Just In
- 1 hr ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- 14 hrs ago 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 16 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 17 hrs ago కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
Don't Miss
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
టియాగో ఎన్ఆర్జి ఫేస్‌లిఫ్ట్ కార్ టీజర్ లాంచ్ చేసిన టాటా మోటార్స్
భారత మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్' తన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగో యొక్క ఎన్ఆర్జి ఎడిషన్‌ను తిరిగి మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇటీవల కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కొత్త టాటా టియాగో ఎన్ఆర్జి ఎడిషన్ 2021 ఆగస్టు 4 న ప్రారంభించే అవకాశం ఉంది.
టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో ప్రారంభించబోయే తన కొత్త టాటా టియాగో ఎన్ఆర్జి ఫేస్ లిఫ్ట్ యొక్క టీజర్ విడుదల చేసింది. కంపెనీ 2020 జనవరిలో ఫేస్‌లిఫ్టెడ్ టాటా టియాగోను ప్రవేశపెట్టడానికి ముందే, ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క ఎన్ఆర్జి వేరియంట్ యొక్క అమ్మకాలను నిలిపివేసింది. కానీ ఇప్పుడు టాటా మోటార్స్ ఈ వేరియంట్‌ను ఎస్యూవీ స్టైలింగ్ ఎలిమెంట్స్‌తో ఫేస్‌లిఫ్టెడ్ టాటా టియాగోతో తిరిగి దేశీయ మార్కెట్లో విడుదల చేయనుంది.
కొత్త టాటా టియాగో ఎన్ఆర్జి చూడటానికి చాలా స్టైలిష్ గా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది. కొత్త టాటా టియాగో ఎన్ఆర్జి మోడల్ ఆల్‌రౌండ్ బాడీ క్లాడింగ్, టెయిల్‌గేట్‌పై బ్లాక్ ప్లాస్టిక్ ఎలిమెంట్ మరియు ఎస్‌యూవీలా కనిపించేలా అప్డేటెడ్ వీల్స్ పొందే అవకాశం ఉంటుంది.
టాటా మోటార్స్ యొక్క ఈ కొత్త వెర్షన్, దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. టాటా టియాగో యొక్క స్టాండర్డ్ మోడల్ 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. అయితే ఈ కొత్త మోడల్ యొక్క డిజైన్ దాదాపు దాని స్టాండర్డ్ టాటా టియాగో మోడల్ మాదిరిగానే ఉంటుంది.
కొత్త టియాగో ఎన్ఆర్జి వెర్షన్లో ఎసి వెంట్స్ మరియు గేర్ లివర్ చుట్టూ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ ఫినిషింగ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ వెర్షన్ మల్టిపుల్ అప్హోల్స్టరీని కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ట్రై-యారో డిజైన్ ఎలిమెంట్స్ ఫాబ్రిక్ మీద ఉపయోగించవచ్చు. మొత్తానికి ఇది వాహనదారులకు అనుకూలంగా ఉండేవిధంగా తయారవుతుంది అని చెప్పవచ్చు.
ఈ కొత్త వెర్షన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది దాని స్టాండర్డ్ మోడల్‌తో సమానంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్, హర్మాన్ సౌండ్ సిస్టమ్ మరియు రిమోట్ లాకింగ్ / అన్‌లాకింగ్‌తో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను పొందవచ్చు.
ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఈబిడి, కెమెరాతో రియర్ పార్కింగ్ సెన్సార్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. అయితే టాటా మోటార్స్ ఈ మోడల్ యొక్క యాంత్రిక అంశాలలో ఎటువంటి మార్పులు చేయలేదు.
కొత్త టాటా టియాగో ఎన్ఆర్జి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లో 1.2-లీటర్ రివోట్రాన్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 86 బిహెచ్పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎంటి గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. టాటా మోటార్స్ ఈ కొత్త టియాగో ఎన్ఆర్జి ధర ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.