డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్

టాటా మోటార్స్ తమ కొత్త తరం సఫారీ ఎస్‌యూవీని జనవరి 26వ తేదీన మార్కెట్లో విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కంపెనీ ఇప్పటికే తమ కొత్త టాటా సఫారీని డీలర్‌షిప్ కేంద్రాలకు పంపిణీ చేస్తోంది.

డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్

టాటా హారియర్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసిన కొత్త తరం టాటా సఫారీని కంపెనీ ఇప్పటికే అధికారికంగా ఆవిష్కరించింది. అయితే, ఇందులో ఎక్స్టీరియర్ వివరాలను మాత్రమే కంపెనీ వెల్లడి చేసింది. ఇంటీరియర్ వివరాలను వెల్లడించలేదు.

డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్

అయితే, తాజాగా ఓ డీలర్‌షిప్ కేంద్రానికి వచ్చిన ఆటోమేటిక్ వెర్షన్ సఫారీ చిత్రాలు, ఇంటీరియర్ వివరాలు విడుదలకు ముందే లీక్ అయ్యాయి. ఈ ఫొటోలను గమనించినట్లయితే, అయితే సఫారీ ఎక్స్‌జెడ్ఏ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్‌గా తెలుస్తోంది.

MOST READ:ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!

డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్

ఈ కొత్త సఫారీలో మధ్య వరుసలో వ్యక్తిగత కెప్టెన్ సీట్లు ఉన్నాయి. ఇది 6-సీటర్ వెర్షన్‌గా తెలుస్తోంది. ఇంకా ఇందులో డ్యాష్‌బోర్డ్ మధ్యలో ఉంచిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సెంటర్ కన్సోల్‌లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కోసం ప్రత్యేకమైన రౌండ్ డయల్ నాబ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మొదలైన ఫీచర్లను గమనించవచ్చు.

డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్

టాటా మోటార్స్ తమ కొత్త సఫారీని గతేడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో 'టాటా గ్రావిటాస్' పేరుతో కాన్సెప్ట్ వెర్షన్‌గా పరిచయం చేసింది. ఈ మోడల్‌ను టాటా హారియర్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఇది చూడటానికి టాటా హారియర్‌కు 7-సీటర్ వెర్షన్‌లా అనిపిస్తుంది.

MOST READ:బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్

అయితే, హారియర్‌కి మరియు సఫారీకి మధ్య వ్యత్యాసాన్ని చూపేందుకు కంపెనీ ఈ సఫారీ కారు ఫ్రంట్ డిజైన్‌ను ఇంటీరియర్ క్యాబిన్ లేఅవుట్‌ను స్వల్పంగా మార్పు చేసింది. టాటా నెక్సాన్‌లో గమనించినట్లుగా కొత్త సఫారీ ముందు భాగంలో Y-ఆకారపు ఫ్రంట్ గ్రిల్‌ను చూడొచ్చు.

డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్

ఇంకా ఇందులో ఫ్రంట్ గ్రిల్‌లోనే అమరినట్లుగా ఉండే సన్నని ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఫ్రంట్ బంపర్‌లో ఒకే హౌసింగ్‌లో అమర్చిన హెడ్‌ల్యాంప్‌లు మరియు ఫాగ్ ల్యాంప్‌లు కూడా ఉన్నాయి. టాటా మోటార్స్ తమ కొత్త డిజైన్ లాంగ్వేజ్అయిన 'ఇంపాక్ట్ 2.0' ఆధారంగా చేసుకొని ఈ కొత్త సఫారీని తయారు చేసింది.

MOST READ:జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..

డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్

టాటా మోటార్స్ తమ సఫారీని ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో అందుబాటులోకి తేనుంది. ఇందులో పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌విఎమ్, 9 ఇంచ్ టచ్‌స్క్రీన్, 9 స్పీకర్ జెబిఎల్ ఆడియో సిస్టమ్ విత్ యాంప్లిఫైయర్, ఇ-సిమ్ (ఎయిర్‌టెల్ మరియు బిఎస్‌ఎన్‌ఎల్) మరియు ఐఆర్‌ఏ కనెక్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్

ప్రత్యేకించి టాటా కనెక్టెడ్ కార్ ఫీచర్లలో అనేక విశిష్టమైన అంశాలు ఉన్నాయి. ఇందులో కార్ వాలెట్ మోడ్, ఫైండ్ మై కార్, లొకేషన్ షేరింగ్ మరియు లైవ్ ట్రాకర్, డ్రైవింగ్ విశ్లేషణ, కార్ హెల్త్ డిస్‌ప్లే, పానిక్ నోటిఫికేషన్స్, ఇన్‌స్ట్రుమెంట్ అలెర్ట్, రిమోట్ కార్ యాక్సెస్ కమాండ్ మరియు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించనున్న యుద్ధ విమానాలు ఇవే, చూసారా..!

డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్

అంతేకాకుండా, సోషల్ మీడియా ట్రైబ్స్, ట్రిప్ అనాలిసిస్ మరియు సోషల్ షేరింగ్ మరియు ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్స్ కూడా ఇందులో ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఫ్రంట్ అండ్ సైడ్ కర్టెన్స్‌తో పాటుగా మొత్తం 6 ఎయిర్‌బ్యాగులు, ఈబిడి, ఏబిఎస్, హిల్ డీసెంట్ కంట్రోల్, చైల్డ్ సీట్ ఐసోఓఫిక్స్, రియర్ పార్కింగ్ సెన్సార్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్ మొదలైనవి ఉండనున్నాయి.

డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్

ఇక ఇంజన్ విషయానికి వస్తే, కొత్త టాటా సఫారీలో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించే అవకాశం ఉంది.

Source: Rushlane

Most Read Articles

English summary
New Tata Safari Started Arriving To Dealerships Ahead Of Its Official Launch In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X