Tata Motors కొత్త రికార్డ్.. ఎలక్ట్రిక్ వాహన అమ్మకాల్లో కొత్త మైలురాయి

దేశీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన Tata Motors (టాటా మోటార్స్) భారతదేశంలో తనకంటూ ఒక స్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. Tata Motors సాధారణ కార్లతో పాటు ఎలక్ట్రిక్ కార్లను కూడా దేశీయ మార్కెట్లో విడుదల చేసి అత్యంత ప్రజాదరణ పొందుతోంది. Tata Motors యొక్క ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ప్రస్తుతం Tata Nexon EV మరియు Tata Tigor EV అనే రెండు మోడల్స్ ఉన్నాయి.

Tata Motors కొత్త రికార్డ్.. ఎలక్ట్రిక్ వాహన అమ్మకాల్లో కొత్త మైలురాయి

భారతీయ మార్కెట్లో కంపెనీ Tata Nexon EV మరియు Tata Tigor EV లను ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటికి 10,000 వాహనాలను (ఎలక్ట్రిక్ వాహనాలను) విక్రయించగలిగింది. ఇది ప్రస్తుత కాలంలో కంపెనీ సాధించిన ఒక గొప్ప విజయం అనే చెప్పాలి. ఎందుకంటే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను సరైన మౌలిక సదుపాయాలు అంటే ఛార్జింగ్ స్టేషన్స్ లేని సమయంలో ఇన్ని ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడం అనేది అరుదైన విషయమే.

Tata Motors కొత్త రికార్డ్.. ఎలక్ట్రిక్ వాహన అమ్మకాల్లో కొత్త మైలురాయి

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన శకం ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలో భాగంగానే చాలా కంపెనీలు ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఈ సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్స్ అవసరమైనన్ని అందుబాటులో ఉండాలి, కావున చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచడం కోసం ఎక్కువా సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నాయి.

Tata Motors కొత్త రికార్డ్.. ఎలక్ట్రిక్ వాహన అమ్మకాల్లో కొత్త మైలురాయి

మౌలిక సదుపాయాలు అంతగా లేని రోజుల్లో ఇన్ని ఎలక్ట్రిక్ కార్లను అమ్మగలిగిన Tata Motors ఇకపై మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించగలుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. Tata Motors భవిష్యత్ ప్రణాళికను ఇప్పుడే ఏర్పాటు చేస్తుంది.

Tata Motors కొత్త రికార్డ్.. ఎలక్ట్రిక్ వాహన అమ్మకాల్లో కొత్త మైలురాయి

Tata Motors 10,000 EV అమ్మి అరుదైన ఘనతను సాధించిన సమయంలో, ఈ అమ్మకాల గురించి ప్రస్తావిస్తూ, ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్, శైలేష్ చంద్ర మాట్లాడుతూ, భారతీయ రోడ్లపై 10,000 EV లను వినియోగించడం అనేది మా కస్టమర్లకు బ్రాండ్ పై ఉన్న నమ్మకాన్ని తెలుపుతుంది. భవిష్యత్ లో కూడా మా కస్టమర్ల నమ్మకాన్ని ఎటువంటి లోటు లేకుంటే చేయడానికి కంపెనీ ఎల్లవేళలా కృషి చేస్తుంది, అన్నారు.

Tata Motors కొత్త రికార్డ్.. ఎలక్ట్రిక్ వాహన అమ్మకాల్లో కొత్త మైలురాయి

Tata Motors [టాటా మోటార్స్] ఇటీవల తన ఫ్లీట్ ఆపరేటర్ కస్టమర్ల కోసం భారత మార్కెట్లో కొత్త Tata XPRES T EV ని విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 9.54 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుని రెండు వేరియంట్లలో విడుదల చేసింది.

Tata Motors కొత్త రికార్డ్.. ఎలక్ట్రిక్ వాహన అమ్మకాల్లో కొత్త మైలురాయి

కంపెనీ ఈ Tata xpres-T EV ఎలక్ట్రిక్ కారులో లాంగ్ రేంజ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాలను కల్పించింది. కస్టమర్ల అవసరాలను బట్టి కొత్త XPRES-T ఎలక్ట్రిక్ సెడాన్ 2 రేంజ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో కంపెనీ 21.5 kWh మరియు 16.5 kWh అనే రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లను అందిస్తోంది.

Tata Motors కొత్త రికార్డ్.. ఎలక్ట్రిక్ వాహన అమ్మకాల్లో కొత్త మైలురాయి

ఇందులోని 21.5 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన వేరియంట్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 213 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుండగా, 16.5 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన వేరియంట్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 165 కిలోమీటర్ల రేంజ్ ని ఆఫర్ చేస్తుంది. ఈ రేంజ్ ని ARAI ధృవీకరించింది.

Tata Motors కొత్త రికార్డ్.. ఎలక్ట్రిక్ వాహన అమ్మకాల్లో కొత్త మైలురాయి

Tata Motors ఈ ఎలక్ట్రిక్ సెడాన్‌ ను XM మరియు XZ అనే రెండు ట్రిమ్ లలో ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ కారు సున్నా కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఇది సింగిల్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులోని అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు (ఫ్రంట్ డ్రైవర్ మరియు కో ప్యాసింజర్ కోసం) మరియు ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్ గా లభిస్తాయి.

Tata Motors కొత్త రికార్డ్.. ఎలక్ట్రిక్ వాహన అమ్మకాల్లో కొత్త మైలురాయి

చార్జింగ్ విషయానికి వస్తే, Tata XPRES-T EV ఎలక్ట్రిక్ కారులోని 16.5 kWh బ్యాటరీ ప్యాక్‌ ని ఫాస్ట్ ఛార్జింగ్ ఉపయోగించి కేవలం 90 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే, ఇందులోని 21.5 kWh బ్యాటరీ ప్యాక్‌ ను 110 నిమిషాల్లో 0 నుండి నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

Tata Motors కొత్త రికార్డ్.. ఎలక్ట్రిక్ వాహన అమ్మకాల్లో కొత్త మైలురాయి

ఫాస్ట్ చార్జర్ కాకుండా, ఇది స్టాండర్డ్ 15 amp హోమ్ చార్జర్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ కారును ఏదైనా సాధారణ 15 amp ప్లగ్ పాయింట్ నుండి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో స్టాండర్డ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ ను కంపెనీ అందిస్తోంది. అంతేకాకుండా, దీని ఇంటీరియర్ థీమ్ మొత్తం ప్రీమియం బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడి ఉంటుంది. మొత్తానికి ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్, వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Tata motors sold 10000 units electric vehicles in indian market details
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X