ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Tata Punch: ధర & పూర్తి వివరాలు

ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ అయిన Tata Motors (టాటా మోటార్స్) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో కొత్త Tata Punch (టాటా పంచ్) మైక్రో SUV ని విడుదల చేసింది. ఈ కొత్త SUV ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 5.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త SUV యొక్క బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభయ్యాయి. Tata Punch కొనుగోలు చేయాలనే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లేదా ఏదైనా అధికారిక డీలర్‌షిప్ నుండి ముందస్తుగా రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Tata Punch: ధర & పూర్తి వివరాలు

టాటా పంచ్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ మరియు క్రియేటివ్‌ వేరియంట్స్. ఇందులో ప్యూర్ వేరియంట్ కాకుండా మిగిలిన మూడు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Tata Punch: ధర & పూర్తి వివరాలు

వీటి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

Personas Pure Adventure Accomplised Creative
Manual Transmission ₹5,49,000 ₹6,39,000 ₹7,29,000 ₹8,49,000
AMT* Yes Yes Yes
Customization Packs Rhythm @ ₹35,000 Rhythm @ ₹35,000 Dazzle @ ₹45,000 iRA @ ₹30,000
*AMT Available @ ₹60,000 Over Manual Transmission
ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Tata Punch: ధర & పూర్తి వివరాలు

టాటా పంచ్ ఏడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

అవి:

  • టోర్నెడో బ్లూ
  • కాలిప్సో రెడ్
  • మెటోర్ కాంస్య
  • అటామిక్ ఆరెంజ్
  • ట్రాపికల్ మిస్ట్
  • డేటోనా గ్రే
  • ఓర్కస్ వైట్
  • ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Tata Punch: ధర & పూర్తి వివరాలు

    Tata Punch మైక్రో SUV కంపెనీ కొత్త ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ (ALFA) ఆర్కిటెక్చర్‌పై ఆధారపడింది. ఈ SUV పరిమాణం పరంగా కూడా అద్బుతంగా ఉంటుంది. ఈ కాంపాక్ట్ SUV పొడవు 3,827 మిమీ, 1,742 మిమీ వెడల్పు మరియు 1,615 మిమీ ఎత్తు, 2,445 మిమీ వీల్‌బేస్ కాకుండా కలిగి ఉండి 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది.

    ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Tata Punch: ధర & పూర్తి వివరాలు

    దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Tata Punch అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, రియర్ వైపర్ మరియు 16-ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.

    ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Tata Punch: ధర & పూర్తి వివరాలు

    Tata Punch మైక్రో SUV 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, రియర్-వ్యూ కెమెరా, ఫాగ్ ల్యాంప్స్, కీలెస్ గో, క్రూయిజ్ కంట్రోల్ మరియు 15-ఇంచెస్ స్టైలైజ్డ్ స్టీల్ వీల్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో 4 స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్ మరియు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్ వింగ్ మిర్రర్స్, రియర్ పవర్ విండోస్, ఫాలో మై హోమ్ హెడ్‌ల్యాంప్‌లు, USB ఛార్జింగ్ సాకెట్ మరియు ఫుల్ వీల్ కవర్‌లు వంటివి కూడా ఉన్నాయి.

    ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Tata Punch: ధర & పూర్తి వివరాలు

    Tata Punch లో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఉన్నాయి.

    ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Tata Punch: ధర & పూర్తి వివరాలు

    టాటా పంచ్ మైక్రో-ఎస్‌యువిలో, కంపెనీ ప్రస్తుతం ఉన్న 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది, ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉంది.

    ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Tata Punch: ధర & పూర్తి వివరాలు

    టాటా పంచ్ యొక్క ఆటోమేటిక్ వేరియంట్‌లో 'ట్రాక్షన్ ప్రో' మోడ్ ఇవ్వబడింది. ఈ ఫీచర్ వల్ల కారు బురదలో చిక్కుకున్నప్పుడు బయటపడటానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త Tata పంచ్ కేవలం 6.5 సెకన్లలో 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో కేవలం 16.5 సెకన్లలో ఇది 0 - 100 km/h వరకు వేగవంతం అవుతుంది. ఇది బ్రేక్ స్వింగ్ కంట్రోల్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది, ఈ మోడల్‌లో ఇది మొదటిసారి కనిపిస్తుంది.

    ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Tata Punch: ధర & పూర్తి వివరాలు

    భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త Tata Punch మహీంద్రా KUV100, మారుతి ఇగ్నిస్, హ్యుందాయ్ శాంట్రో వంటి మోడళ్లతో ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకుండా కంపెనీ ఇప్పుడు వెల్లడించిన ధర కేవలం 2021 డిసెంబర్ 31 వరకు మాత్రమే వర్తిస్తాయి. తరువాతకంపెనీ ఈ మైక్రో SUV ధరను పెంచే అవకాశం ఉంటుంది.

    ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Tata Punch: ధర & పూర్తి వివరాలు

    ఏంతోమంది వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త Tata Punch దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ కొత్త SUV ఇటీవల గ్లోబల్ ఎన్‌సి‌ఏ‌పి (GNCAP) ప్రకారం 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కైవసం చేసుకుని అత్యంత సురక్షితమైన వాహనంగా మార్కెట్లో నిలిచింది. ఇందులో అడల్ట్ సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ మరియు పిల్లల సేఫ్టీ విషయంలో 4 స్టార్ రేటింగ్ పొందింది. Tata Panch అన్ని విధాలా అనుకూలమైన వాహనం, కావున పండుగ సీజన్లో మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Tata punch launched price rs 5 49 lakh variant features engine details
Story first published: Monday, October 18, 2021, 12:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X