భారత మార్కెట్లో ఒకేసారి 21 కమర్షియల్ వాహనాలను విడుదల చేసిన Tata Motors: పూర్తి వివరాలు

భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు కస్టమర్లకు ఎంతగానో నమ్మే వాహన తయారీ సంస్థ Tata Motors (టాటా మోటార్స్). ఇప్పటివరకు భారతీయ మార్కెట్లో కనివిని ఎరుగని విధంగా Tata Motors ఒక్కసారిగా 21 కమర్షియల్ వాహనాలను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ కమర్షియల్ వెహికల్స్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

భారత మార్కెట్లో ఒకేసారి 21 కమర్షియల్ వాహనాలను విడుదల చేసిన Tata Motors: పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో Tata Motors ప్రయాణీకుల రవాణా మరియు కార్గో విభాగంలో విభిన్న అవసరాలను తీర్చడానికి కొత్త వాణిజ్య వాహనాలు ప్రవేశపెట్టింది. టాటా యొక్క కొత్త కార్గో వాహనాలలో లైట్, మీడియం మరియు హెవీ వెయిట్ వెహికల్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో చిన్న మరియు పెద్ద బస్సులతో పాటు వాణిజ్య ప్రయాణీకుల వాహనాలలో కూడా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టారు.

భారత మార్కెట్లో ఒకేసారి 21 కమర్షియల్ వాహనాలను విడుదల చేసిన Tata Motors: పూర్తి వివరాలు

టాటా మోటార్స్ మార్కెట్లో విడుదల చేసిన వాహనాలలో, 7 మిడిల్ మరియు హెవీ వెహికల్స్, 4 పికప్ వెహికల్స్, 5 లైట్ వెయిట్ వెహికల్స్ మరియు 5 వెహికల్స్ ప్యాసింజర్ విభాగంలో ప్రవేశపెట్టబడ్డాయి.

భారత మార్కెట్లో ఒకేసారి 21 కమర్షియల్ వాహనాలను విడుదల చేసిన Tata Motors: పూర్తి వివరాలు

మిడిల్ మరియు హెవీ వెహికల్స్ విభాగంలో 7 వెహికల్స్ విడుదలయ్యాయి:

అవి:

1) Signa 5530.S (సిగ్నా 5530.ఎస్)

2) Signa 4623.S (సిగ్నా 4623.ఎస్)

3) Signa 4625.S ESC (సిగ్నా 4625.ఎస్ ఈఎస్‌సి)

4) Signa 4221.T (సిగ్నా 4221.టి)

5) Signa 4021.S (సిగ్నా 4021.ఎస్)

6) Signa 3118.T (సిగ్నా 3118.టి)

7) Prima 2830.K (ప్రైమ్ 2830.కె)

ఈ ట్రక్కులు మార్కెట్ లోడ్, సిమెంట్, ఐరన్ & స్టీల్, కంటైనర్, వెహికల్ క్యారియర్, పెట్రోలియం, కెమికల్, వాటర్ ట్యాంకర్లు, LPG, FMCG, వైట్ గూడ్స్, పాడైపోయే వస్తువులు, మైనింగ్, మునిసిపల్ అప్లికేషన్‌లు వంటి సమగ్ర శ్రేణి వస్తువుల తరలింపునకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా సుదూర ప్రాంతాలకు కూడా సునాయాసంగా ప్రయయించడానికి చాలా అనుకూలంగా ఉంటాయి.

భారత మార్కెట్లో ఒకేసారి 21 కమర్షియల్ వాహనాలను విడుదల చేసిన Tata Motors: పూర్తి వివరాలు

లైట్ వెయిట్ వెహికల్స్ విభాగంలో 5 వాహనాలు విడుదలయ్యాయి.

అవి:

1) Ultra T.18 SL (అల్ట్రా టి.18 ఎస్ఎల్)

2) 407G (407జి)

3) 709G CNG (709జి సిఎన్‌జి)

4) LPT 510 (ఎల్‌పిటి 510)

5) Ultra T.6 (అల్ట్రా టి.6)

Tata Motors ఇప్పటికే లైట్ వెయిట్ వెహికల్స్ డీజిల్ మరియు CNG పవర్‌ట్రెయిన్‌లలో విక్రయిచింది. కంపెనీ ఇప్పటికే 50,000 కంటే ఎక్కువ వాహనాలు విక్రయించింది. ఇప్పుడు విడుదలైన వాహనాలు ఆధునిక ఫీచర్స్ కలిగి వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

భారత మార్కెట్లో ఒకేసారి 21 కమర్షియల్ వాహనాలను విడుదల చేసిన Tata Motors: పూర్తి వివరాలు

స్మాల్ కమర్షియల్ వెహికల్స్ మరియు పికప్ ట్రక్ వెహికల్స్ విభాగంలో 4 వెహికల్స్ విడుదలయ్యాయి.

అవి :

1) Winger Cargo (వింగర్ కార్గో)

2) Ace Petrol CX cab chassis (ఏస్ పెట్రోల్ సిఎక్స్ క్యాబ్ ఛాసిస్)

3) Ace Gold Diesel+ (ఏస్ గోల్డ్ డీజిల్ ప్లస్)

4) Intra V30 High deck (ఇంట్రా వి30 హై డెక్)

టాటా మోటార్స్ దాదాపు 30 లక్షల మంది భారతీయులకు జీవనోపాధిని అందించడం ద్వారా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో స్వయం ఉపాధిని పెంపొందించాయి.ఈ స్మాల్ కమర్షియల్ వెహికల్స్ మరియు పికప్ ట్రక్ పోర్ట్‌ఫోలియో గత 16 సంవత్సరాలుగా విపరీతంగా అభివృద్ధి చెందింది. ఈ శ్రేణిలో ఏస్, ఇంట్రా మరియు కఠినమైన యోధా బ్రాండ్‌లను కలిగి ఉంది.

భారత మార్కెట్లో ఒకేసారి 21 కమర్షియల్ వాహనాలను విడుదల చేసిన Tata Motors: పూర్తి వివరాలు

ఈ విభాగంలోకి మార్కెట్ లాజిస్టిక్స్, పండ్లు, కూరగాయలు మరియు వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీ, పానీయాలు & సీసాలు, FMCG మరియు FMCD వస్తువులు, ఇ-కామర్స్, పార్శిల్ & కొరియర్, ఫర్నీచర్ వంటి వాటిని తరలించడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా LPG సిలిండర్లు, పాల ఉత్పత్తులు, ఫార్మా మరియు ఆహార ఉత్పత్తులు, రిఫ్రిజిరేటెడ్ రవాణా, అలాగే వ్యర్థ పదార్థాల రవాణా చేయడానికి కూడా ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి.

భారత మార్కెట్లో ఒకేసారి 21 కమర్షియల్ వాహనాలను విడుదల చేసిన Tata Motors: పూర్తి వివరాలు

ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో కూడా 5 వాహనాలు విడుదలయ్యాయి.

అవి:

1) Winger 15S (వింగర్ 15ఎస్)

2) Starbus 4/12 (స్టార్‌బస్ 4/12)

3) Starbus 2200 (స్టార్‌బస్ 2200)

4) Cityride Prime (సిటీరైడ్ ప్రైమ్)

5) Magna coach (మాగ్నా కోచ్)

భారత మార్కెట్లో ఒకేసారి 21 కమర్షియల్ వాహనాలను విడుదల చేసిన Tata Motors: పూర్తి వివరాలు

భారత మార్కెట్లో టాటా మోటార్స్ యొక్క ప్యాసింజర్ వాహన విభాగానికి అత్యంత ఆదరణ ఉంది. కంపెనీ ఇప్పుడు ఈ విభాగంలో 5 వాహనాలను విడుదల చేసింది. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. టాటా మోటార్స్ యొక్క ఈ వాహనాలు స్కూల్, ఆఫీస్ మరియు ప్రజా రవాణా కోసం వినియోగించబడతాయి.

భారత మార్కెట్లో ఒకేసారి 21 కమర్షియల్ వాహనాలను విడుదల చేసిన Tata Motors: పూర్తి వివరాలు

సున్నా ఉద్గారాలను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ తన కొత్త శ్రేణి ఎలక్ట్రిక్ స్టార్‌బస్ 4/12ను పరిచయం చేసింది. అదే సమయంలో, సిటీరైడ్ ప్రైమ్ ప్రయాణీకులకు మెరుగైన స్థలాన్ని మరియు సౌకర్యాన్ని అందిస్తుంది. ఇంటర్‌సిటీ ప్రయాణం కోసం కంపెనీ మాగ్నా కోచ్ లగ్జరీ బస్సును ప్రవేశపెట్టింది. బస్సు 13.5 మీటర్ల పొడవు మరియు ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సీటింగ్ ఆప్సన్ కూడా అందిస్తుంది.

భారత మార్కెట్లో ఒకేసారి 21 కమర్షియల్ వాహనాలను విడుదల చేసిన Tata Motors: పూర్తి వివరాలు

టాటా గ్రూప్‌లో భాగమైన టాటా మోటార్స్ లిమిటెడ్ కార్లు, యుటిలిటీ వాహనాలు మొదలైన వాహనాలు తయారు చేసే ప్రముఖ ప్రపంచ ఆటోమొబైల్ తయారీదారు. అంతే కాకుండా కంపెనీ ట్రక్కులు మరియు బస్సులు, సమగ్రమైన, స్మార్ట్ మరియు ఇ-మొబిలిటీ సొల్యూషన్‌ల విస్తృత శ్రేణిని అందిస్తోంది. టాటా మోటార్స్ వాణిజ్య వాహనాలలో భారతదేశపు మార్కెట్ లీడర్. అయితే ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌లో మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా నిలిచింది.

భారత మార్కెట్లో ఒకేసారి 21 కమర్షియల్ వాహనాలను విడుదల చేసిన Tata Motors: పూర్తి వివరాలు

టాటా మోటార్స్ భారతదేశం, యూకే, అమెరికా, ఇటలీ మరియు దక్షిణ కొరియాలో అత్యాధునిక డిజైన్ మరియు R&D కేంద్రాల ద్వారా కస్టమర్‌ల ఊహలను ఉత్తేజపరిచే కొత్త ఉత్పత్తులను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అంతే కాకుండా భారతదేశం, యుకె, దక్షిణ కొరియా, థాయిలాండ్, దక్షిణాఫ్రికా మరియు ఇండోనేషియాలో కార్యకలాపాలతో, 2021 మార్చి 31 నాటికి 103 అనుబంధ సంస్థలు, 9 అసోసియేట్ కంపెనీలు, 4 జాయింట్ వెంచర్లు మరియు 2 జాయింట్ కార్యకలాపాలతో కూడిన బలమైన గ్లోబల్ నెట్‌వర్క్ ఏర్పరచుకుంది.

భారత మార్కెట్లో ఒకేసారి 21 కమర్షియల్ వాహనాలను విడుదల చేసిన Tata Motors: పూర్తి వివరాలు

టాటా మోటార్స్ తమ వాహనాలను ఆఫ్రికా, దక్షిణ & ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా మరియు రష్యా వంటి దేశాల్లో కూడా తమ వాహనాలు విస్తృతంగా విక్రయిస్తోంది. పైన చెప్పిన వాహనాల ధరలు మొదలైన మరిన్ని వివరాల కోసం కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ చూడండి.

Most Read Articles

English summary
Tata motors unveils new range of 21 commercial vehicles details
Story first published: Thursday, October 28, 2021, 19:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X