గుడ్ న్యూస్.. మళ్ళీ భారత్‌లో అడుగుపెట్టనున్న టాటా సఫారి : వివరాలు

టాటా మోటార్స్ భారత మార్కెట్లో తన ఏడు సీట్ల ఎస్‌యూవీకి లెజండరీ 'సఫారి' పేరుతో తిరికి ప్రవేశపెట్టడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది. కంపెనీ మొదట ఈ ఎస్‌యూవీని 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ ఎస్‌యూవీని మొదట "గ్రావిటాస్" అని పిలిచేవారు. కానీ ఇప్పుడు ఈ ఎస్‌యూవీకి "సఫారి" అని పేరు పెట్టాలని కంపెనీ నిర్ణయించింది.

గుడ్ న్యూస్.. మళ్ళీ భారత్‌లో అడుగుపెట్టనున్న టాటా సఫారి : వివరాలు

టాటా మోటార్స్ ఈ నెల చివరలో సఫారి ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ కొత్త ఎస్‌యూవీ ఇప్పటికే భారతదేశంలో చాలాసార్లు స్పాట్ టెస్ట్ కూడా నిర్వహించడం జరిగింది. కానీ కొత్త ఎస్‌యూవీ ఐకానిక్ సఫారి పేరుతో తిరిగి పెట్టడం వాహనప్రియులలో చాలా కుతూహలాన్ని కల్గించింది.

గుడ్ న్యూస్.. మళ్ళీ భారత్‌లో అడుగుపెట్టనున్న టాటా సఫారి : వివరాలు

భారతదేశంలో టాటా సఫారి, వాహనదారుల యొక్క లైఫ్‌స్టైల్ కి చాలా అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ కారణంగానే దాదాపు రెండు దశాబ్దాలుగా భారతమార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలిచింది. ఇప్పుడు కొత్త వేరియంట్ కి కంపెనీ మరోసారి ఈ ఐకానిక్ సఫారీ పేరుతో భారతీయ మార్కెట్లోకి తీసుకురానుంది.

MOST READ:బ్రేకింగ్ ; 2021 డాకర్ ర్యాలీ నాల్గవ స్టేజ్‌లో కుప్పకూలిన సిఎస్ సంతోష్

గుడ్ న్యూస్.. మళ్ళీ భారత్‌లో అడుగుపెట్టనున్న టాటా సఫారి : వివరాలు

కస్టమర్లను ప్రోత్సహించడానికి మరియు సరికొత్త ఎస్‌యూవీని అనుభవించడానికి సఫారి యొక్క ప్రసిద్ధ ట్యాగ్ లైన్ 'రిక్లైమ్ దెయిర్ లైఫ్' ను తీసుకురావడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. వినియోగదారుల దృష్టికి మళ్ళీ ఆకర్షించడానికి కంపెనీ అన్ని సన్నాహాలను సిద్ధంచేస్తోంది. సాధారణంగా టాటా సఫారి అద్భుతమైన పనితీరును కలిగి ఉంటుంది.

గుడ్ న్యూస్.. మళ్ళీ భారత్‌లో అడుగుపెట్టనున్న టాటా సఫారి : వివరాలు

త్వరలో రానున్న ఈ టాటా సఫారీ, ల్యాండ్ రోవర్ యొక్క డి 8 ప్లాట్‌ఫాం నుండి తీసుకోబడిన ఒమేగార్క్ ప్లాట్‌ఫామ్‌తో పాటు ఇంపాక్ట్ 2.0 డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉంటుంది.

MOST READ:ఒక్క నెలలో 2 వేలు కోట్లకు పైగా ఫాస్ట్‌ట్యాగ్ వసూల్.. చూసారా !

గుడ్ న్యూస్.. మళ్ళీ భారత్‌లో అడుగుపెట్టనున్న టాటా సఫారి : వివరాలు

టాటా మోటార్స్ యొక్క ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ చైర్మన్ "శ్రీ శైలేష్ చంద్ర" మాట్లాడుతూ, సఫారి ఎస్‌యూవీని మళ్లీ ప్రవేశపెట్టడం మాకు గర్వంగా ఉంది. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీలలో ఒకటి ఈ టాటా సఫారీ. ఈ కారణంగానే రెండు దశాబ్దాల నుంచి తన ఉనికిని చాటుకుంటోందన్నారు.

గుడ్ న్యూస్.. మళ్ళీ భారత్‌లో అడుగుపెట్టనున్న టాటా సఫారి : వివరాలు

కొత్త టాటా సఫారి సరికొత్త డిజైన్ ని కలిగి ఉండటం వల్ల వాహనప్రియులను ఎక్కువ ఆకర్షించగలదు. దీని డిజైన్, పర్ఫామెన్స్, ఫీచర్స్ మరియు లాంగ్ లాస్టింగ్ బిల్డ్ క్వాలిటీ వంటివి ఈ ఎస్‌యూవీని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి.

MOST READ:ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..

గుడ్ న్యూస్.. మళ్ళీ భారత్‌లో అడుగుపెట్టనున్న టాటా సఫారి : వివరాలు

టాటా సఫారిలో 2.0-లీటర్, ఫోర్ సిలిండర్, క్రయోటెక్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 168 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ నెలలో కొత్త సఫారి ఎస్‌యూవీ కోసం బుకింగ్ ప్రారంభిస్తామని టాటా మోటార్స్ అధికారికంగా ధ్రువీకరించింది.

గుడ్ న్యూస్.. మళ్ళీ భారత్‌లో అడుగుపెట్టనున్న టాటా సఫారి : వివరాలు

ఈ నెల చివరికి ఈ కొత్త టాటా సఫారి ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించనుంది. టాటా సఫారీ మళ్ళీ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడం సఫారీ ప్రియులకు మరింత ఆనందాన్ని కల్గిస్తుంది.

MOST READ:లిమోసిన్ కారుగా మారిన మారుతి వ్యాగన్ ‌ఆర్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

Most Read Articles

English summary
Tata Safari Name Makes A Comeback For The Brand’s Flagship Seven Seater SUV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X