ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన 2021 టియాగో ఎన్‌ఆర్‌జి: ధర & వివరాలు

భారతదేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన 'టాటా మోటార్స్' ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో తన 2021 టియాగో ఎన్‌ఆర్‌జి మోడల్ విడుదల చేసింది. ఈ కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి ప్రారంభ ధర రూ. 6.57 లక్షలు(ఎక్స్-షోరూమ్). కొత్త టియాగో ఎన్‌ఆర్‌జి మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో పాటు రెండు ట్రిమ్‌లలో అందించబడుతుంది.

కొత్త టియాగో ఎన్‌ఆర్‌జి బుకింగ్స్ దేశవ్యాప్తంగా ప్రారంభించబడ్డాయి. ఈ టియాగో ఎన్‌ఆర్‌జి కొనుగోలు చేయదలచిన కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన 2021 టియాగో ఎన్‌ఆర్‌జి: ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి మాన్యువల్ (ఎమ్‌టి) వేరియంట్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (ఏఎమ్‌టి) వేరియంట్. వీటి ధరల విషయానికి వస్తే వరుసగా రూ. 6.57 లక్షలు మరియు రూ. 7.09 లక్షలు.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన 2021 టియాగో ఎన్‌ఆర్‌జి: ధర & వివరాలు

కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి నాలు కలర్ ఆప్సన్లలో అందుబాటులో ఉంటుంది.

అవి:

  • ఫారెస్టా గ్రీన్
  • ఫైర్ రెడ్
  • స్నో వైట్
  • క్లౌడీ గ్రే
  • ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన 2021 టియాగో ఎన్‌ఆర్‌జి: ధర & వివరాలు

    టాటా టియాగో ఎన్‌ఆర్‌జి వెర్షన్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ కొత్త వెర్షన్ యొక్క ఎక్స్టీరియార్ చాలా వరకు అప్డేట్ చేయబడింది. ఇది ఆల్‌రౌండ్ బాడీ క్లాడింగ్‌తో స్టాండర్డ్ మోడల్‌పై కఠినమైన వైఖరిని కలిగి ఉంది. మెరుగైన ఆఫ్-రోడ్ సామర్ధ్యాల కోసం కంపెనీ డ్యూయల్-పాత్ సస్పెన్షన్‌ను అందించింది. ఇందులో 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, 181 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, రూఫ్ రైల్స్, బ్లాక్-అవుట్ రూఫ్ వంటివి కూడా ఉన్నాయి.

    ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన 2021 టియాగో ఎన్‌ఆర్‌జి: ధర & వివరాలు

    టియాగో ఎన్‌ఆర్‌జిలోని ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే, ఇందులో చాలా వరకు దాని మునుపటి మోడల్ లోని ఫీచర్స్ ఉన్నాయి. అయితే కొన్ని అప్డేట్స్ మాత్రం గుర్తించవచ్చు. ఇందులో కొత్త చార్‌కోల్ బ్లాక్ ఇంటీరియర్స్, డెకో స్టిచింగ్‌తో పూర్తి ఫాబ్రిక్ సీట్లు, కాంట్రాస్ట్ సైడ్ ఎయిర్ వెంట్స్, 8-స్పీకర్ హర్మన్ సరౌండ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో & యాపిల్ కార్ప్లే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పుష్ స్టార్ట్ బటన్ వంటివి ఉన్నాయి.

    ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన 2021 టియాగో ఎన్‌ఆర్‌జి: ధర & వివరాలు

    2021 టాటా టియాగో ఎన్‌ఆర్‌జి హ్యాచ్‌బ్యాక్, దాని స్టాండర్డ్ మోడల్ వలె అదే ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఇది 1.2-లీటర్, 3-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 6,000 ఆర్‌పిఎమ్‌ వద్ద 84.5 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్‌ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టి యూనిట్‌కు జత చేయబడి ఉంటుంది.

    ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన 2021 టియాగో ఎన్‌ఆర్‌జి: ధర & వివరాలు

    కొత్త 2021 టియాగో ఎన్‌ఆర్‌జి మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. కావున ఇది సేఫ్టీ విషయంలో ఏకంగా 4 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ లో ఏబీఎస్ విత్ ఈబిడి మరియు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లతో ప్రామాణికంగా వస్తుంది. అంతే కాకుండా ఇందులో కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, డే అండ్ నైట్ IRVM, రియర్ పార్కింగ్ కెమెరా, ప్రిటెన్షనర్‌లతో సీట్ బెల్ట్‌ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

    ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన 2021 టియాగో ఎన్‌ఆర్‌జి: ధర & వివరాలు

    కొత్త టాటా టియాగో ఇప్పుడు అనేక అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలతో చాలా అద్భుతంగా ఉంది. అంతే కాకుండా ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ కూడా కొంతవరకు పునఃరూపకల్పన చేయబడింది. టియాగో ఎన్‌ఆర్‌జి పరిమిత సమయం వరకు అందుబాటులో ఉంటుంది. ఇది భారతీయ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలతో ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.

Most Read Articles

English summary
Tata tiago nrg launched in india price 6 57 lakh features variant engine details
Story first published: Wednesday, August 4, 2021, 12:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X