Tata Punch కలర్ ఆప్సన్స్.. వచ్చేశాయ్

భారతదేశంలో ప్రముఖ వాహన తయారీ సంస్థగా కీర్తి గడించిన Tata Motors (టాటా మోటార్స్) దేశీయ ఆరేక్ట్లో Tata Punch అనే మైక్రో SUV ని ఆవిష్కరించడానికి సన్నాహాహలు సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పటికే ఈ SUV గురించి చాలా సమాచారాన్ని తెలిపే టీజర్ వీడియోలను ఇడుదల చేసింది. అంతే కాకూండా Tata Punch SUV ని 2021 అక్టోబర్ 04 న మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు తెలిపింది.

Tata Punch కలర్ ఆప్సన్స్.. వచ్చేశాయ్

కంపెనీ నివేదికల ప్రకారం, Tata Motors తన కొత్త Tata Punch SUV ని ఆవిష్కరించిన తరువాత బుకింగ్స్ ప్రారంభించనుంది. అదే విధంగా ఈ SUV యొక్క అమ్మకాలు రానున్న పండుగగా సీజన్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

Tata Punch కలర్ ఆప్సన్స్.. వచ్చేశాయ్

Tata Motors ఇప్పటికే ఈ మైక్రో SUV గురించి చాలా సమాచారాన్ని మనతో పంచుకున్నట్లు ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు కంపెనీ తాజాగా Tata Punch యొక్క వేరియంట్లు మరియు ట్రిమ్ల గురించి తెలిపింది. Team BHP ప్రకారం కొత్త Tata Punch నాలుగు ట్రిమ్లలో విడుదల కానుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిష్డ్ (Accomplished) మరియు క్రియేటీవ్ ట్రిమ్స్. ఇవి మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి.

Tata Punch కలర్ ఆప్సన్స్.. వచ్చేశాయ్

ఇక కొత్త Tata Punch యొక్క కలర్ ఆప్సన్స్ విషయానికి వస్తే, మూడు సింగిల్ టోన్ కలర్ ఆప్సన్స్ మరియు 6 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. ఈ సింగిల్ టోన్ కలర్ ఆప్సన్స్ ప్యూర్, అడ్వెంచర్ మరియు ఆకాంప్లిష్డ్ ట్రిమ్లలో లభిస్తుంది. అదేవిధంగా డ్యూయెల్ టోన్ కలర్స్ కేవలం టాప్ స్పెక్ ట్రిమ్ అయిన క్రియేటివ్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే ఈ సమాచారంపై కూడా కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం అందించలేదు. కంపెనీ ఈ సమాచారంపై త్వరలో అధికారిక ప్రకటన అందిస్తుంది.

Tata Punch కలర్ ఆప్సన్స్.. వచ్చేశాయ్

Tata Punch ఆల్ఫా-ఎఆర్‌సి ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది, ఈ కారు ఇంపాక్ట్ 2.0 డిజైన్ కలిగి ఉంటుంది. Tata Punch (టాటా పంచ్) అనేది కంపెనీ యొక్క మైక్రో ఎస్‌యూవీ అంతే కాకూండా, ఇది కంపెనీ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్, కావున ఈ కొత్త మోడల్ అనేక ఫీచర్లు మరియు పరికరాలతో రానుంది.

Tata Punch కలర్ ఆప్సన్స్.. వచ్చేశాయ్

Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో సిగ్నేచర్ గ్రిల్, మధ్యలో బ్రాండ్ యొక్క లోగో ఉంచబడింది. ఇది ఎల్ఈడీ డిఆర్ఎల్ తో వేరుచేయబడి ఉంటుంది. హెడ్‌లైట్ రెండు వైపులా ఉంచబడింది మరియు ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. నంబర్ ప్లేట్ మరియు స్కిడ్ ప్లేట్ దాని క్రింద ఉంచబడ్డాయి. ఇవన్నీ కూడా Tata Punch ని మరింత ఆకర్షనీయంగా చేస్తాయి.

Tata Punch కలర్ ఆప్సన్స్.. వచ్చేశాయ్

ఇందులో ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ చూడవచ్చు, రూఫ్ తెల్లగా ఉంచబడింది మరియు రూఫ్ రైల్ బ్లాక్ కలర్‌లో ఉంచబడింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మొత్తం మీద Tata Punch డిజైన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Tata Punch కలర్ ఆప్సన్స్.. వచ్చేశాయ్

Tata Punch యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది డ్యూయల్ టోన్ థీమ్‌లో ఉంచబడింది, ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఉపయోగించబడ్డాయి. ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్ కలయిక దాని డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటివి కూడా ఉన్నాయి. అంతే కాకుండా AC వెంట్‌లపై బ్లూ హైలైట్‌లు మరియు లోపలి డోర్ హ్యాండిల్స్‌లో వైట్ ఇన్సర్ట్‌లు ఉపయోగించబడ్డాయి.

Tata Punch కలర్ ఆప్సన్స్.. వచ్చేశాయ్

Tata Punch ఎస్‌యూవీని కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. ఇందులో మొదటిది 1.2 లీటర్, 3 సిలిండర్ రివోట్రాన్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 86 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఏఎమ్‌టి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది.

Tata Punch కలర్ ఆప్సన్స్.. వచ్చేశాయ్

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, Tata Punch యొక్క టాప్-ఎండ్ వేరియంట్లలో, కంపెనీ తమ పాపులర్ Altroz iTurbo వేరియంట్లలో ఉపయోగిస్తున్న 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది.

Tata Punch త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల కానుంది, Tata Punch ఈ విభాగంలో Maruti Suzuki Ignis, WagonR, Ford Freestyle మరియు Mahindra KUV100 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Tata punch micro suv trim and color details revealed ahead of launch
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X