Tata Punch కి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న Toyota Aygo X (ఐగో ఎక్స్)

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) తమ టాటా పంచ్ (Tata Punch) కారుతో ఓ సరికొత్త మైక్రో-ఎస్‌యూవీ విభాగానికి తెరతీసిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, టాటా పంచ్ కారుకి పోటీగా చిన్న కార్లను తయారు చేసేందుకు ఇతర ఆటోమొబైల్ కంపెనీలు కుడా పోటీ పడుతున్నాయి. కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ ఇప్పటికే తమ కాస్పర్ (Hyundai Casper) మైక్రో-ఎస్‌యూవీని ఆవిష్కరించగా, ఇప్పుడు జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా తమ ఐగో ఎక్స్ (Toyota Aygo X) కారును ఆవిష్కరించింది.

Tata Punch కి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న Toyota Aygo X (ఐగో ఎక్స్)

టొయోటా ఐగో ఎక్స్ చిన్న ఎస్‌యూవీలా కనిపించే క్రాసోవర్ స్టైల్ కారు. టొయోటా ఈ సబ్-కాంపాక్ట్ క్రాస్ఓవర్ కారును తమ GA-B ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రూపొందించింది. ఇది TNGA (టొయోటా న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్) ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇదే ప్లాట్‌ఫామ్ పై కంపెనీ తమ పాపులర్ టొయోటా యారిస్ మరియు టొయోటా యారిస్ క్రాస్‌ వంటి కార్లను తయారు చేస్తోంది.

Tata Punch కి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న Toyota Aygo X (ఐగో ఎక్స్)

టొయటా ఐగో ఎక్స్ (Toyota Aigo X) కొలతలను గమనిస్తే, ఇది 3,700 మిమీ పొడవు, 1,740 మిమీ వెడల్పు మరియు 1,510 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. ఐగో ఎక్స్ కొలతలను టాటా పంచ్ తో పోల్చి చూస్తే, ఈ మైక్రో ఎస్‌యూవీ 3,827 మిమీ పొడవు, 1,742 మిమీ వెడల్పు మరియు 1,615 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. కొలతల పరంగా చూస్తే, టొయోటా ఐగో ఎక్స్ కారు కన్నా టాటా పంచ్ కాస్తంత పెద్దదిగా అనిపిస్తుంది. ఫలితంగా, పంచ్ కారు లోపల ఎక్కువ క్యాబిన్ స్పేస్ కూడా లభిస్తుంది.

Tata Punch కి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న Toyota Aygo X (ఐగో ఎక్స్)

Toyota Aigo X సబ్-కాంపాక్ట్ క్రాసోవర్ రగ్గడ్ లుక్‌లో కనిపిస్తుంది. దీని రూపాన్ని మరింత మెరుగుపరచేందుకు, ఇది డ్యూయెల్-టోన్ ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్ తో డిజైన్ చేయబడి ఉంటుంది. ఈ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ సాధారణంగా ఇతర వాహనాల్లో కనిపించే దానికంటే భిన్నమైన రీతిలో ఉంటుంది. ఐగో ఎక్స్ యొక్క C-పిల్లర్ బ్లాక్ టోన్‌ను పొందగా, మిగిలిన బాడీ మొత్తం ముదురు ఆకుపచ్చ, ఆరెంజ్ మరియు బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ ను కలిగి ఉంటుంది.

Tata Punch కి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న Toyota Aygo X (ఐగో ఎక్స్)

టొయోటా ఐగో ఎక్స్ ముందు భాగంలో డైమండ్ ప్యాటర్న్ తో కూడిన పెద్ద ఫ్రంట్ గ్రిల్, గుండ్రటి ఫాగ్ ల్యాంప్స్, స్ప్లిట్ డిజైన్ తో కూడిన డేటైమ్ రన్నింగ్ లైట్లు, సన్నటి ఎల్ఈడి హెడ్‌లైట్లు, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు, వెనుక వైపు డ్యూయెల్ టోన్ బంపర్ మరియు బంపర్ దిగువ భాగంలో ఆరెంజ్ కలర్ స్ట్రైప్, 18 ఇంచ్ స్పోర్టీ అల్లాయ్ వీల్స్ మరియు దాని ఆరెంజ్ కలర్ యాక్సెంట్స్, సైడ్స్ లో బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, విశిష్టమైన టెయిల్ ల్యాంప్స్ డిజైన్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బ్లాక్ కలర్ రూఫ్ మరియు పియానో బ్లాక్ లో ఫినిష్ చేయబడిన సైడ్ మిర్రర్స్ ఇందులో ఉన్నాయి.

Tata Punch కి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న Toyota Aygo X (ఐగో ఎక్స్)

ఐగో ఎక్స్ లోపలి భాగాన్ని పరిశీలిస్తే, ఈ చిన్న కారులో కంపెనీ అనేక లేటెస్ట్ ఫీచర్లను జోడించింది. ఇందులో మౌంటెడ్ స్విచ్ కంట్రోల్స్ తో కూడిన మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, 9 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లేలను సపోర్ట్ చేసే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఒవెల్ ఆకారంలో ఉండే ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్ ఆరెంజ్ కలర్ యాక్సెంట్స్, సీట్స్‌పై ఆరెంజ్ కలర్ స్టిచింగ్ మరియు పైపింగ్ వంటి అంశాలను ఇందులో గమనించవచ్చు.

Tata Punch కి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న Toyota Aygo X (ఐగో ఎక్స్)

ఇక చివరిగా టొయోటా ఐగో ఎక్స్ చిన్న కారుకి శక్తినిచ్చే ఇంజన్ విషయానికి వస్తే, ఈ చిన్న కారులో కంపెనీ 1.0 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 72 బిహెచ్‌పి శక్తిని మరియు 205 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది చిన్న కారే అయినప్పటికీ ఇందులో 231 లీటర్ల పెద్ద బూట్ స్పేస్‌తో లభిస్తుంది. ఈ చిన్న కారు ముందుగా యూరోపిన్ మార్కెట్లలో విడుదల కానుంది.

Tata Punch కి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న Toyota Aygo X (ఐగో ఎక్స్)

భారతదేశంలో టొయోటా ఐగో ఎక్స్ విడుదల అవుతుందో లేదో ప్రస్తుతానికి చెప్పలేం. కంపెనీ ఈ విషయంపై ఇంకా నోరు మెదపలేదు. ఏదేమైనప్పటికీ, ఒకవేళ టొయోటా ఈ చిన్న కారును ఇండియాకు తీసుకురావాలని ప్లాన్ చేస్తే, ఇది ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ విభాగంలో ఇటీవలే వచ్చిన టాటా పంచ్ మరియు కొత్తగా రాబోయే హ్యుందాయ్ కాస్పర్ వంటి మైక్రో కార్లకు గట్టి పోటీనిచ్చే అవకాశం కూడా ఉంది. మీరేమంటారు..?

Tata Punch కి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న Toyota Aygo X (ఐగో ఎక్స్)

Toyota bZ4X ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ..

ఇదిలా ఉంటే, ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని టొయోటా తమ మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టొయోటా బిజీ4ఎక్స్ (Toyota bZ4X) ని ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. టొయోటా ప్రత్యేకించి తమ ఎలక్ట్రిక్ వాహనాల కోసం సిద్ధం చేస్తున్న bZ సిరీస్‌లో భాగంగా వస్తున్న మొదటి మోడల్ ఈ bZ4X. ఈ పేరులో bZ అంటే అర్థం 'బియాండ్ జీరో' (beyond Zero) (జీరోకి మించి అని అర్థం). ఇది కార్బన్ న్యూట్రాలిటీ విషయంలో టొయోటా యొక్క విధానాన్ని ప్రతిబింబింపజేస్తుంది. - ఈ కారుకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Tata punch rival toyota aygo x unveiled details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X