2021 జులై నెలలో టాటా మోటార్స్ అమ్మకాల హవా; ఏకంగా 92% వృద్ధి

2021 జులై నెల ముగిసింది. ఈ నేపథ్యంలో భాగంగానే అన్ని ఆటో మొబైల్ కంపెనీలు జూలై నెల అమ్మకాలు నివేదికలను విడుదల చేశాయి. ఇందులో భాగంగానే ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన అమ్మకాలు నివేదికను కూడా విడుదల చేసింది. టాటా మోటార్స్ యొక్క జులై నెల అమ్మకాలను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2021 జులై నెలలో టాటా మోటార్స్ అమ్మకాల హవా; ఏకంగా 92% వృద్ధి

టాటా మోటార్స్ విడుదల చేసిన నివేదికల ప్రకారం జులై నెలలో ఏకంగా 92% వృద్ధిని నమోదు చేసింది. ఇందులో 51,981 యూనిట్ల వాహనాలను దేశీయ మార్కెట్లో విక్రయించినట్లు తెలిసింది. ఈ అమ్మకాలలో ప్యాసింజర్ వాహనాలు 30,185 యూనిట్లు కాగా, కమర్షియల్ వెహికల్స్ 23,848 యూనిట్లు ఉన్నాయి. దీని ప్రకారం కంపెనీ మునుపటి కంటే కూడా ప్యాసింజర్ వాహన విభాగంలో 101% వృద్ధిని మరియు కమర్షియల్ వెహికల్ విభాగంలో 88% వృద్ధిని నమోదు చేసినట్లు తెలిసింది.

2021 జులై నెలలో టాటా మోటార్స్ అమ్మకాల హవా; ఏకంగా 92% వృద్ధి

టాటా మోటార్స్ యొక్క అమ్మకాలు దినిదినాభివృద్ది చెందుతున్నాయి. ప్రస్తుతం కంపెనీ అమ్మకాలు భాగా వృద్ధి చెందాయి. జూన్ 2021 లో కంపెనీ 43,704 యూనిట్లను విక్రయించగా, అదే 2020 జూలైలో 27,024 యూనిట్లను మాత్రమే విక్రయించినట్లు తెలిసింది.

2021 జులై నెలలో టాటా మోటార్స్ అమ్మకాల హవా; ఏకంగా 92% వృద్ధి

టాటా మోటార్స్ అమ్మకాలు కమర్షియల్ విభాగంలో దేశీయ మార్కెట్‌లో 21,796 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఇది జూన్ 2021 లో 19,594 యూనిట్లు కాగా, అదేవిధంగా గత ఏడాది జూలైలో 12,012 యూనిట్లను మాత్రమే విక్రయించినట్లు తెలుస్తోంది.

2021 జులై నెలలో టాటా మోటార్స్ అమ్మకాల హవా; ఏకంగా 92% వృద్ధి

కంపెనీ యొక్క ఎగుమతుల విషయానికి వస్తే, జూలైలో 2,052 యూనిట్లు ఎగుమతి చేయబడ్డాయి, ఇది జూన్ 2021 లో 2,506 యూనిట్లు మరియు గత సంవత్సరం జూలైలో 676 యూనిట్లు. కంపెనీ యొక్క మొత్తం అమ్మకాలు 23,848 యూనిట్లుగా ఉన్నాయి. గత సంవత్సరం కంటే ఇది 88% తగ్గుదలను నమోదు చేసింది.

2021 జులై నెలలో టాటా మోటార్స్ అమ్మకాల హవా; ఏకంగా 92% వృద్ధి

టాటా మోటార్స్ యొక్క ప్యాసింజర్ వాహన విభాగం విషయానికి వస్తే, 2021 జూన్ లో 24,110 యూనిట్లు మరియు గత సంవత్సరం జూలైలో 15,012 యూనిట్లు గా తెలుస్తోంది. గత కొంతకాలంగా భారతదేశంలో అమ్మకాల పరంగా టాటా మోటార్స్ మూడవ స్థానంలో ఉంది.

2021 జులై నెలలో టాటా మోటార్స్ అమ్మకాల హవా; ఏకంగా 92% వృద్ధి

టాటా మోటార్స్ కంపెనీ తన వాహనాలను నిరంతరం అప్‌డేట్ చేస్తోంది. ఈ కారణంగానే దేశీయ మరియు విదేశీ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇందులో టాటా నెక్సాన్, టాటా టియాగో, టాటా ఆల్ట్రోజ్, టాటా హారియర్ మరియు టాటా సఫారి వంటి మోడల్స్ మంచి అమ్మకాలను సొంతం చేసుకున్నాయి.

2021 జులై నెలలో టాటా మోటార్స్ అమ్మకాల హవా; ఏకంగా 92% వృద్ధి

టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో వాహన వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకర్షించడానికి కొత్త వాహనాలను లేదా అప్డేటెడ్ వాహనాలను మార్కెట్లో ప్రవేశపెడుతోంది. కంపెనీ త్వరలో ప్రస్తుతం ఉన్న మోడళ్లను సిఎన్జి వెర్షన్ లో తీసుకురావడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

Most Read Articles

English summary
Tata Motors Sales 2021 July. Read in Telugu.
Story first published: Monday, August 2, 2021, 13:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X