Just In
Don't Miss
- News
కృష్ణాబోర్డుపై జగన్‌కు షాకిచ్చిన కేసీఆర్- విశాఖకు తరలింపుపై అభ్యంతరం- బోర్డుకు లేఖ
- Movies
అఖిల్‌కు భారీ షాకిచ్చిన మోనాల్: తన అసలు లవర్ పేరు చెప్పి ఎమోషనల్.. మొత్తం రివీల్ చేసింది!
- Lifestyle
ప్రతి రాశిచక్రం వారి చింతలను ఎలా నిర్వహించాలో తెలుసా? భాదల నుండి ఇలా భయటపడాలి
- Sports
Brisbane Test: పాపం శుభమన్ గిల్.. తృటిలో సెంచరీ మిస్!!
- Finance
మారుతీ సుజుకీ కార్ల ధరల షాక్, కార్లపై రూ.34,000 వరకు పెంపు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాటా మోటార్స్ నుండి మరింత చవకైన ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయ్..
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, భారత మార్కెట్ కోసం మరింత చవకైన ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం టాటా మోటార్స్ నుండి లభిస్తున్న మొట్టమొదటి మరియు ఏకైక ఎలక్ట్రిక్ కారు 'టాటా నెక్సాన్ ఈవి'. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

టాటా నెక్సాన్ ఈవీనే ప్రస్తుతం భారతదేశంలో కెల్లా అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు. కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి ఛార్జీపై 312 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. కాగా, ఈ కారు కన్నా తక్కువ ధర కలిగిన కార్లను దేశీయ మార్కెట్ కోసం టాటా సిద్ధం చేస్తోంది.

ఇప్పటికే కొన్ని రకాల కొత్త ఎలక్ట్రిక్ కార్లను టాటా మోటార్స్ భారత రోడ్లపై పరీక్షిస్తోంది. అయితే, టాటా నుండి రానున్న ఈ చవకైన ఎలక్ట్రిక్ కార్లు తక్కువ ధరకు తగినట్లుగానే తక్కువ డ్రైవింగ్ రేంజ్‌ను కలిగి ఉంటాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రోజూవారీ సిటీ ప్రయాణాలకు అనుగుణంగా వీటిని లో-రేంజ్, లో-కాస్ట్‌తో తయారు చేసే అవకాశం ఉంది.
MOST READ:డోనాల్డ్ ట్రంప్ వాడిన కారు వేలంలో పాల్గొంటున్న ఇండియన్, ఎవరో తెలుసా ?

సరసమైన ధరకే ఈ లో-కాస్ట్ ఎలక్ట్రిక్ కార్లను అందించేందుకు టాటా మోటార్స్ వాటి రేంజ్ విషయంలో రాజీ పడే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల ధరల విషయంలో కంపెనీ అందిస్తున్న పెట్రోల్/డీజిల్ వాహనాల ధరల కన్నా 15-20 శాతం మించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది.

ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్లలో కొన్ని ఈ ఏడాది చివరి నాటికి, మరికొన్ని వచ్చే ఏడాది ఆరంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ లో-కాస్ట్ ఎలక్ట్రిక్ కార్లు సుమారు 200 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేయవచ్చని సమాచారం.
MOST READ:పేస్ మాస్క్ విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ

టాటా నానో ఎలక్ట్రిక్ కార్
మధ్యతరగతి ప్రజల కలల కారుగా ఎన్నో ఆశలతో మార్కెట్లోకి వచ్చి, ఆదిలో అంతమైపోయిన టాటా నానో కారును ఇప్పుడు తిరిగి ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ కారును భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. - దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టాటా ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ కారు
టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'ఆల్ట్రోజ్'లో కూడా కంపెనీ ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను డెవలప్ చేస్తోంది. ఆల్ట్రోజ్ కారును ఆల్ఫా ఆర్కిటెక్చర్‌పై నిర్మించిన కారణంగా, దీని అండర్‌పిన్నింగ్‌లో మార్పులు చేసే ఎలాంటి పవర్‌ట్రైన్‌ను అయినా ఇందులో చేర్చే అవకాశం ఉంటుంది. కంపెనీ తొలిసారిగా 2020 ఆటో ఎక్స్ పోలో ఈ కారును ప్రదర్శించింది. ఇది కూడా కాన్సెప్ట్ నుండి ప్రొడక్షన్ దశకు చేరుకునే అవకాశం ఉంది. మార్కెట్లో దీని ధర రూ.10 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.
MOST READ:నిండు ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్.. ఎలా అనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

టాటా టిగోర్ ఈవీ
కంపెనీ విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ సెడాన్ టిగోర్‌లో కూడా కంపెనీ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను టెస్ట్ చేస్తోంది. ఇందులో 72 వోల్ట్ త్రీ-స్టేజ్ ఏసి ఇండక్షన్ మోటారు ఉంటుంది. ఇది 21.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 40 బిహెచ్‌పి పవర్‌ను మరియు 105 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పూర్తి చార్జ్‌పై 213 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు కూడా భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టాటా నెక్సాన్ ఈవీ
ప్రస్తుతం టాటా నుండి లభిస్తున్న, దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు నెక్సాన్ ఈవీ. ఈ కారులో 95 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, ఇది 30.2 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 129 బిహెచ్‌పి శక్తిని మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్‌తో లభిస్తుంది.
MOST READ:ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ డెలివరీ చేసుకున్న ఎలోన్ మస్క్ ; వివరాలు

హోమ్ ఛార్జర్ ద్వారా నెక్సాన్ ఈ.వి కారు పూర్తిగా ఛార్జ్ చేయటానికి సుమారు 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, కేవలం 60 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.