మార్కెట్లో Tata XPRES-T EV ఎలక్ట్రిక్ కారు విడుదల.. కానీ ఇది వారికి మాత్రమే..

భారతదేశపు ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవల తమ ఎలక్ట్రిక్ కారు (టాటా టిగోర్ ఈవీ) Tata Tigor EV యొక్క అప్‌డేటెడ్ వెర్షన్‌ ను దేశీయ విపణిలో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు ఇందులో ఫ్లీట్ ఆపరేటర్ కస్టమర్ల కోసం (టాటా ఎక్స్‌ప్రెస్-టి ఈవీ) Tata Xpres-T EV అనే ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది.

మార్కెట్లో Tata XPRES-T EV ఎలక్ట్రిక్ కారు విడుదల.. కానీ ఇది వారికి మాత్రమే..

అంటే, Tata Xpres-T EV ఎలక్ట్రిక్ కారును కేవలం వాణిజ్య వినియోగం మరియు టాక్సీ ప్రయోజనాల కోసం మాత్రం విక్రయిస్తారన్నమాట. దేశీయ మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర రూ. 9.54 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. గతంలో కూడా టాటా మోటార్స్ అందించిన టిగోర్ ఈవీ కూడా వాణిజ్య వినియోగం మరియు ఫ్లీట్ ఆపరేషన్స్ కోసం మాత్రమే వినియోగించబడేది.

మార్కెట్లో Tata XPRES-T EV ఎలక్ట్రిక్ కారు విడుదల.. కానీ ఇది వారికి మాత్రమే..

కాగా, ఇప్పుడు లేటెస్ట్ గా జిప్‌ట్రాన్ (Ziptron) టెక్నాలజీతో ప్రవేశపెట్టిన కొత్త 2021 Tata Tigor EV సాధారణ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టింది. ఇది మునుపటి కంటే మెరుగైన రేంజ్ మరియు శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. తాజాగా విడుదల చేసిన Tata Xpres-T EV ద్వారా కంపెనీ మొబిలిటీ సేవలు, కార్పొరేట్ మరియు ప్రభుత్వ ఫ్లీట్ కస్టమర్ల దృష్టిని ఆకర్షించాలని భావిస్తోంది.

మార్కెట్లో Tata XPRES-T EV ఎలక్ట్రిక్ కారు విడుదల.. కానీ ఇది వారికి మాత్రమే..

దీనికి అనుగుణంగా, కంపెనీ ఈ Tata xpres-T EV ఎలక్ట్రిక్ కారులో లాంగ్ రేంజ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాలను కల్పించింది. కస్టమర్ల అవసరాలను బట్టి కొత్త XPRES-T ఎలక్ట్రిక్ సెడాన్ 2 రేంజ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో కంపెనీ 21.5 kWh మరియు 16.5 kWh అనే రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లను అందిస్తోంది.

మార్కెట్లో Tata XPRES-T EV ఎలక్ట్రిక్ కారు విడుదల.. కానీ ఇది వారికి మాత్రమే..

కొత్త Tata xpres-T EV లో అమర్చిన బ్యాటరీ ప్యాక్ ని బట్టి దాని రేంజ్ మారుతూ ఉంటుంది. ఇందులోని 21.5 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన వేరియంట్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 213 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుండగా, 16.5 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన వేరియంట్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 165 కిలోమీటర్ల రేంజ్ ని ఆఫర్ చేస్తుంది. ఈ రేంజ్ ని ARAI ధృవీకరించింది. Xpres-T EV వేరియంట్లు మరియు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

Range Variants Price With Fame Subsidy
XpresT 165 XM ₹9.54 Lakh
XZ ₹10.04 Lakh
XpresT 213 XM+ ₹10.14 Lakh
XZ+ ₹10.64 Lakh
మార్కెట్లో Tata XPRES-T EV ఎలక్ట్రిక్ కారు విడుదల.. కానీ ఇది వారికి మాత్రమే..

Tata Motors ఈ ఎలక్ట్రిక్ సెడాన్‌ ను XM మరియు XZ అనే రెండు ట్రిమ్ లలో ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ కారు సున్నా కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఇది సింగిల్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులోని అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు (ఫ్రంట్ డ్రైవర్ మరియు కో ప్యాసింజర్ కోసం) మరియు ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్ గా లభిస్తాయి.

మార్కెట్లో Tata XPRES-T EV ఎలక్ట్రిక్ కారు విడుదల.. కానీ ఇది వారికి మాత్రమే..

చార్జింగ్ సమయం విషయానికి వస్తే, Tata XPRES-T EV ఎలక్ట్రిక్ కారులోని 16.5 kWh బ్యాటరీ ప్యాక్‌ ని ఫాస్ట్ ఛార్జింగ్ ఉపయోగించి కేవలం 90 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే, ఇందులోని 21.5 kWh బ్యాటరీ ప్యాక్‌ ను 110 నిమిషాల్లో 0 నుండి నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

మార్కెట్లో Tata XPRES-T EV ఎలక్ట్రిక్ కారు విడుదల.. కానీ ఇది వారికి మాత్రమే..

ఫాస్ట్ చార్జర్ కాకుండా, ఇది స్టాండర్డ్ 15 యాంప్స్ హోమ్ చార్జర్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ కారును ఏదైనా సాధారణ 15 amp ప్లగ్ పాయింట్ నుండి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో స్టాండర్డ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ ను కంపెనీ అందిస్తోంది. అంతేకాకుండా, దీని ఇంటీరియర్ థీమ్ మొత్తం ప్రీమియం బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడి ఉంటుంది.

మార్కెట్లో Tata XPRES-T EV ఎలక్ట్రిక్ కారు విడుదల.. కానీ ఇది వారికి మాత్రమే..

ఈ కారును ఎలక్ట్రిక్ కారుగా హైలైట్ చేసేందుకు కంపెనీ దీని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్లలో అక్కడక్కడా బ్లూ కలర్ యాక్సెంట్స్ ను ఉపయోగించింది. కమర్షియల్ ఫ్లీట్ కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేశామని మరియు ఈ కొత్త Tata XPRES-T EV ధరలకు FAME సబ్సిడీ కూడా వర్తిస్తుందని కంపెనీ వివరించండి.

మార్కెట్లో Tata XPRES-T EV ఎలక్ట్రిక్ కారు విడుదల.. కానీ ఇది వారికి మాత్రమే..

రెగ్యులర్ కస్టమర్ల కోసం Tata Tigor EV..

ఇదిలా ఉంటా సాధారణ వినియోగదారుల కోసం టాటా మోటార్స్ ఇప్పటికే తమ సరికొత్త Tata Tigor EV ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో విక్రయిస్తోంది. దేశీయ విపణిలో ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి: XE, XM మరియు XZ+.

మార్కెట్లో Tata XPRES-T EV ఎలక్ట్రిక్ కారు విడుదల.. కానీ ఇది వారికి మాత్రమే..

కొత్త 2021 Tata Tigor EV ని కంపెనీ తమ పాపులర్ జిప్‌ట్రాన్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌ ను ఉపయోగించి తయారు చేసింది. ఇదే ప్లాట్‌ఫామ్ పై కంపెనీ తమ ప్రస్తుత నెక్సాన్ ఈవీ (Nexon EV) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా తయారు చేస్తుంది. ఈ జిప్‌ట్రాన్ టెక్నాలజీ కారణంగా ఇది ఇప్పుడు పూర్తి చార్జ్ పై గరిష్టంగా 306 కిమీ కంటే ఎక్కువ రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

Most Read Articles

English summary
Tata xpres t ev launched in india price specs details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X