దేశీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టియాగో ఎక్స్‌టిఎ ఎఎమ్‌టి' ; ధర & వివరాలు

భారత మార్కెట్లో టాటా మోటార్స్ తన టియాగో ఎక్స్‌టిఎ ఎఎమ్‌టి వేరియంట్ ని విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్‌ ధర రూ. 5.99 లక్షలు. టాటా టియాగో ఎక్స్‌టిఎ ఎఎమ్‌టి ఈ మోడల్‌లో నాల్గవ ఎఎమ్‌టి ఆప్సన్ అవుతుంది. కొత్త టాటా టియాగో కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో చాలా సహాయపడుతుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టియాగో ఎక్స్‌టిఎ ఎఎమ్‌టి' ; ధర & వివరాలు

టాటా మోటార్స్ యొక్క కొత్త వేరియంట్ అయిన టియాగో ఇప్పుడు బ్రాండ్ యొక్క చౌకైన ఆటోమేటిక్ వేరియంట్‌గా ఉంటుంది. ఈ కొత్త వేరియంట్ కంటే ముందు, టాటా టియాగో యొక్క ఎక్స్‌జెడ్ఏ చౌకైన ఆటోమేటిక్ వేరియంట్. ఈ టాటా టియాగో ఎక్స్‌జెడ్ఏ ధర రూ. 6.46 లక్షలు. ప్రస్తుతం ఇది కంపెనీ ఎంట్రీ లెవల్ మోడల్. ఇది రూ. 4.85 లక్షల నుండి రూ. 6.84 లక్షల వరకు ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టియాగో ఎక్స్‌టిఎ ఎఎమ్‌టి' ; ధర & వివరాలు

టాటా మోటార్స్ యొక్క కొత్త వేరియంట్ విడుదల సందర్భంగా, ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, వినియోగదారులకు అతి తక్కువ ధరలో అందించడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము. దేశీయ మార్కెట్లో టాటా టియాగోకు మంచి స్పందన ఉందన్నారు.

MOST READ:జూనియర్ ఎన్టీఆర్ కొత్త కార్ ఖరీదు 5 కోట్లు.. ఇంతకీ ఆ కార్ ఏదో మీరూ చూడండి

దేశీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టియాగో ఎక్స్‌టిఎ ఎఎమ్‌టి' ; ధర & వివరాలు

ఇటీవల కాలంలో ఇండియన్ మార్కెట్లో ఆటోమేటిక్ వేరియంట్ల డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో భాగంగానే టాటా మోటార్స్ కొత్త టియాగో విడుదల చేసింది. టాటా టియాగో ప్రస్తుతం 1.2 లీటర్ పెట్రోల్‌తో ఒకే ఇంజన్ ఆప్షన్‌తో అందిస్తోంది. ఈ ఇంజన్ 86 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీనికి 5 స్పీడ్ మాన్యువల్‌తో 5 స్పీడ్ ఎఎమ్‌టి ఆప్సన్ అందుబాటులో ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టియాగో ఎక్స్‌టిఎ ఎఎమ్‌టి' ; ధర & వివరాలు

టాటా మోటార్స్ తన టియాగోను 2016 లో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. కానీ గత సంవత్సరం మాత్రమే దాని ఫేస్ లిఫ్ట్ అవతార్ మార్కెట్లో విడుదల చేయబడింది. దాని బిఎస్ 6 అవతార్ గ్లోబల్ ఎన్‌సిఎపి టెస్ట్ లో 4 నక్షత్రాలను అందుకుంది. ఈ కారణంగా ఇది దాని విభాగంలో సురక్షితమైన కారుగా నిలిచింది.

MOST READ:భారత్‌లో విడుదలైన జపనీస్ లగ్జరీ కార్.. ఇది చాలా కాస్ట్లీ గురూ.!!

దేశీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టియాగో ఎక్స్‌టిఎ ఎఎమ్‌టి' ; ధర & వివరాలు

టాటా టియాగోలో 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, రియర్ వైపర్ విత్ డీఫాగర్, 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ, 8 స్పీకర్ హార్మోన్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉంటాయి.

దేశీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టియాగో ఎక్స్‌టిఎ ఎఎమ్‌టి' ; ధర & వివరాలు

ఇప్పటివరకు టాటా మోటార్స్ 3.25 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు అధికారికంగా ప్రకటించింది. టాటా మోటార్స్ యొక్క మార్కెట్ రోజురోజుకి మెరుగుపడుతోంది. టాటా మోటార్స్ గత ఏడాది నుంచి తన ప్రస్తుత మోడళ్లను అప్‌డేట్ చేస్తోంది. అంతే కాకుండా కొత్త వేరియంట్‌లను విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్ కొనుగోలు చేసిన సినీ నటి భావన

Most Read Articles

English summary
Tata Tiago XTA AMT Launched In India. Read in Telugu.
Story first published: Thursday, March 4, 2021, 13:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X