టాటా కార్ ప్రియులకు షాకింగ్ న్యూస్: వరుసగా మూడోసారి ధరల పెంపు!

ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వాహనాల ధరలను మరోసారి పెంచింది. దేశీయ విపణిలో టాటా మోటార్స్ విక్రయిస్తున్న తమ 'న్యూ ఫరెవర్' రేంజ్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ అధికారిక ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

టాటా కార్ ప్రియులకు షాకింగ్ న్యూస్: వరుసగా మూడోసారి ధరల పెంపు!

టాటా మోటార్స్ ఈ ఏడాది ఆరంభంలో తమ వాహనాల ధరలను మొదటిసారిగా పెంచగా, ఈ ఏడాది మే నెలలో రెండవసారి పెంచింది. కాగా, ఇప్పుడు కంపెనీ తమ వాహనాల ధరలను పెంచడం ఈ ఏడాదిలో ఇది మూడవసారి.

టాటా కార్ ప్రియులకు షాకింగ్ న్యూస్: వరుసగా మూడోసారి ధరల పెంపు!

కొన్ని నెలల క్రితమే టాటా మోటార్స్ మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి తమ ప్యాసింజర్ వాహనాల ధరలను రూ.28,000 వరకు పెంచింది. కాగా ఇప్పుడు, కంపెనీ మళ్లీ తమ వాహనాల ధరలను పెంచింది. ఇన్పుట్ వ్యయం పెరగడం వల్ల ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వచ్చిందని టాటా మోటార్స్ తెలిపింది.

టాటా కార్ ప్రియులకు షాకింగ్ న్యూస్: వరుసగా మూడోసారి ధరల పెంపు!

భారతదేశంలో కాలుష్య ఉద్గార నిబంధనల విషయంలో ప్రభుత్వం తీసుకున్న కఠినమైన నిర్ణయాల (బిఎస్6 నిబంధనల) కారణంగా, పల్లాడియం మరియు ప్లాటినం వంటి అరుదైన లోహాలకు డిమాండ్ రెట్టింపు అయ్యింది. వాహనాలలో ఉద్గారాలను తగ్గించడానికి ఎగ్జాస్ట్ ఉత్ప్రేరకంలో ఈ లోహాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

టాటా కార్ ప్రియులకు షాకింగ్ న్యూస్: వరుసగా మూడోసారి ధరల పెంపు!

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా కూడా ఇలాంటి కారణాలను చూపుతూ, జులై నెలలో తమ వాహనాల ధరలను పెంచునున్నట్లు ప్రకటించింది. మారుతి సుజుకి బాటలోనే ఇప్పుడు టాటా మోటార్స్ కూడా తమ వాహనాల ధరలను పెంచింది.

టాటా కార్ ప్రియులకు షాకింగ్ న్యూస్: వరుసగా మూడోసారి ధరల పెంపు!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు ఉన్నప్పటికీ, టాటా మోటార్స్ యొక్క జూన్ 2020 అమ్మకాల సంఖ్యతో పోలిస్తే జూన్ 2021లో కంపెనీ అద్భుతమైన అమ్మకాలను నమోదు చేసింది. జూన్ 2020లో, టాటా మోటార్స్ కేవలం 11,419 యూనిట్లను మాత్రమే విక్రయించగా, జూన్ 2021లో 24,110 యూనిట్లను విక్రయించింది.

టాటా కార్ ప్రియులకు షాకింగ్ న్యూస్: వరుసగా మూడోసారి ధరల పెంపు!

ఇదిలా ఉంటే, టాటా మోటార్స్ తాజాగా తమ పాపులర్ ఆల్ట్రోజ్, నెక్సాన్, నెక్సాన్ ఈవీ మరియు హారియర్ మోడళ్లలో ప్రత్యేకమైన డార్క్ ఎడిషన్లను మార్కెట్లో విడుదల చేసింది. డార్క్ ఎడిషన్ పేరుకు తగినట్లుగానే ఈ ప్రత్యేకమైన మోడళ్లు వెలుపల మరియు లోపలివైపు డార్క్ థీమ్‌ను కలిగి ఉంటాయి. - ఈ కార్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Tata Motors To Increase Cars Prices In July; Will Be The Third Price Hike In 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X