3 ఏళ్లలో 10 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించిన Tesla.. హ్యాట్సాఫ్..!!

అమెరికన్ ఎలక్టిక్ కార్ కంపెనీ టెస్లా (Tesla) అందిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సంస్థ గడచిన మూడేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ కార్లను విక్రయించి, ఓ కొత్త రికార్డును సృష్టించింది. టెస్లా ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థగా అవతరించింది.

3 ఏళ్లలో 10 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించిన Tesla.. హ్యాట్సాఫ్..!!

జూలై 1, 2003 న టెస్లా ఎలక్ట్రిక్ కార్ల రంగంలోకి ప్రవేశించింది. ఈ సంస్థ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకూ 20 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. గత మూడేళ్లలోనే ఈ కంపెనీ 15 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. ప్రారంభంలో, ఈ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు చాలా తక్కువగా ఉండేవి. గత 2018 నాలుగో త్రైమాసికంలో కంపెనీ కేవలం 5 లక్షల వాహనాలను విక్రయించింది.

3 ఏళ్లలో 10 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించిన Tesla.. హ్యాట్సాఫ్..!!

కాగా, 2021 త్రైమాసికం నాటికి 20 లక్షల యూనిట్లకు పెరిగాయి. అంతకుముందు 2020 రెండవ త్రైమాసికంలో, కంపెనీ 10 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. ఇలా ప్రతి త్రైమాసికంలో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో చారిత్రాత్మక రికార్డులను సృష్టిస్తూనే ఉంది. ప్రపంచంలోని మరే ఇతర ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ కూడా ఇలాంటి సేల్స్ రికార్డులను సాధించలేకపోయాయి.

3 ఏళ్లలో 10 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించిన Tesla.. హ్యాట్సాఫ్..!!

టెస్లా ప్రోడక్ట్ లైనప్ లో ఎక్కువగా అమ్ముడైన కార్లు మోడల్ 3 మరియు మోడల్ Y. మొత్తం అమ్మకాలలో 15 లక్షలకు పైగా యూనిట్లు మోడల్ 3 మరియు మోడల్ Y ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. వాటి తర్వాత మోడల్ S మరియు మోడల్ X ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. వీటిలో టెస్లా రోడ్‌స్టర్ మోడల్ గణనీయమైన అమ్మకాల పరిమాణాన్ని కలిగి ఉంది. కానీ, వీటిలో అన్నింటికంటే, మోడల్ 3 ఎలక్ట్రిక్ కారును కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనంగా నిలిచింది.

3 ఏళ్లలో 10 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించిన Tesla.. హ్యాట్సాఫ్..!!

భారతదేశంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్లు

ఇదిలా ఉంటే, ఈ అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా, భారతదేశంలో కూడా ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. టెస్లా ఇప్పటికే, బెంగుళూరులో తమ కంపెనీ పేరును కూడా రిజిస్టర్ చేసుకుంది. భారతదేశంలో ముందుగా మోడల్ 3 కారుని విడుదల చేయాలని టెస్లా ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం టెస్లా భారత ప్రభుత్వంతో చర్చలు కూడా జరుపుతోంది.

3 ఏళ్లలో 10 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించిన Tesla.. హ్యాట్సాఫ్..!!

అయితే, టెస్లా ప్రస్తుతానికి తమ ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో తయారు చేసే ఆలోచనలో లేదు. పూర్తిగా విదేశాల్లో తయారైన ఎలక్ట్రిక్ కార్లను ఇక్కడికి దిగుమతి చేసుకొని విక్రయించాలని టెస్లా భావిస్తోంది. ఈ నేపథ్యంలో, మదేశంలో ఇంపోర్టెడ్ కార్లపై భారీ దిగుమతి సుంకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సుంకాలు 100 శాతానికి పైగా ఉన్నాయి. అంటే, అమెరికాలో రూ. 30 లక్షల ఖరీదు చేసే కారు, భారతదేశానికి చేరుకునే లోపు దాని ధర రూ. 60 లక్షలకు మించిపోతోందన్నమాట.

3 ఏళ్లలో 10 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించిన Tesla.. హ్యాట్సాఫ్..!!

ఈ నేపథ్యంలో భారతదేశం దిగుమతి సుంకాలను తగ్గించాలని టెస్లా కంపెనీ సీఈఓ ఎలోన్ మస్క్ వ్యాఖ్యానించారు. ఈ సుంకాలను తగ్గిస్తేనే భారతదేశంలోకి ప్రవేశిస్తామని టెస్లా మొండికేసి కూర్చుంది. అయితే, ఈ విషయంపై భారత ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. టెస్లా కార్లను భారతదేశంలోనే తయారు చేయాలని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ కోరారు.

3 ఏళ్లలో 10 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించిన Tesla.. హ్యాట్సాఫ్..!!

టెస్లా విషయంలో భారత ప్రభుత్వం తప్పకుండా పన్ను ప్రయోజనాలు కల్పిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. పబ్లిక్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా(పీఏఎఫ్‌ఐ) నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ, టెస్లా మాత్రం ముందుగా తమ కార్లను భారతదేశంలో దిగుమతి చేసుకొని విక్రయిస్తామని, ఇక్కడ మార్కెట్ బేస్ ఏర్పడిన తర్వాతనే ఎలక్ట్రిక్ కార్లను స్థానికంగా ఉత్పత్తి చేస్తామని టెస్లా చెబుతోంది.

3 ఏళ్లలో 10 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించిన Tesla.. హ్యాట్సాఫ్..!!

భారత ప్రభుత్వం మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. టెస్లా నేరుగా భారతదేశంలోకే ప్రవేశించి, ఇక్కడే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తే బాగుంటుందని చెబుతోంది. ఈ విషయంలో టెస్లా కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని రాజీవ్‌ కుమార్‌ కోరారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ఇటీవలే ఇదే విషయాన్ని గుర్తు చేశారు. టెస్లా సంస్థ ముందు భారత్‌లో కార్ల తయారీ ప్రారంభించాలని, ఆ తర్వాతే సుంకాల తగ్గింపు విషయాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు.

3 ఏళ్లలో 10 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించిన Tesla.. హ్యాట్సాఫ్..!!

టెస్లా నుండి లభ్యం కానున్న ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు మోడల్ 3 విషయానికి వస్తే, ఈ కారులో కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి, ఇందులోని బ్యాటరీలు పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 500 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ రేంజ్‌ని ఆఫర్ చేస్తాయి. ఈ కారు కేవలం 3.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

3 ఏళ్లలో 10 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించిన Tesla.. హ్యాట్సాఫ్..!!

ఈ ఎలక్ట్రిక్ కారును సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లో ఛార్జ్ చేస్తే, కేవలం 15 నిమిషాల్లో 175 మైళ్ల వేగానికి సరిపడా ఛార్జింగ్ సామర్థ్యాన్ని పొందవచ్చు. టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు ప్రపంచంలో అత్యంత ఉత్తేజకరమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. టెస్లా దీనిని భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ కారుగా విడుదల చేస్తుందని భావిస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

Read more on: #టెస్లా #tesla
English summary
Tesla sold over 10 lakh electric cars globally in less than 3 years details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X