Tata Safari అడ్వెంచర్ ఎడిషన్ ఎస్‌యూవీలో కొత్తగా లభించనున్న ఫీచర్లు

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ కొత్త తరం టాటా సఫారీ (Tata Safari) ఎస్‌యూవీలో ఇటీవల ఓ గోల్డ్ ఎడిషన్ ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ లో కంపెనీ అనేక కాస్మెటిక్ మార్పులతో పాటు అదనపు ఫీచర్లను కూడా జోడించింది.

Tata Safari అడ్వెంచర్ ఎడిషన్ ఎస్‌యూవీలో కొత్తగా లభించనున్న ఫీచర్లు

కాగా, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న Tata Safari యొక్క అడ్వెంచర్ ఎడిషన్ లో కూడా కంపెనీ మరిన్ని అదనపు ఫీచర్లను అందించాలని భావిస్తోంది. గోల్డ్ ఎడిషన్ లో అందించిన కొన్ని ప్రత్యేక ఫీచర్లను కంపెనీ ఈ కొత్త అడ్వెంచర్ ఎడిషన్ లో కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే, మార్కెట్లో ఉన్న Tata Safari అడ్వెంచర్ ఎడిషన్ దాని స్టాండర్డ్ వేరియంట్‌ లతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది మరియు అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది.

Tata Safari అడ్వెంచర్ ఎడిషన్ ఎస్‌యూవీలో కొత్తగా లభించనున్న ఫీచర్లు

అయితే, Tata Safari లో కొత్త గోల్డ్ ఎడిషన్ ను ప్రారంభించిన తర్వాత, ఈ మోడల్ లైనప్‌ లోని అడ్వెంచర్ ఎడిషన్ కు ఆదరణ కొంచెం తగ్గినట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే, గోల్డ్ ఎడిషన్ ఇప్పుడు Tata Safari యొక్క కొత్త టాప్-ఎండ్ వేరియంట్‌ గా మారింది. ఇది రాకముందు వరకూ అడ్వెంచర్ ఎడిషన్ టాప్-ఎండ్ వేరియంట్ గా ఉండేది.

Tata Safari అడ్వెంచర్ ఎడిషన్ ఎస్‌యూవీలో కొత్తగా లభించనున్న ఫీచర్లు

కాగా, తాజా సమాచారం ప్రకారం, Tata Motors తమ Tata Safari అడ్వెంచర్ ఎడిషన్‌ అమ్మకాలను పెంచుకునేందుకు, ఇందులో కొన్ని అదనపు ఫీచర్లను జోడించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా, కొత్త Tata Safari అడ్వెంచర్ ఎడిషన్‌ లో, కంపెనీ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లను జోడించే అవకాశం ఉంది.

Tata Safari అడ్వెంచర్ ఎడిషన్ ఎస్‌యూవీలో కొత్తగా లభించనున్న ఫీచర్లు

అయితే, ఈ అదనపు ఫీచర్లు ఇతర సఫారీ వేరియంట్లలో కూడా ఆఫర్ చేయబడుతాయో లేదో అనే విషయాన్ని మాత్రం Tata Motors ఇంకా నిర్ధారించలేదు. పైన పేర్కొన్న అన్ని ఫీచర్లతో పాటు, గోల్డ్ ఎడిషన్ చాలా ప్రీమియంగా కనిపించే ఓయిస్టర్ వైట్ డైమండ్ క్విల్టెడ్ లెథర్ అప్‌హోలెస్ట్రీని కూడా కలిగి ఉంటుంది.

Tata Safari అడ్వెంచర్ ఎడిషన్ ఎస్‌యూవీలో కొత్తగా లభించనున్న ఫీచర్లు

Tata Safari అడ్వెంచర్ ఎడిషన్:

టాటా మోటార్స్ ప్రస్తుత సఫారీ అడ్వెంచర్ ఎడిషన్ ను ట్రాపికల్ మిస్ట్ అనే ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్‌ తో అందిస్తోంది. దీని ఎక్స్టీరియర్ డిజైన్ లో పలు చోట్ల ఉపయోగించిన క్రోమ్ ఇన్సర్ట్ లను బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడి ఉంటాయి. ఇందులోని హెడ్‌ల్యాంప్ సరౌండ్స్, డోర్ హ్యాండిల్స్, సైడ్ మిర్రర్స్, ఫ్రంట్ స్కిడ్ ప్లేట్లు, ట్రై-యారో ఫ్రంట్ గ్రిల్ మరియు ఫ్రంట్ అండ్ రియర్ సఫారీ బ్యాడ్జింగ్ లను బ్లాక్ కలర్‌ లో ఫినిష్ చేశారు.

Tata Safari అడ్వెంచర్ ఎడిషన్ ఎస్‌యూవీలో కొత్తగా లభించనున్న ఫీచర్లు

అడ్వెంచర్ ఎడిషన్ లోని అల్లాయ్ వీల్స్ డిజైన్ మరియు ఆకృతి రెగ్యులర్ వేరియంట్ ల మాదిరిగానే ఉంటాయి, కాకపోతే, ఇవి చార్‌కోల్ గ్రే కలర్‌ లో ఫినిష్ చేయబడి ఉంటాయి. ఇంటీరియర్ లో కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఇది లేత గోధుమ రంగు అప్‌హోలెస్ట్రీని కలిగి ఉంటుంది. స్టీరింగ్ వీల్, ఏసి వెంట్స్, సెంటర్ కన్సోల్, గ్రాబ్ హ్యాండిల్స్, స్విచ్ కన్సోల్స్, గేర్ నాబ్ చుట్టూ పియానో బ్లాక్ ఫినిషింగ్ ఉంటుంది.

Tata Safari అడ్వెంచర్ ఎడిషన్ ఎస్‌యూవీలో కొత్తగా లభించనున్న ఫీచర్లు

Tata Safari గోల్డ్ ఎడిషన్:

ఇక టాటా సఫారీ గోల్డ్ ఎడిషన్ విషయానికి వస్తే, ఇది ఇది వైట్ అండ్ గోల్డ్ మరియు బ్లాక్ అండ్ గోల్డ్ వంటి రెండు వేరియంట్లలో విడుదల చేయబడింది. ఇందులోని ఇంటీరియర్ లలో వైట్ గోల్డ్‌ లో గోల్డ్ యాక్సెంట్లతో కూడిన మోంట్ బ్లాంక్ మార్బుల్ ఫినిషింగ్ లభిస్తుంది. వెలుపలి భాగాన్ని బ్లాక్ కలర్ రూఫ్ తో ఫ్రాస్ట్ వైట్ యొక్క డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌లో డిజైన్ చేశారు.

Tata Safari అడ్వెంచర్ ఎడిషన్ ఎస్‌యూవీలో కొత్తగా లభించనున్న ఫీచర్లు

దీని వెలుపలి భాగంలో గోల్డెన్ కలర్ యాక్సెంట్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ అండ్ గోల్డ్ వేరియంట్లో గోల్డ్ యాక్సెంట్స్ తో కూడిన కాఫీ బీన్ పెయింట్ స్కీమ్‌ లో ఫినిష్ చేయబడి ఉంటుంది. దీని ఇంటీరియర్ కూడా గోల్డ్ యాసెంట్స్‌తో బ్లాక్ మార్బుల్ కలర్‌లో ఫినిష్ చేయబడి ఉంటుంది. ఇక ఇందులో అప్‌హోలెస్ట్రీ మాత్రం రెండు వేరియంట్లలో ఒకే విధంగా ఉంటుంది.

Tata Safari అడ్వెంచర్ ఎడిషన్ ఎస్‌యూవీలో కొత్తగా లభించనున్న ఫీచర్లు

ఇంజన్‌ పరంగా ఎలాంటి మార్పు లేదు:

కాగా, ఈ రెండు వేరియంట్లలో (గోల్డ్ ఎడిషన్ మరియు అడ్వెంచర్ ఎడిషన్) ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇవి రెండూ ప్రస్తుతం ఉన్న 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ తోనే లభిస్తాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 170 బిహెచ్‌పి పవర్ ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

Most Read Articles

English summary
Tata safari adventure edition suv to get new features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X