విడుదలకు సిద్ధమవుతున్న కొత్త తరం Maruti S-Cross; తెలుసుకోవలసిన టాప్ 5 అంశాలు..!!

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి (Maruti Suzuki) ఇటీవల ఒక్కొక్కటిగా తమ కార్లను అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది. ఇప్పటికే, తమ కొత్త తరం సెలెరియో హ్యాచ్‌బ్యాక్ ను విడుదల చేసిన మారుతి సుజుకి, తాజాగా తమ సరికొత్త ఎస్-క్రాస్ (S-Cross) క్రాసోవర్ ను ఆవిష్కరించింది. త్వరలోనే ఈ కొత్త మోడల్ భారత మార్కెట్లో విడుదల కానుంది.

విడుదలకు సిద్ధమవుతున్న కొత్త తరం Maruti S-Cross; తెలుసుకోవలసిన టాప్ 5 అంశాలు..!!

వాస్తవానికి సుజుకి ఎస్-క్రాస్ ఈ జపనీస్ బ్రాండ్ నుండి ఐరోపా మార్కెట్లో అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఒకటిగా ఉంది. అయితే, ఇది భారతదేశంలో మాత్రం కంపెనీ ఆశించిన విజయాలను తెచ్చిపెట్టలేకపోయింది. దీంతో, కంపెనీ ఈ మోడల్ ను ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా లేటెస్ట్ డిజైన్ మరియు అధునాతన సాంకేతిక ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసింది. మరి మారుతి సుజుకి నుండి రాబోయే ఈ సరికొత్త ఎస్-క్రాస్ క్రాసోవర్ గురించి తెలుసుకోవలసిన టాప్-5 విషయాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం రండి.

విడుదలకు సిద్ధమవుతున్న కొత్త తరం Maruti S-Cross; తెలుసుకోవలసిన టాప్ 5 అంశాలు..!!

1. ఎక్స్టీరియర్

ఈ సరికొత్త సుజుకి ఎస్-క్రాస్ ఇప్పుడు చూడచానికి చాలా వరకూ ఎస్‌యూవీ ఆకారంలో కనిపిస్తుంది. నిటారుగా ఉండే ఫ్రంటే ప్రొఫైల్ మరియు ఫ్లాట్‌గా కనిపించే బానెట్‌ వలన ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది మరియు మొదటి చూపులోనే ఆకట్టుకునేలా ఉంటుంది. అంతే కాకుండా, అదనపు ఎస్‌యూవీ అప్పీల్ కోసం కొత్త సుజుకి ఎస్-క్రాస్ చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ కూడా ఉంటుంది. ఇటీవలి కాలంలో మార్కెట్లోకి వచ్చిన అనేక కాంపాక్ట్, మినీ ఎస్‌యూవీలలో ఈ తరహా ఫీచర్ ని మనం గమనిస్తూనే ఉన్నాం.

విడుదలకు సిద్ధమవుతున్న కొత్త తరం Maruti S-Cross; తెలుసుకోవలసిన టాప్ 5 అంశాలు..!!

ఈ మేకోవర్ కొత్త సుజుకి ఎస్-క్రాస్ అమ్మకాలు పెంచడానికి సహకరిస్తుందని కంపెనీ ధీమాగా ఉంది. అయితే, ఈ కొత్త సుజుకి ఎస్-క్రాస్ వాస్తవానికి దాని మునుపటి మోడల్ కంటే 10 మిమీ తక్కువ ఎత్తును కలిగి ఉంటుంది మరియు అదే సమయంలో పొడవు, వెడల్పు, వీల్‌బేస్ వంటి మిగిలిన బాహ్య కొలతల విషయంలో మునుపటి మోడల్‌ మాదిరిగానే ఉంటుంది. ఓవరాల్‌గా దాని ఎక్స్టీరియర్ లేఅవుట్ మునుపటి కన్నా ప్రీమియం ఫీల్ ని ఇస్తుంది.

విడుదలకు సిద్ధమవుతున్న కొత్త తరం Maruti S-Cross; తెలుసుకోవలసిన టాప్ 5 అంశాలు..!!

2. ఇంటీరియర్

కొత్త సుజుకి ఎస్-క్రాస్ క్రాసోవర్ లోపలి వైపు ఇంటీరియర్ ఫీచర్లలో కంపెనీ పెద్దగా మార్పులు చేయలేదు, దీని ఓవరాల్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ మాత్రం మునుపటి మోడల్‌తో సమానంగా ఉంటుంది. అయితే, డ్యాష్‌బోర్డ్ లో రీడిజైన్ చేయబడిన సెంట్రల్ సెక్షన్ మరియు యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద 9 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ వంటి కొన్ని మార్పులు మాత్రం ఇందులో ఉన్నాయి. మొత్తంమీద చూస్తే, ఈ కొత్త మోడల్ ఇంటీరియర్ డిజైన్ దాని పాత మోడల్ మాదిరిగానే ఉంటుంది మరియు డార్క్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది.

విడుదలకు సిద్ధమవుతున్న కొత్త తరం Maruti S-Cross; తెలుసుకోవలసిన టాప్ 5 అంశాలు..!!

3. ఫీచర్లు

మారుతి సుజుకి నుండి రాబోయే ఈ కొత్త ఎస్-క్రాస్ కారును కంపెనీ యొక్క గ్లోబల్ సి ప్లాట్‌ఫారమ్ ను ఆధారంగా చేసుకొని అప్‌డేట్ చేయబడిన ప్లాట్‌ఫామ్ పై రూపొందించబడుతుంది. ఇందులో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, 360 డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరా, అపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 9 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు మొదలైన ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి మరెన్నో కంఫర్ట్ ఫీచర్లను కూడా ఆశించవచ్చు.

విడుదలకు సిద్ధమవుతున్న కొత్త తరం Maruti S-Cross; తెలుసుకోవలసిన టాప్ 5 అంశాలు..!!

అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త సుజుకి ఎస్-క్రాస్ ను కంపెనీ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్లతో అందించనుంది. ఇందులో డ్రైవర్ అసిస్టెన్స్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, ఎమర్జెన్సీ అటానమస్ బ్రేకింగ్ మరియు మరెన్నో వంటి క్రియాశీల భద్రతా వ్యవస్థలు ఉండన్నాయి. వీటితో పాటుగా కొత్త ఎస్-క్రాస్ లో ఏబిఎస్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి అన్ని ప్రాణాణిక భద్రతా ఫీచర్లు కూడా ఉంటాయి.

విడుదలకు సిద్ధమవుతున్న కొత్త తరం Maruti S-Cross; తెలుసుకోవలసిన టాప్ 5 అంశాలు..!!

4. ఇంజన్

కొత్త సుజుకి ఎస్-క్రాస్ దాని పాత మోడల్ మాదిరిగా కాకుండా, కొత్త మైల్డ్-హైబ్రిడ్ టెక్‌తో కూడిన సరికొత్త 1.4 లీటర్ టర్బోఛార్జ్‌డ్ ఇంజన్‌ను కలిగి ఉండనుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 125.2 బిహెచ్‌పి పవర్ ను మరియు 235 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్, టార్క్ గణాంకాలు ప్రస్తుత ఇండియన్ మోడల్ ఎస్-క్రాస్ జనరేట్ చేసే 103.5 పవర్ మరియు 138 టార్క్ కంటే ఎక్కువగా ఉంటాయి.

విడుదలకు సిద్ధమవుతున్న కొత్త తరం Maruti S-Cross; తెలుసుకోవలసిన టాప్ 5 అంశాలు..!!

అంతర్జాతీయ మార్కెట్లలో లభ్యమయ్యే కొత్త సుజుకి ఎస్-క్రాస్ ఈ జపనీస్ బ్రాండ్ యొక్క పాపులర్ ఆల్-గ్రిప్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. అయితే, మనదేశంలో అధిక ధర మరియు తయారీ ఖర్చు సంబంధిత కారణాలన వలన కంపెనీ ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ ను భారతదేశంలో అందుబాటులోకి తెస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి ఖచ్చితంగా తెలియదు.

విడుదలకు సిద్ధమవుతున్న కొత్త తరం Maruti S-Cross; తెలుసుకోవలసిన టాప్ 5 అంశాలు..!!

5. ధర

ధరకు సంబంధించి కొత్త సుజుకి ఎస్-క్రాస్ విషయంలో కంపెనీ ఇంకా ఎటువంటి వివరాలను విడుదల చేయనప్పటికీ, ఇందులో చేయబోయే అప్‌గ్రేడ్స్ మరియు అదనపు ఫీచర్ల కారణంగా, ఇది ప్రస్తుత మోడల్ ధర కన్నా అగ్రెసివ్ గా ఉంటుందని భావిస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
The all new maruti suzuki s cross is getting ready for launch top five things to know about this crossover
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X