Tata Punch ఎస్‌‌యూవీలో టర్బో పెట్రోల్ వేరియంట్.. లాంచ్ ఎప్పుడంటే..?

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) తాజాగా మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ (Tata Punch) ప్రస్తుతం కేవలం ఒక న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే లభిస్తున్న సంగతి తెలిసినదే. కాగా, తాజా సమాచారం ప్రకారం కంపెనీ ఇందులో ఓ టర్బో పెట్రోల్ ఇంజన్ ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Tata Punch ఎస్‌‌యూవీలో టర్బో పెట్రోల్ వేరియంట్.. లాంచ్ ఎప్పుడంటే..?

టాటా పంచ్ భారత మార్కెట్లో విడుదలైన అతికొద్ది సమయంలోనే అద్భుతమైన స్పందనను అందుకుంది. ప్రస్తుతం ఈ చిన్న ఎస్‌యూవీ 1.2 లీటర్, త్రీ సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్ తో లభిస్తోంది. అయితే, తాజా నివేదికల ప్రకారం, కంపెనీ ఇందులో కొత్త టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ను తీసుకురావచ్చని, ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నాటికి అందుబాటులోకి రావచ్చని సమాచారం.

Tata Punch ఎస్‌‌యూవీలో టర్బో పెట్రోల్ వేరియంట్.. లాంచ్ ఎప్పుడంటే..?

అంతేకాకుండా, టాటా మోటార్స్ ఈ టర్బో వెర్షన్ టాటా పంచ్ ఎస్‌యూవీని 'అంకాంప్లిష్డ్' మరియు 'క్రియేటివ్' (Accomplished, Creative) అనే వేరియంట్లలో విడుదల చేయవచ్చని ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే, ఈ విషయంపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, టాటా పంచ్ లో టర్బో పెట్రోల్ ఇంజన్ ను పరిచయం చేయడం కంపెనీకి పెద్ద కష్టమేమీ కాదు.

Tata Punch ఎస్‌‌యూవీలో టర్బో పెట్రోల్ వేరియంట్.. లాంచ్ ఎప్పుడంటే..?

టాటా పంచ్ కు మార్కెట్లో గొప్ప స్పందన లభించి ఉండవచ్చు కానీ, ఈ మోడల్ లో ఎంచుకోవడానికి ఒకే ఒక ఇంజన్ ఆప్షన్ ఉండటం వినియోగదారులను కొంత నిరాశకు గురి చేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం, మార్కెట్లో డీజిల్ ఇంజన్ల హవా తగ్గిన నేపథ్యంలో, కస్టమర్లు ఇప్పుడు టర్బో ఇంజన్లపై ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో కూడా అనేక రకాల కార్లు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తున్నాయి.

Tata Punch ఎస్‌‌యూవీలో టర్బో పెట్రోల్ వేరియంట్.. లాంచ్ ఎప్పుడంటే..?

ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ కూడా తమ పంచ్ ఎస్‌యూవీ టర్బో పెట్రోల్ ఇంజన్ ను జోడించడం ద్వారా మరింత ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించాలని భావిస్తోంది. టాటా పంచ్ ఇప్పటికే, తమ ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లో టర్బో పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగిస్తోంది. కంపెనీ ఇదే ఇంజన్ ను కొద్దిగా రీట్యూన్ చేసి, కొత్త టాటా పంచ్ ఎస్‌యూవీలో ఉపయోగించే ఆస్కారం ఉంది.

Tata Punch ఎస్‌‌యూవీలో టర్బో పెట్రోల్ వేరియంట్.. లాంచ్ ఎప్పుడంటే..?

దేశీయ విపణిలో టాటా పంచ్ ఎస్‌‌యూవీని నాలుగు వేరియంట్లలో విడుదల చేశారు. వీటిలో ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిష్డ్ మరియు క్రియేటివ్‌ అనే వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో ప్యూర్ వేరియంట్ మినహా మిగిలిన మూడు వేరియంట్లు (అడ్వెంచర్, ఆకాంప్లిష్డ్ మరియు క్రియేటివ్‌) మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. ప్యూర్ వేరియంట్ మాత్రం కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభిస్తుంది.

Tata Punch ఎస్‌‌యూవీలో టర్బో పెట్రోల్ వేరియంట్.. లాంచ్ ఎప్పుడంటే..?

టాటా పంచ్ ఎస్‌యూవీ ప్రస్తుతం 1.2 లీటర్, త్రీ సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్ తో లభిస్తోంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ ను మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. టాటా పంచ్ ఆటోమేటిక్ వేరియంట్‌లలో 'ట్రాక్షన్ ప్రో' అనే డ్రైవింగ్ మోడ్ కూడా లభిస్తుంది.

Tata Punch ఎస్‌‌యూవీలో టర్బో పెట్రోల్ వేరియంట్.. లాంచ్ ఎప్పుడంటే..?

ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, టాటా పంచ్ 6.5 సెకన్లలోనే గంటకు 0 - 60 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. అలాగే, 16.5 సెకన్లలో గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. మైలేజ్ విషయానికి వస్తే, టాటా పంచ్ మ్యాన్యువల్ వేరియంట్ 18.97 kmpl మైలేజీని మరియు ఆటోమేటిక్ వేరియంట్ 18.82 kmpl మైలేజీని అందిస్తాయి (ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్).

Tata Punch ఎస్‌‌యూవీలో టర్బో పెట్రోల్ వేరియంట్.. లాంచ్ ఎప్పుడంటే..?

ఈ చిన్న కారులో ఆటోమేటిక్ ఇంజన్ స్టార్ట్ / స్టాప్, రెండు డ్రైవ్ మోడ్‌లు (ఎకో మరియు సిటీ), క్రూయిజ్ కంట్రోల్, టైర్ పంక్చర్ రిపేర్ కిట్, బ్రేక్ స్వే కంట్రోల్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, ఐఆర్‌ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 27 కనెక్టెడ్ ఫీచర్లు మొదలైనవి లభిస్తాయి.

Tata Punch ఎస్‌‌యూవీలో టర్బో పెట్రోల్ వేరియంట్.. లాంచ్ ఎప్పుడంటే..?

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, టాటా పంచ్ లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBD తో కూడిన ABS, కెమెరాతో కూడిన రియర్ పార్కింగ్ సెన్సార్స్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ మొదలైనవి ఉన్నాయి. ఈ కారు కోసం ఇటీవల గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్ట్‌ లో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకొని, భారతదేశంలోనే అత్యంత సురక్షితమైన చిన్న కారుగా నిలిచింది.

Tata Punch ఎస్‌‌యూవీలో టర్బో పెట్రోల్ వేరియంట్.. లాంచ్ ఎప్పుడంటే..?

టాటా మోటార్స్ తమ పంచ్ మైక్రో ఎస్‌యూవీని కంపెనీ యొక్క కొత్త ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ (ALFA) ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించింది. ఇది పరిమాణంలో తేలికగా ఉండి చాలా ధృడంగా ఉంటుంది. సైజు పరంగా, చూస్తే, టాటా పంచ్ ఎస్‌యూవీ 3,827 మిమీ పొడవు, 1,742 మిమీ వెడల్పు మరియు 1,615 మిమీ ఎత్తు, 2,445 మిమీ వీల్‌బేస్‌తో పాటుగా 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 370 మిమీ వాటర్ వేడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది.

Source: Team-BHP

Most Read Articles

English summary
Tata punch to get new turbo petrol engine india launch timeline revealed details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X