టాటా సఫారీ న్యూ రికార్డ్.. 4 నెలల్లో 10,000 యూనిట్లు ఉత్పత్తి

భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'టాటా మోటార్స్' తన న్యూ జనరేషన్ టాటా సఫారిని 2021 ఫిబ్రవరి 22 దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఇండియన్ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఈ టాటా సఫారి మంచి ప్రజాదరణ పొందింది. ఈ 6/7 సీట్ల ఎస్‌యూవీ యొక్క ఉత్పత్తి ఇప్పుడు ఏకంగా 10,000 యూనిట్లు పూర్తయినట్లు కంపెనీ సమాచారం అందించింది.

టాటా సఫారీ న్యూ రికార్డ్.. 4 నెలల్లో 10,000 యూనిట్లు ఉత్పత్తి

నివేదికల ప్రకారం కంపెనీ తన 10,000 వ యూనిట్‌ను పూణేలోని తన తయారీ కర్మాగారం నుండి విడుదల చేసింది. టాటా సఫారి యొక్క మొదటి 100 యూనిట్లు ఫిబ్రవరి 2021 లో ఉత్పత్తి చేయకపోగా, మిగిలిన 9,900 యూనిట్లు కొత్త సఫారీలను కంపెనీ మార్చి, ఏప్రిల్, మే మరియు జూన్ చివరి నాలుగు నెలల మధ్య ఉత్పత్తి చేసినట్లు తెలిపింది.

టాటా సఫారీ న్యూ రికార్డ్.. 4 నెలల్లో 10,000 యూనిట్లు ఉత్పత్తి

కొత్త టాటా సఫారీ యొక్క కొత్త కార్ యొక్క 10,000 యూనిట్లను ఉత్పత్తి చేసిన సందర్భంగా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ "నాలుగు నెలల వ్యవధిలో కొత్త సఫారీల కోసం ఈ ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు, అంతే కాకూండా దేశ చరిత్రలోనే ఒక క్లిష్ట పరిస్థితిలో కూడా ఈ రికార్డ్ సాధించగలిగింది.

టాటా సఫారీ న్యూ రికార్డ్.. 4 నెలల్లో 10,000 యూనిట్లు ఉత్పత్తి

టాటా సఫారి యొక్క 10,000 యూనిట్లు ఉత్పత్తికి యాజమాన్యం ఎంతగానో కృషి చేసింది. ఈ కృషికి నిదర్శనమే ఈ 10,000 వ టాటా సఫారీ, అని ఆయన అన్నారు. కొత్త టాటా సఫారి 6 మరియు 7 సీట్ల కాన్ఫిగరేషన్లలో అందించబడుతుంది.

టాటా సఫారీ న్యూ రికార్డ్.. 4 నెలల్లో 10,000 యూనిట్లు ఉత్పత్తి

టాటా మోటార్స్ యొక్క కొత్త టాటా సఫారి తన విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటి అని, ఈ విభాగంలో ప్రస్తుత మార్కెట్ వాటా 25.2% ఉందని కంపెనీ తెలియజేసింది. దీనిని బట్టి చూస్తే, మార్కెట్లో ఈ ఎస్‌యూవీకి ఎంత ఆదరణ ఉందో తెలుస్తుంది.

టాటా సఫారీ న్యూ రికార్డ్.. 4 నెలల్లో 10,000 యూనిట్లు ఉత్పత్తి

కొత్త టాటా సఫారి అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కారు యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది ఇంపాక్ట్ 2.0 డిజైన్ భాషపై దీనిని తయారు చేశారు. దీని ముందు భాగంలో 'వై' ఆకారపు గ్రిల్, స్లిమ్ ఎల్ఈడి ఫాగ్ లాంప్స్, ఎల్ఈడి హెడ్ లైట్ మరియు టర్న్ ఇండికేటర్లను పొందుతుంది. బంపర్లో లైన్స్ కూడా గమనించవచ్చు. ఈ లైన్స్ ఈ సఫారీని చాలా ఆకర్షణీయంగా చేస్తుంది.

టాటా సఫారీ న్యూ రికార్డ్.. 4 నెలల్లో 10,000 యూనిట్లు ఉత్పత్తి

సఫారి యొక్క సైడ్ ప్రొఫైల్ హారియర్‌తో సరిపోయే 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. వెనుక భాగంలో కొత్త డిజైన్ ఇవ్వబడింది, కొత్త బంపర్స్, బ్లాక్ అవుట్ ఎల్ఈడి టైల్ లాంప్స్ మరియు సఫారి బ్యాడ్జ్ వంటి వాటిని పొందుతుంది. దీనితో పాటు మూడవ వరుస కారణంగా ఆకారం కూడా కొంత మార్చబడింది.

టాటా సఫారీ న్యూ రికార్డ్.. 4 నెలల్లో 10,000 యూనిట్లు ఉత్పత్తి

ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అద్బుతంగా ఉంటుంది. ఇందులో కొత్త లెదర్ సీట్ అప్హోల్స్ట్రే, బీజ్ కలర్ ఇంటీరియర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రియర్ ఎయిర్ వెంట్స్, యుఎస్బి ఛార్జింగ్ స్లాట్లు, 8.8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, జెబిఎల్ స్పీకర్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ఐఆర్‌ఎ కనెక్ట్ టెక్నాలజీతో పాటు హిందీ, ఇంగ్లీష్ మరియు హింగ్లిష్ వాయిస్ అసిస్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి.

టాటా సఫారీ న్యూ రికార్డ్.. 4 నెలల్లో 10,000 యూనిట్లు ఉత్పత్తి

కొత్త తరం టాటా సఫారి 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 173 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. దీనితో పాటు అదనపు బరువును నిర్వహించడానికి కంపెనీ ఈ కారు యొక్క నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు ఏర్పాటు చేసింది.

టాటా సఫారీ న్యూ రికార్డ్.. 4 నెలల్లో 10,000 యూనిట్లు ఉత్పత్తి

టాటా సఫారి దేశీయ మార్కెట్లో ఎంజి హెక్టర్ ప్లస్ మరియు మహీంద్రా ఎక్స్‌యువి 500 లతో పాటు రాబోయే 7 సీట్ల హ్యుందాయ్ క్రెటా మరియు 7 సీట్ల జీప్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Tata Motors Rolled Out 10000 Th New Gen Safari From Pune Plant. Read in Telugu.
Story first published: Tuesday, July 27, 2021, 14:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X