దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి ఫేస్‌లిఫ్ట్; వివరాలు

భారత మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన 'టాటా మోటార్స్' తన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగో యొక్క ఎన్‌ఆర్‌జి ఎడిషన్‌ను తిరిగి మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఈ హ్యాచ్‌బ్యాక్ కి సంబంధించిన మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి ఎడిషన్‌ 2021 ఆగస్టు 4 న ప్రారంభించే అవకాశం ఉంది.

భారత్‌లో విడుదల కానున్న కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి

కంపెనీ 2020 జనవరిలో ఫేస్‌లిఫ్టెడ్ టాటా టియాగోను ప్రవేశపెట్టడానికి ముందే, ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క ఎన్‌ఆర్‌జి వేరియంట్‌ యొక్క అమ్మకాలను నిలిపివేసింది. కానీ ఇప్పుడు టాటా మోటార్స్ ఈ వేరియంట్‌ను ఎస్‌యూవీ స్టైలింగ్ ఎలిమెంట్స్‌తో ఫేస్‌లిఫ్టెడ్ టాటా టియాగోతో తిరిగి దేశీయ మార్కెట్లో విడుదల చేయనుంది.

భారత్‌లో విడుదల కానున్న కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి

కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి చూడటానికి చాలా స్టైలిష్ గా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది. కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి మోడల్ ఆల్‌రౌండ్ బాడీ క్లాడింగ్, టెయిల్‌గేట్‌పై బ్లాక్ ప్లాస్టిక్ ఎలిమెంట్ మరియు ఎస్‌యూవీలా కనిపించేలా అప్డేటెడ్ వీల్స్ పొందే అవకాశం ఉంటుంది.

భారత్‌లో విడుదల కానున్న కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి

టాటా మోటార్స్ యొక్క ఈ కొత్త వెర్షన్, దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. టాటా టియాగో యొక్క స్టాండర్డ్ మోడల్ 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. అయితే ఈ కొత్త మోడల్ యొక్క డిజైన్ దాదాపు దాని స్టాండర్డ్ టాటా టియాగో మోడల్ మాదిరిగానే ఉంటుంది.

భారత్‌లో విడుదల కానున్న కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి

కొత్త టియాగో ఎన్‌ఆర్‌జి వెర్షన్‌లో ఎసి వెంట్స్ మరియు గేర్ లివర్ చుట్టూ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ ఫినిషింగ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ వెర్షన్ మల్టిపుల్ అప్హోల్స్టరీని కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ట్రై-యారో డిజైన్ ఎలిమెంట్స్ ఫాబ్రిక్ మీద ఉపయోగించవచ్చు. మొత్తానికి ఇది వాహనదారులకు అనుకూలంగా ఉండేవిధంగా తయారవుతుంది అని చెప్పవచ్చు.

భారత్‌లో విడుదల కానున్న కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి

ఈ కొత్త వెర్షన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది దాని స్టాండర్డ్ మోడల్‌తో సమానంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్, హర్మాన్ సౌండ్ సిస్టమ్ మరియు రిమోట్ లాకింగ్ / అన్‌లాకింగ్‌తో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందవచ్చు.

భారత్‌లో విడుదల కానున్న కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి

ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఈబిడి, కెమెరాతో రియర్ పార్కింగ్ సెన్సార్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. అయితే టాటా మోటార్స్ ఈ మోడల్ యొక్క యాంత్రిక అంశాలలో ఎటువంటి మార్పులు చేయలేదు.

భారత్‌లో విడుదల కానున్న కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి

కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో 1.2-లీటర్ రివోట్రాన్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 86 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 5 స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎంటి గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో విడుదల కానున్న కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి

టాటా మోటార్స్ ఈ కొత్త టియాగో ఎన్‌ఆర్‌జి ధర ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ డిజైన్ అప్‌డేట్స్ కారణంగా, ఇది స్టాండర్డ్ మోడల్ కంటే సుమారు రూ. 28,000 ఎక్కువ ధర కలిగి ఉండే అవకాశం ఉంటుంది. కావున దీని ధర రూ. 4.99 లక్షల(ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
2021 Tata Tiago NRG Launching Soon In India. Read in Telugu.
Story first published: Sunday, July 25, 2021, 5:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X