భారతదేశంలో 3 కొత్త కార్ షోరూమ్‌లను ప్రారంభించనున్న టెస్లా!

అమెరికన్ కార్ బ్రాండ్ టెస్లా భారతదేశంలో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసినదే. ఇప్పటికే, కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఓ ప్లాంట్‌ను మరియు హెడ్‌క్వార్టర్స్‌ను ఓపెన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న టెస్లా, ఇప్పుడు దేశంలో మూడు కొత్త షోరూమ్‌లను కూడా ఓపెన్ చేయబోతోంది.

భారతదేశంలో 3 కొత్త కార్ షోరూమ్‌లను ప్రారంభించనున్న టెస్లా!

దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై మరియు ఐటి రాజధాని బెంగుళూరు నగరాల్లో టెస్లా ముందుగా తమ కార్ షోరూమ్‌లను ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించి కంపెనీ ఇప్పటికే స్థలాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం.

భారతదేశంలో 3 కొత్త కార్ షోరూమ్‌లను ప్రారంభించనున్న టెస్లా!

ఈ మూడు నగరాల్లో సుమారు 20,000-30,000 చదరపు అడుగుల వాణిజ్య స్థలాన్ని అన్వేషించేందుకు ఎగ్జిక్యూటివ్‌లను కూడా టెస్లా నియమించింది. షోరూమ్‌లతో పాటు ఈ ప్రదేశాలలో సర్వీస్ సెంటర్లు కూడా ప్రారంభించబడుతాయి. టెస్లా ప్రస్తుతానికి మెట్రోపాలిటన్ కస్టమర్లనే లక్ష్యంగా చేసుకుంటోంది.

MOST READ:ఉద్యోగం నుంచి తీసేశారని బీభత్సం సృష్టించిన మాజీ ఉద్యోగి.. ఇంతకీ ఏం చేసాడో తెలుసా?

భారతదేశంలో 3 కొత్త కార్ షోరూమ్‌లను ప్రారంభించనున్న టెస్లా!

టెస్లా తమ మొదటి మోడల్‌ను 2021 మధ్య నాటికి భారత్‌కు తీసుకురావాలాని భావిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో టెస్లా విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కార్ 'మోడల్ 3' సెడాన్‌ను కంపెనీ భారత్‌లోకి దిగుమతి చేసుకొని విక్రయించనుంది. భారతదేశంలో టెస్లా తమ కంపెనీ పేరును రిజిస్టర్ చేయటం, ఇప్పుడు షోరూమ్‌ల కోసం శోధించడం చూస్తుంటే, ఈ కంపెనీ భారత్ కోసం బలమైన ప్రణాళికనే సిద్ధం చేసుకున్నట్లుగా ఉంది.

భారతదేశంలో 3 కొత్త కార్ షోరూమ్‌లను ప్రారంభించనున్న టెస్లా!

తాజా మీడియా నివేదికల ప్రకారం, టెస్లా భారతదేశంలోకి అధికారికంగా ప్రవేశించడానికి ముందు, ఇక్కడి మార్కెట్లోని సాధ్యాసాధ్యాలను పరిశీలించి, పరిస్థితులను అంచనా వేసేందుకు కంపెనీ ఇప్పటికే ఓ టాప్ లెవల్ ఎగ్జిక్యూటివ్‌ను కూడా నియమించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత మార్కెట్లో టెస్లా విజయం అంత సులభం కానప్పటికీ, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధోరణి వేగంగా పెరుగుతుండటం ఈ కంపెనీకి కొన్ని సానుకూల సంకేతాలను అందిస్తోంది.

MOST READ:భారత్‌లో మళ్ళీ మొదలైన కరోనా లాక్‌డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?

భారతదేశంలో 3 కొత్త కార్ షోరూమ్‌లను ప్రారంభించనున్న టెస్లా!

టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ కంపెనీ ఇప్పటికే బెంగళూరులో తమ సంస్థ పేరును రిజిస్టర్ చేసుకుంది. ప్రారంభంలో భారతదేశంలో టెస్లా కార్లు ఖరీదైనవిగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఈ కంపెనీ సరసమైన ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. టెస్లా సంస్థ సీఈఓ ఎలోన్ మస్క్, భారత్‌లో తమ కార్ లాంచ్ గురించి మాట్లాడుతూ 2021లోనే ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశించాలని గతంలో ట్వీట్ చేశారు.

భారతదేశంలో 3 కొత్త కార్ షోరూమ్‌లను ప్రారంభించనున్న టెస్లా!

ప్రస్తుతం టెస్లాకు భారతదేశంలో తయారీ కేంద్రం లేనందున పొరుగు దేశమైన చైనాలో తయారైన ఎలక్ట్రిక్ కార్లను కంపెనీ భారతదేశానికి దిగుమతి చేసుకొని విక్రయించే అవకాశం ఉంది. అధిక దిగుమతి సుంకాల కారణంగా, ఈ కార్లు భారతదేశానికి చేరుకునే సమయానికి వాటి అసలు ధర కన్నా రెట్టింపు ధరను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే టెస్లా సంస్థ కూడా మేక్ ఇన్ ఇండియా ప్లాన్‌లో భాగంగా, తమ కార్లను భారతదేశంలోనే తయారు చేసినట్లయితే అవి సరసమైన ధరకే అందుబాటులోకి రావచ్చని అంచనా.

MOST READ:స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్; అల్లు అర్జున్ స్పెషల్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

భారతదేశంలో 3 కొత్త కార్ షోరూమ్‌లను ప్రారంభించనున్న టెస్లా!

టెస్లా భారతదేశంలో లగ్జరీ కార్ల విభాగంలోనే కాకుండా ప్రీమియం విభాగంలో కూడా సరసమైన కార్లను అందిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం టెస్లా గ్లోబల్ అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, కంపెనీ గత సంవత్సరం 3,67,500 కార్లను విక్రయించింది, ఇది 2019 అమ్మకాలతో పోలిస్తే 50 శాతం పెరిగింది. వచ్చే 2030 తర్వాత ప్రతి సంవత్సరం 2 కోట్ల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది.

భారతదేశంలో 3 కొత్త కార్ షోరూమ్‌లను ప్రారంభించనున్న టెస్లా!

భవిష్యత్తులో, టెస్లా భారతదేశంలో తయారు చేసిన కార్లను ఆసియాలోని ఇతర దేశాలతో పాటు యూరప్ మరియు దక్షిణ అమెరికాలోని కొన్ని దేశాలకు ఎగుమతి చేయాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం, ఈ సంస్థ చైనాలో తయారు చేసిన టెస్లా ఎలక్ట్రిక్ కార్లను అనేక దేశాలకు ఎగుమతి చేస్తోంది.

MOST READ:యువకుడితో పోరాడిన 82 ఏళ్ల వృద్ధుడు.. కారణం తెలిస్తే శభాష్ అంటారు

Source: Reuters

Most Read Articles

Read more on: #టెస్లా #tesla
English summary
Tesla To Open Three Showrooms In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X