మీకు తెలుసా.. Tata Punch లో ఈ టాప్ ఫీచర్స్ లేవు

దేశీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవల టాటా పంచ్ (Tata Punch) మైక్రో ఎస్‌యూవీని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ SUV దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి కూడా మంచి ఆదరణ పొందుతూ అమ్మకాల పరంగా ముందుకు దూసుకెళ్తుంది. ఈ టాటా పంచ్ SUV ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను ఎన్నో కలిగి ఉంది. కానీ కొన్ని ప్రధాన ఫీచర్లను కోల్పోయింది.

మనం ఈ ఆర్టికల్ లో టాటా పంచ్ కోల్పోయిన కొన్ని ప్రధాన పీచర్లను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మీకు తెలుసా.. Tata Punch లో ఈ టాప్ ఫీచర్స్ లేవు

సన్‌రూఫ్ (Sunroof):

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ రోజురోజుకి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొత్త విడుదలయ్యే చాలా కార్లు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఇందులో సన్‌రూఫ్ కూడా ఒక ప్రధానమైన భాగం. కావున ఈ సన్‌రూఫ్ ఉన్న వాహనాలను ఎక్కువ కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఆసక్తి చూపుతారు.

మీకు తెలుసా.. Tata Punch లో ఈ టాప్ ఫీచర్స్ లేవు

అయితే టాటా మోటార్స్ ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదల చేసిన ఈ మైక్రో SUV లో సన్‌రూఫ్ ఫీచర్ లేదు. కానీ టాటా మోటార్స్ యొక్క టాటా నెక్సాన్ మరియు టాటా హారియర్ వంటి వాటిలో సన్‌రూఫ్ ఫీచర్ అందుబాటులో ఉంది. టాటా పంచ్ కూడా సన్‌రూఫ్ ఫీచర్ కలిగి ఉంటే మరింత అధునాతనంగా ఉంటుంది. మరింత ఎక్కువమంది కస్టమర్లను ఆకర్షిస్తుంది.

మీకు తెలుసా.. Tata Punch లో ఈ టాప్ ఫీచర్స్ లేవు

ఎల్ఈడీ హెడ్‌లైట్ (LED Headlights):

టాటా పంచ్ యొక్క ఈ కొత్త మైక్రో SUV టాటా పంచ్ ప్రొజెక్టర్ లైట్ సెటప్ మరియు కార్నర్ లైట్లతో వస్తుంది. అయితే స్టాండర్డ్ హాలోజన్ బల్బులతో పోలిస్తే, ఎల్ఈడీ లైట్స్ మరింత మన్నికైనవిగా ఉంటాయి. అదే సమయంలో తక్కువ శక్తిని ఉపయోగిస్తాయి. ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాయి. టాటా పంచ్ SUV ఈ ఎల్ఈడీ హెడ్‌లైట్ సెటప్ పొందలేదు. ఇది కూడా ఈ SUV కోల్పోయిన ప్రధాన ఫీచర్స్ లో ఒకటి.

మీకు తెలుసా.. Tata Punch లో ఈ టాప్ ఫీచర్స్ లేవు

టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (Tyre Pressure Monitoring System):

టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ అనేది కూడా ప్రధాన ఫీచర్స్ లో ఒకటి. ఇది టైర్లలో గాలి మొత్తాన్ని ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. గాలి స్థాయి ఎప్పుడు పడిపోతుందో సమాచారాన్ని ఇది వినియోగదారులకు అందిస్తుంది. కావున అన్ని సమయాల్లో గాలిని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. టాటా మోటార్స్ తన నెక్సాన్ ఫ్లాగ్‌షిప్ కార్ మోడళ్లలో ఈ ఫీచర్‌ను అందిస్తోంది. అయితే ఈ కొత్త టాటా పంచ్ లో ఈ ఫీచర్ లేకపోవడం చాలా దురదృష్టం.

మీకు తెలుసా.. Tata Punch లో ఈ టాప్ ఫీచర్స్ లేవు

రియర్ ఏసీ వెంట్స్ (Rear AC Vents):

ఇటీవల కాలంలో విడుదలవుతున్న చాలా కార్లలో ముందు కూర్చున్న ప్రయాణికులకు మాత్రమే కాకుండా, వెనుక కూర్చునే ప్రయాణికులకు కూడా ఎక్కువా ఫీచర్స్ తీసుకువచ్చారు. ఇందులో ఒకటి రియర్ ఏసీ వెంట్స్. అయితే టాటా మోటార్స్ విడుదల చేసిన ఈ మైక్రో SUV లో ఈ రియర్ ఏసీ వెంట్స్ ఫీచర్ లేదు.

రియర్ ఏసీ వెంట్స్ ఫీచర్ లేకపోవడం అనేది, ఖచ్చితంగా టాటా కార్ ప్రియులకు నిరుత్సాహాన్ని పరుస్తుంది. ధరలను తగ్గించే క్రమంలో వాహన తయారీదారులు ఇలాంటి ఫీచర్లకు దూరంగా ఉన్నారు. అందుకని, టాటా తన పంచ్ కారును సరసమైన ధరకు అందించడానికి ఈ ఫీచర్‌ను ఇవ్వకుండా ఉండవచ్చు అని తెలుస్తుంది.

మీకు తెలుసా.. Tata Punch లో ఈ టాప్ ఫీచర్స్ లేవు

ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ (Front Center Armrest):

టాటా పంచ్ మైక్రో SUV లో ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ ఫీచర్ కూడా లేదు. ఎక్కువసేపు డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా ఇప్పుడు చాలామంది వాహన వినియోగదారులు ఈ ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ ఉపయోగానికి అలవాటుపడిపోయారు.

మీకు తెలుసా.. Tata Punch లో ఈ టాప్ ఫీచర్స్ లేవు

యాంబియంట్ లైటింగ్ (Ambient lighting):

టాటా మోటార్స్ దాని అల్ట్రా ప్రీమియం క్వాలిటీ కార్ మోడల్‌లో యాంబియంట్ ఎలక్ట్రిక్ లైటింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. ఇప్పుడు విడుదలైన టాటా పంచ్ SUV లో మాత్రం ఈ ఫీచర్ అందివ్వలేదు. యాంబియంట్ ఎలక్ట్రిక్ లైటింగ్ ఫీచర్ టాటా పంచ్ యొక్క ఏ మోడల్ లోనూ అందివ్వలేదు.

మీకు తెలుసా.. Tata Punch లో ఈ టాప్ ఫీచర్స్ లేవు

ఇంజిన్ స్టార్ట్-స్టాప్ టెక్ (Engine Start-Stop Tech):

నేటి యువతను ఆకర్షించేందుకు టాటా మోటార్స్ కొత్త టాటా పంచ్ కారులో అనేక అప్డేటెడ్ ఫీచర్లను అందించింది. ఇందులో భాగంగానే కంపెనీ అధిక-పనితీరు గల 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు ప్రీమియం-నాణ్యత ఇంటీరియర్‌ను అందించింది. కానీ, ఇది స్టార్ట్-స్టాప్ సౌకర్యాన్ని అందివ్వలేదు. ఇది వాహనం యొక్క ఇంధన ఆర్థిక వ్యవస్థను పెంచే లక్ష్యంతో ఉంటుంది. అయితే ఈ ఫీచర్ కూడా ఇందులో లేకపోవడం గమనార్హం.

మీకు తెలుసా.. Tata Punch లో ఈ టాప్ ఫీచర్స్ లేవు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా పంచ్ ధర రూ. 5.49 లక్షల నుంచి రూ. 9.09 లక్షల మధ్యలో ఉంది. ఈ SUV ధర తక్కువగా ఉన్న కారణంగా ఎక్కువమంది కొనుగోలుదారులు ఈ SUV ని కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే మొదటి నెలలోనే మొత్తం 8,453 యూనిట్లను విక్రయించినట్లు నివేదికల ద్వారా తెలిసింది.

Tata Punch ఆల్ఫా ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఇదిప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) మరియు క్రియేటివ్‌అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి.

మీకు తెలుసా.. Tata Punch లో ఈ టాప్ ఫీచర్స్ లేవు

కొత్త Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV లో సిగ్నేచర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. Tata Punch యొక్క సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.

మీకు తెలుసా.. Tata Punch లో ఈ టాప్ ఫీచర్స్ లేవు

Tata Punch యొక్క ఇంటీరియర్ డ్యూయల్-టోన్ థీమ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి వాటితో పాటు, 27 కనెక్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇందులో ఆటోమేటిక్ ఎసి, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

మీకు తెలుసా.. Tata Punch లో ఈ టాప్ ఫీచర్స్ లేవు

Tata Punch అద్భుతమైన పర్ఫామెన్స్ అందింస్తుంది, దీని కోసం 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించనుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

మీకు తెలుసా.. Tata Punch లో ఈ టాప్ ఫీచర్స్ లేవు

Tata మోటార్స్ కొత్త Tata Punch SUV యొక్క ఆటోమేటిక్ వేరియంట్‌లో 'ట్రాక్షన్ ప్రో' మోడ్ కూడా అందించింది. ఈ ఫీచర్ వల్ల కారు బురదలో చిక్కుకున్నప్పుడు బయటపడటానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త Tata పంచ్ కేవలం 6.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

నివేదికల ప్రకారం కొత్త Tata Punch వయోజన భద్రత విషయంలో 5 స్టార్ రేటింగ్ పొందింది. అదేవిధంగా పిల్లల భద్రత విషయంలో 4 స్టార్ రేటింగ్ కైవసం చేసుకున్నట్లు తెలిసింది. ఇటువంటి అధునాతన మరియు ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉన్న ఈ కొత్త మైక్రో SUV దేశీయ మార్కెట్లో ఈ నెలలో కూడా మరింత ఆశాజనకమైన అమ్మకాలను పొందుతుంది.

Most Read Articles

English summary
Tata punch micro suv misses some important features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X