టాటా టియాగో సిఎన్‌జి వెర్షన్ వస్తోంది.. త్వరలోనే విడుదల: వివరాలు

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగోలో కంపెనీ కొత్తగా సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) ఇంధనంతో నడిచే వేరియంట్‌ను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ టాటా టియాగో సిఎన్‌జి వేరియంట్‌ను భారత రోడ్లపై పరీక్షిస్తోంది. తాజాగా, ఇందుకు సంబంధించి స్పై చిత్రాలు కూడా లీక్ అయ్యాయి.

టాటా టియాగో సిఎన్‌జి వెర్షన్ వస్తోంది.. త్వరలోనే విడుదల: వివరాలు

టాటా టియాగో ప్రస్తుతం కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తోంది. ఇందులో టర్బో పెట్రోల్ ఇంజన్ కానీ లేదా డీజిల్ ఇంజన్ ఆప్షన్ కానీ అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో, మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకొని టాటా మోటార్స్ ఈ మోడల్‌లో అధిక మైలేజ్‌ను అందించేలా కొత్తగా సిఎన్‌జి వేరియంట్‌ను తీసుకురాబోతోంది.

టాటా టియాగో సిఎన్‌జి వెర్షన్ వస్తోంది.. త్వరలోనే విడుదల: వివరాలు

కొత్త టాటా టియాగో సిఎన్‌జి మోడల్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్ ఉంటుంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో, దేశవ్యాప్తంగా సిఎన్‌జి మోడళ్లకు డిమాండ్ అధికమవుతోంది. ఈ నేపథ్యంలో, ఇప్పటికే మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి సంస్థలు సిఎన్‌జి కిట్‌లతో కూడిన ఎంట్రీ లెవల్ కార్లను విక్రయిస్తున్నాయి.

MOST READ:మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఇప్పుడు 22 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో

ఇదే కోవలో ఇప్పుడు టాటా మోటార్స్ కూడా తమ ఎంట్రీ లెవల్ కార్లలో సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. టాటా మోటార్స్ తమ సిఎన్‌జి మోడళ్లను వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ కార్లతో పోల్చుకుంటే సిఎన్‌జి మోడళ్లు ఎక్కువ మైలేజీని అందిస్తాయి.

టాటా టియాగో సిఎన్‌జి వెర్షన్ వస్తోంది.. త్వరలోనే విడుదల: వివరాలు

సాధారణంగా ఇలాంటి కార్లను ఎక్కువగా టాక్సీ సేవల కోసం ఉపయోగించే వారు మరియు పవర్‌తో సంబంధం లేకుండా మైలేజ్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కస్టమర్లు ఎంచుకుంటుంటారు. అయితే, సిఎన్‌జి ఇంధన లభ్యత మాత్రం దేశంలోని కొన్ని ప్రధాన నగరాలు మాత్రమే పరిమితం అయిన నేపథ్యంలో, దేశంలో ఈ తరహా వాహనాలను వినియోగించే వారి సంఖ్య కూడా తక్కువగానే ఉంటోంది.

MOST READ:2021 ఏప్రిల్ నెలలో భారీగా తగ్గిన మహీంద్రా ట్రాక్టర్ సేల్స్.. కారణం ఇదే

టాటా టియాగో సిఎన్‌జి వెర్షన్ వస్తోంది.. త్వరలోనే విడుదల: వివరాలు

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాటా టియాగో పెట్రోల్ వెర్షన్‌లో రెవోట్రాన్ 1.2 లీటర్, 3-సిలిండర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 86 పిఎస్ శక్తిని మరియు 3300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

టాటా టియాగో సిఎన్‌జి వెర్షన్ వస్తోంది.. త్వరలోనే విడుదల: వివరాలు

కాగా, టాటా టియాగో సిఎన్‌జి వెర్షన్‌లో కూడా ఇదే ఇంజన్‌ను సిఎన్‌జి ఇంధనంతో నడిచేలా ట్యూన్ చేయనున్నారు. అయితే, సిఎన్‌జి ఫ్యూయెల్ కారణంగా ఈ ఇంజన్ పవర్, టార్క్ గణాంకాల్లో భారీ తగ్గుదల ఉంటుంది. టాటా టియాగో బూట్ స్పేస్‌లో 12 కిలలో సిఎన్‌జి ట్యాంక్‌ను అమర్చే అవకాశం ఉంది. ఈ ట్యాంక్ వలన బూట్ స్పేస్ తగ్గినప్పటికీ, దాని మైలేజ్ మాత్రం కిలోకు 30-35 కిమీ మధ్యలో ఉంటుంది.

MOST READ:కర్ఫ్యూ సమయంలో పట్టుబడ్డారో.. ఇక అంబులెన్స్‌లోకే, ఎందుకంటే?

టాటా టియాగో సిఎన్‌జి వెర్షన్ వస్తోంది.. త్వరలోనే విడుదల: వివరాలు

అంతేకాకుండా, సాధారణ పెట్రోల్ మోడల్‌తో పోలిస్తే, సిఎన్‌జి కిట్‌తో కూడిన టాటా టియాగో మోడల్ ధర సుమారు రూ.50,000 వరకూ అధికంగా ఉండే అవకాశం ఉంది. టాటా టియాగో సిఎన్‌జి మోడల్‌ను ఎక్స్‌టి మరియు ఎక్స్‌జెడ్ వేరియంట్‌లలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కారుతో పాటుగా, టాటా మోటార్స్ విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌లో కూడా కంపెనీ సిఎన్‌జి మోడల్‌ను ప్రవేశపెట్టవచ్చు.

టాటా టియాగో సిఎన్‌జి వెర్షన్ వస్తోంది.. త్వరలోనే విడుదల: వివరాలు

ప్రస్తుతం భారతదేశంలో 10 రకాల సిఎన్‌జి మోడళ్లు అమ్ముడవుతున్నాయి. ఇందులో మారుతి సుజుకి వ్యాగన్ఆర్, ఎర్టిగా, ఆల్టో, సెలెరియో, ఎస్-ప్రెసో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, శాంత్రో మరియు ఔరా మొదలైనవి ఉన్నాయి.

MOST READ:కరోనా రోగుల కోసం కార్లనే మొబైల్ హాస్పిటల్స్‌గా మార్చిన యువకులు

టాటా టియాగో సిఎన్‌జి వెర్షన్ వస్తోంది.. త్వరలోనే విడుదల: వివరాలు

ప్రస్తుతం, దేశంలో నిరంతరాయంగా పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో, ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాకు డిమాండ్ జోరందుకుంది. దీంతో కంపెనీలు సిఎన్‌జి, హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.

Most Read Articles

English summary
Tata Tiago CNG Spotted Testing, India Launch Soon. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X