టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ విక్రయిస్తున్న టిగోర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కంపెనీ ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. అయితే, ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం ప్రభుత్వ మరియు వాణిజ్య వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!

కాగా, కంపెనీ ఇప్పుడు ఇందులో ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త పేరు, సరికొత్త డిజైన్, మెరుగైన రేంజ్ మరియు అధునాత ఫీచర్లతో కంపెనీ ఈ కొత్త 2021 వెర్షన్ టాటా టిగోర్‌ను అభివృద్ధి చేసింది.

టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!

టాటా ఎక్స్ ప్రెస్-టి (X Pres-T) పేరుతో కంపెనీ ఈ కొత్త 2021 మోడల్ ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టనుంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.12.90 లక్షలు ఉండొచ్చని సమాచారం.

MOST READ:భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో‌ చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు

టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!

టాటా టిగోర్ ఈవికి రీబ్యాడ్జ్ వెర్షన్‌గా వస్తున్న టాటా ఎక్స్ ప్రెస్-టి ఈవి స్టాండర్డ్ మరియు లాంగ్ రేంజ్ బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. లాంగ్ రేంజ్ వేరియంట్‌లో పెద్ద బ్యాటరీ ఉంటుంది. ప్రైవేట్ లిమిటెడ్ సంస్తలతో పాటు వాణిజ్య వినియోగదారులకు కూడా ఇది అందుబాటులో ఉంటుంది.

టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!

టాటా ఎక్స్ ప్రెస్-టి ఈవి ఓవరాల్ డిజైన్ మాత్రం చూడటానికి టాటా టిగోర్ పెట్రోల్ కారు మాదిరిగానే ఉంటుంది. అయిత, ఇది ఎలక్ట్రిక్ కార్ కావటం వలన ఈ కారు చుట్టూ చాలా ప్రాంతాల్లో బ్లూ కలర్ హైలైట్స్ కనిపిస్తాయి. అంతేకాకుండా, ప్రస్తుత ఎలక్ట్రిక్ కార్లలో కనిపించినట్లుగా చార్జింగ్ సాకెట్‌ను సైడ్‌లో కాకుండా ఫ్రంట్ గ్రిల్‌లో ఉంచారు.

MOST READ:రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు

టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!

టాటా ఎక్స్ ప్రెస్-టి ఈవి కారులోని క్యాబిన్ లేఅవుట్ స్టాండర్డ్ టిగోర్ కాంపాక్ట్ సెడాన్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభ్యం కానుంది. స్టాండర్డ్ రేంజ్ వేరియంట్లో 16.2 కిలోవాట్ బ్యాటరీ మరియు లాంగ్ రేంజ్ వేరియంట్‌లో 21.5 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది.

టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!

ఈ బ్యాటరీ కారులో అమర్చిన 70 వోల్ట్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటారుకు శక్తినిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 41 హెచ్‌పి పవర్‌ను మరియు 105 న్యూటన్ మీటర్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లుగా ఉంటుంది.

MOST READ:మీకు తెలుసా.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 లో కనిపించే క్లాసిక్ కార్లు, ఇవే

టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!

స్టాండర్డ్ రేంజ్ టాటా ఎక్స్ ప్రెస్-టి ఈవి పూర్తి బ్యాటరీ చార్జ్‌పై 165 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. అలాగే, లాంగ్ రేంజ్ వేరియంట్ టాటా ఎక్స్ ప్రెస్-టి ఈవి 213 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. గతంలో టాటా టిగోర్ ఈవి స్టాండర్డ్ రేంజ్ 143 కిలోమీటర్లుగా ఉండేది.

టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!

ఇక చార్జింగ్ ఆప్షన్ విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. లాంగ్ రేంజ్ వేరియంట్‌లోని బ్యాటరీని స్టాండర్డ్ చార్జర్ సాయంతో 0-100 శాతం చార్జ్ చేయటానికి సుమారు 11.5 గంటల సమయం పడుతుంది. అదే, ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో అయితే, కేవలం 2 గంటల్లోనే 0 - 80 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు.

MOST READ:భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు

టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!

ఇక స్టాండర్డ్ రేంజ్ వేరియంట్ విషయానికి వస్తే, అందులోని బ్యాటరీని స్టాండర్డ్ చార్జర్ సాయంతో 0-100 శాతం చార్జ్ చేయటానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. అదే, ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో అయితే, కేవలం 1.5 గంటల్లోనే 0 - 80 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు.

టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!

టాటా ఎక్స్ ప్రెస్-టి ఈవి ప్రతి బ్యాటరీ ప్యాక్‌తో రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. స్టాండర్డ్ రేంజ్ మోడల్ ఎక్స్ మరియు ఎక్స్‌టి వేరియంట్లలో లభిస్తుంది. అలాగే, లాంగ్ రేంజ్ వేరియంట్ ఎక్స్ఎమ్ + మరియు ఎక్స్‌టి + అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులోని + గుర్తు లాంగ్ రేంజ్ వెర్షన్ యొక్క పెద్ద బ్యాటరీని సూచిస్తుంది.

టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!

టాటా ఎక్స్ ప్రెస్-టి ఈవి ఎక్స్‌ఎమ్ వేరియంట్లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్స్, 14 ఇంచ్ స్టీల్ వీల్స్, ఎకో అండ్ స్పోర్ట్ డ్రైవ్ మోడ్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ విండోస్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన హర్మాన్ ఆడియో సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!

టాప్-స్పెక్ ఎక్స్‌టి వేరియంట్లలో 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్, పవర్డ్ సైడ్ మిర్రర్స్, రిమోట్ లాకింగ్, బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్ మరియు వింగ్ మిర్రర్ వంటి ఫీచర్లు లభిస్తాయి. గతంలో ఈ మోడల్‌లో అందుబాటులో ఉన్న ఎంట్రీ లెవల్ ఎక్స్ఈ వేరియంట్‌ను కంపెనీ లైనప్ నుండి తొలగించింది. దీంతో ఫేస్‌లిఫ్టెడ్ టైగర్ ఈవికి మార్కెట్లో ప్రత్యక్ష పోటీ ఉండదు.

Source: Autocar India

Most Read Articles

English summary
Tata Tigor EV Facelift To Be Named As X Pres-T; India Launch Expected Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X