కొత్త 2021 టెస్లా మోడల్ ఎస్ ఫీచర్ల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్ టెస్లా అందిస్తున్న 'మోడల్ ఎస్'లో కంపెనీ ఓ సరికొత్త వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. కొత్త 2021 టెస్లా మోడల్ ఎస్ ఎలక్ట్రిక్ కారును మునుపటి కన్నా మరింత అద్భుతంగా తీర్చిదిద్దింది. ఇందులోని అధునాత ఫీచర్ల గురించి తెలిస్తే ఎరైనా హవ్వ అని ఆశ్చర్యపోవాల్సిందే. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

కొత్త 2021 టెస్లా మోడల్ ఎస్ ఫీచర్ల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఇప్పటి వరకూ టెస్లా విక్రయించిన కార్లతో పోల్చుకుంటే, ఈ కొత్త 2020 మోడల్ ఎస్ అన్నింటికన్నా శక్తివంతమైనదని కంపెనీ పేర్కొంది. ఈ కారులో సరికొత్త పవర్‌ట్రైన్ (ఎలక్ట్రిక్ మోటార్)ను ఉపయోగించారు. అంతేకాకుండా దీని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో కూడా పెను మార్పులు చేశారు.

కొత్త 2021 టెస్లా మోడల్ ఎస్ ఫీచర్ల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ముందుగా ఇందులోని పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఈ కొత్త మోడల్ ఎస్ మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. అవి: ప్లాయిడ్, ప్లాయిడ్ ప్లస్ అనే పెర్ఫార్మెన్స్ వేరియంట్లు మరియు లాంగ్ రేంజ్ వేరియంట్. ప్లాయిడ్ మరియు ప్లాయిడ్ ప్లస్ మూడు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంటాయి. అయితే, లాంగ్-రేంజ్ మోడల్‌లో మాత్రం ప్రతి యాక్సిల్‌లో ఒక్కటి చొప్పున రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంటుంది.

MOST READ:ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి

కొత్త 2021 టెస్లా మోడల్ ఎస్ ఫీచర్ల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మోడల్ ఎస్ స్టాండర్డ్ 100 కిలోవాట్ అవర్ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ప్లాయిడ్ మరియు ప్లాయిడ్ ప్లస్ మోడళ్లు పూర్తి బ్యాటరీ చార్జ్‌పై వరుసగా 627 కిలోమీటర్లు మరియు 837 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తాయని కంపెనీ పేర్కొంది.

కొత్త 2021 టెస్లా మోడల్ ఎస్ ఫీచర్ల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ప్లాయిడ్ ప్లస్ వేరియంట్‌లో ఉండే మూడు ఎలక్ట్రిక్ మోటార్లు గరిష్టంగా 1,100 బిహెచ్‌పి పవర్‌ని జనరేట్ చేస్తాయి. ఇది కేవలం 2 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు.

ఇకపోతే, ప్లాయిడ్ వేరియంట్‌లోని పవర్‌ట్రైన్ 1,020 బిహెచ్‌పి పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఇది కూడా కేవలం 2 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

MOST READ:వావ్.. ల్యాండ్‌రోవర్ డిఫెండర్ క్యాపబిలిటీ అద్భుతః ; ఎందుకో మీరే చూడండి

కొత్త 2021 టెస్లా మోడల్ ఎస్ ఫీచర్ల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

టెస్లా మోడల్ 2021 లైనప్‌లో చివరి వేరియంట్ అయిన లాంగ్ రేంజ్ వెర్షన్ గరిష్టంగా 670 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు 3.1 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. పూర్తి బ్యాటరీ ఛార్జ్‌పై ఇది 663 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

కొత్త 2021 టెస్లా మోడల్ ఎస్ ఫీచర్ల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

టెస్లా తమ కొత్త మోడల్ ఎస్ చార్జింగ్ సమయాన్ని కూడా భారీగా తగ్గించింది. ఇందులోని ఆన్-బోర్డ్ 11.5 కిలోవాట్ల ఛార్జర్‌తో కారులోని బ్యాటరీలను పూర్తిగా 100 శాతం చార్జ్ చేయటానికి 6 నుండి 9 గంటల సమయం పడుతుంది.

అయితే, సూపర్‌ఛార్జర్స్ అని పిలువబడే బ్రాండ్ యొక్క 250 కిలోవాట్ ఫాస్ట్-ఛార్జింగ్ స్టేషన్లను ఉపయోగించి చార్జ్ చేసినట్లయితే, కేవలం 30 నిమిషాల నుండి 90 నిమిషాల వ్యవధిలోనే ఇందులోని బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

MOST READ:రైల్వే ట్రాక్ వద్ద సహనం లేకుంటే ఏమవుతుందో తెలుసా.. అయితే వీడియో చూడండి

కొత్త 2021 టెస్లా మోడల్ ఎస్ ఫీచర్ల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

టెస్లా మోడల్ ఎస్ ఎక్స్టీరియర్ డిజైన్‌లో చేసిన మార్పుల విషయానికి వస్తే, ఇది ఇప్పుడు రివైజ్డ్ ఫ్రంట్ బంపర్, అల్లాయ్ వీల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీని ఫ్రంట్ బోనెట్‌లో కూడా సూక్ష్మ మార్పులు చేయబడ్డాయి. అయితే దీని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం మారదు.

కొత్త 2021 టెస్లా మోడల్ ఎస్ ఫీచర్ల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

కొత్త 2021 మోడల్ ఎస్ ఇంటీరియర్స్‌లో చేసిన మార్పులను గమనిస్తే, ఇందులో ఉడ్ లేదా కార్బన్-ఫైబర్‌తో ఫినిష్ చేయబడిన డాష్‌బోర్డ్‌తో సరికొత్త లేఅవుట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 10 టెరాఫ్లోప్‌ల ప్రాసెసింగ్ పవర్‌తో 17 ఇంచ్ టచ్‌స్క్రీన్ యూనిట్ ఉంటుంది. ఈ యూనిట్ ద్వారానే కారులోని అన్ని ఫంక్షన్లను కంట్రోల్ చేయవచ్చు.

MOST READ:బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

కొత్త 2021 టెస్లా మోడల్ ఎస్ ఫీచర్ల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

వెనుక సీటులో కూర్చునే ప్రయాణీకుల కోసం సెంటర్ కన్సోల్‌పై 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కూడా ఉంటుంది. ఇందులో ట్రెడిషనల్‌గా కనిపించే గుండ్రటి స్టీరింగ్ వీల్‌కు బదులుగా, విమానాల్లో కనిపించేలా దీర్ఘచతురస్రాకారపు స్టీరింగ్ వీల్ ఉంటుంది.

కొత్త 2021 టెస్లా మోడల్ ఎస్ ఫీచర్ల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

అంతేకాకుండా, ఈ స్టీరింగ్ కాలమ్‌లో హెడ్‌లైట్స్ మరియు వైపర్స్ కోసం ట్రెడిషనల్ కాలమ్ స్విచ్‌లకు బదులుగా టచ్ సెన్సిటివ్ బటన్లను ఉపయోగించారు. అమెరికాలో టెస్లా మోడల్ ఎస్ ప్రారంభ ధర 74,490 డాలర్లుగా ఉంది. ఇందులో ప్లాయిడ్ మరియు ప్లాయిడ్ ప్లస్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ల ధరలు వరుసగా 1,14,490 డాలర్లు మరియు 1,34,490 డాలర్లుగా ఉన్నాయి.

కొత్త 2021 టెస్లా మోడల్ ఎస్ ఫీచర్ల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

కొత్త 2021 టెస్లా మోడల్ ఎస్ డెలివరీలు వచ్చే నెల నుండి అంతర్జాతీయ మార్కెట్లలో ప్రారంభం కానున్నాయి. కాగా, టెస్లా కంపెనీ భారత మార్కెట్లో కూడా తమ కార్యకాలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లోనే ఈ కంపెనీ, దేశంలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు మరియు దాని బుకింగ్ వివరాల గురించి వెల్లడిచేసే అవకాశం ఉంది.

Most Read Articles

Read more on: #టెస్లా #tesla
English summary
Tesla Inc Unveils New 2021 Model S Globally; Specs, Features And Range. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X