పుడు రూ.400 నుండి రూ.5,000 వరకు పెరిగాయి. టర్బో పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.2,500 పెరిగి రూ.8,500కి చేరాయి.

2021 నవంబర్ సేల్స్.. అమ్మకాల్లో తగ్గేదే లే అంటున్న Tata Motors

నెక్సాన్ కాంపాక్ట్ SUV యొక్క ఎంపిక చేసిన పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్‌లు రూ.11,500 వరకు పెంచబడ్డాయి. అయితే, టాప్-స్పెక్ XZ+ మరియు XZA+ ప్లస్‌లు మినహాయించబడ్డాయి. పెరిగిన ధరలు అమ్మకాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుందా.. లేదా.. అనే విషయం త్వరలో తెలుస్తుంది.

2021 నవంబర్ సేల్స్.. అమ్మకాల్లో తగ్గేదే లే అంటున్న Tata Motors

టాటా మోటార్స్ త్వరలో గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో ఫ్రాంచైజీ ఆధ్వర్యంలో వాహన స్క్రాపేజ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో గుజరాత్ ప్రభుత్వ సహాయంతో కంపెనీ తన మొదటి స్క్రాపింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. గుజరాత్‌లో స్క్రాపింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ ఫ్రాంచైజీలను ఆహ్వానించింది. ఫ్రాంచైజీలను తీసుకోవాలనుకునే భాగస్వాములకు కంపెనీ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపడం కూడా ప్రారంభించింది.

Most Read Articles

English summary
Tata motors passenger vehicle sales november 28027 units details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X