భారత్‌లో Tata Safari Gold Edition లాంచ్: ధర రూ. 21.89 లక్షలు

Tata Motors (టాటా మోటార్స్) భారతీయ మార్కెట్లో కొత్త Safari Gold Edition (సఫారీ గోల్డ్ ఎడిషన్‌) విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన Safari Gold Edition ప్రారంభ ధర రూ. 21.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ SUV మాన్యువల్ మరియు ఆటోమేటిక్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. కంపెనీ బుకింగ్స్ ప్రారంభించింది, కావున కొనుగోలుచేయాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

భారత్‌లో Tata Safari Gold Edition లాంచ్: ధర రూ. 21.89 లక్షలు

ఇదివరకు చెప్పినట్లు కంపెనీ రెండు వేరియంట్లలో (మాన్యువల్ మరియు ఆటోమాటిక్) వేరియంట్లలో విడుదల చేసింది.

1) Safari XZ+ Gold (మాన్యువల్): రూ. 21.89 లక్షలు

2) Safari XZA+ Gold (ఆటోమేటిక్): రూ. 23.17 లక్షలు

భారత్‌లో Tata Safari Gold Edition లాంచ్: ధర రూ. 21.89 లక్షలు

కలర్ ఆప్సన్స్:

Tata మోటార్స్ కొత్త Safari Gold Edition ను రెండు కలర్ ఆప్సన్స్ లో విడుదల చేసింది.

అవి:

  1. వైట్ గోల్డ్
  2. బ్లాక్ గోల్డ్
భారత్‌లో Tata Safari Gold Edition లాంచ్: ధర రూ. 21.89 లక్షలు

వైట్ గోల్డ్:

వైట్ గోల్డ్ కలర్ స్కీమ్‌లో ప్రీమియం ఫ్రాస్ట్ వైట్ బాడీ పెయింట్ మరియు బ్లాక్ కాంట్రాస్టింగ్ రూఫ్ గమనించవచ్చు. ఇందులోని గ్రిల్, హెడ్‌ల్యాంప్ సరౌండ్స్, రూఫ్ రైల్స్, డోర్ హ్యాండిల్స్, టాటా & సఫారీ బ్యాడ్జ్‌లపై గోల్డ్ కలర్ యాక్సెంట్స్ ఉన్నాయి. ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

భారత్‌లో Tata Safari Gold Edition లాంచ్: ధర రూ. 21.89 లక్షలు

బ్లాక్ గోల్డ్:

ఇక బ్లాక్ గోల్డ్ కలర్ స్కీమ్ విషయానికి వస్తే, బయట వైపు మొత్తం కాఫీ బీన్ బ్లాక్ ఎక్స్‌టీరియర్‌ల కలిగి ఉంటుంది. ఇందులో కూడా గ్రిల్, హెడ్‌ల్యాంప్ సరౌండ్స్, రూఫ్ రైల్స్, డోర్ హ్యాండిల్స్, టాటా & సఫారీ బ్యాడ్జ్‌లపై గోల్డ్ కలర్ యాక్సెంట్స్ ఉన్నాయి.

భారత్‌లో Tata Safari Gold Edition లాంచ్: ధర రూ. 21.89 లక్షలు

కొత్త Tata Safari Gold Edition లో కంపెనీ 18 ఇంచెస్ చార్కోల్ బ్లాక్ అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగించింది. ఇందులో అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలు నిక్షిప్తమై ఉన్నాయి. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో చాలా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ వాహనదారుని భద్రతను నిర్థారిస్తాయి.

భారత్‌లో Tata Safari Gold Edition లాంచ్: ధర రూ. 21.89 లక్షలు

కొత్త Tata Safari Gold Edition యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో లెదర్ సీట్లు, మొదటి మరియు రెండవ వరుసలలో వెంటిలేషన్, వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫయర్, ఆండ్రాయిడ్ ఆటో ఓవర్ వై-ఫై మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌లో Tata Safari Gold Edition లాంచ్: ధర రూ. 21.89 లక్షలు

Tata Motors ఈ కొత్త Tata Safari Gold Edition ను 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ప్రదర్శించబోతోంది. 2021 ఐపీఎల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 15 వరకు నిర్వహించబడుతుంది. ఇంకా, కొనసాగుతున్న కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, tata Motors ఈ సీజన్‌లో 'సఫారీ గోల్డ్ హిట్ ఛాలెంజ్' ను ప్రవేశపెట్టింది.

భారత్‌లో Tata Safari Gold Edition లాంచ్: ధర రూ. 21.89 లక్షలు

ఈ ఛాలెంజ్‌లో ఒక బ్యాట్స్‌మన్ సిక్స్ కొట్టినప్పుడు బంతి కారు లేదా కారు డిస్‌ప్లే పోడియం లేదా సఫారీ #గోల్డ్ LED కమర్షియల్ బోర్డ్‌ను తాకినప్పుడు, టాటా మోటార్స్ ప్రఖ్యాత NGO అయిన అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు రూ. 2 లక్షలు అందిస్తుంది. ఈ మొత్తం డబ్బు భారతదేశ వ్యాప్తంగా కోవిడ్ -19 ఉపశమనం కోసం ఉపయోగించబడుతుంది.

భారత్‌లో Tata Safari Gold Edition లాంచ్: ధర రూ. 21.89 లక్షలు

Tata Safari Gold Edition యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో ఎటువంటి మార్పులు జరగలేదని కంపెనీ తెలిపింది. కావున ఇందులో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఉపయోగించబడుతుంది. ఇంజన్ 170 బిహెచ్‌పి పవర్ మరియు 350 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.

భారత్‌లో Tata Safari Gold Edition లాంచ్: ధర రూ. 21.89 లక్షలు

భారతదేశంలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) కి ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. కావున ఇందులో కొత్త Tata Safari Gold Edition ప్రదర్శించడం ద్వారా ఎంతోమంది దృష్టిని ఆకర్షిస్తుంది. అంతే కాకుండా రాబోయే పండుగ సీజన్లో కంపెనీ స్పెషల్ ఎడిషన్ ప్రారంభించడానికి కంపెనీ సన్నాహాలు సిద్ధం చేస్తుంది.

Most Read Articles

English summary
Tata safari gold edition launched in india at rs 21 89 lakhs design updates details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X