2020లో టాప్ 10 బెస్ట్ కార్ కంపెనీలు ఇవే..

కరోనా మహమ్మారి కారణంగా గడచిన 2020 సంవత్సరం భారత ఆటోమొబైల్ పరిశ్రమకు ఓ చేదు సంవత్సరంగా మిగిలేలా చేసింది. అంతకు ముందు సంవత్సరం (2019)తో పోలిస్తే గతేడాది మొత్తం కార్ల అమ్మకాలు 17.3 శాతం క్షీణతను నమోదు చేశాయి.

2020లో టాప్ 10 బెస్ట్ కార్ కంపెనీలు ఇవే..

గత 2019లో మొత్తం 29,36,626 యూనిట్లు వాహనాలు అమ్ముడుపోగా, 2020లో వాటి సంఖ్య 24,27,883 యూనిట్లుగా నమోదైంది. దేశంలో సుమారు మూడు నెలల పాటు సాగిన లాక్‌డౌన్ కారణంగా వాహనాల అమ్మకాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

2020లో టాప్ 10 బెస్ట్ కార్ కంపెనీలు ఇవే..

అమ్మకాల పరంగా, గడచిన సంవత్సరంలో టాప్-10 కంపెనీల జాబితాను పరిశీలిస్తే, కష్ట సమయాల్లో కూడా మారుతి సుజుకి 50 శాతానికి పైగా మార్కెట్ వాటాతో మార్కెట్లో తన అగ్రస్థానాన్ని అలానే కొనసాగించింది. ఆ తర్వాతి స్థానంలో కొరియన్ బ్రాండ్ హ్యుందాయ్ ఉండగా, దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, కియా మరియు మహీంద్రా బ్రాండ్లను అధిమించి ముడవ స్థానానినికి చేరుకుంది. గత 2020లో టాప్-10 కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి:

MOST READ:లోయలో పడిన లారీని బయటకు లాగేందుకు ఏకమైన ఊరు వాడ..

2020లో టాప్ 10 బెస్ట్ కార్ కంపెనీలు ఇవే..

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 2020లో మొత్తం 12.13 లక్షల కార్లను విక్రయించింది. గత 2019 అమ్మకాల (14.85 లక్షల యూనిట్ల)తో పోలిస్తే కంపెనీ మొత్తం అమ్మకాలలో 18.3 శాతం క్షీణతను నమోదు చేసింది. కొత్త సంవత్సరంలో అమ్మకాలను పెంచుకునేందుకు మారుతి సుజుకి కొన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

2020లో టాప్ 10 బెస్ట్ కార్ కంపెనీలు ఇవే..

భారతదేశపు ద్వితీయ అగ్రగామి కార్ కంపెనీగా హ్యుందాయ్ తన స్థానాన్ని నిలుపుకుంది. గత 2020 సంవత్సరంలో కంపెనీ మొత్తం 4.23 లక్షల యూనిట్లను విక్రయించింది. గడచిన 2019 అమ్మకాల (5.10 లక్షల యూనిట్ల)తో పోలిస్తే 17 శాతం ఇవి తక్కువగా ఉన్నాయి. అయితే, గతేడాది కొత్త ఉత్పత్తుల విడుల కారణంగా కంపెనీ మార్కెట్ వాటా 0.1 శాతం పెరిగింది.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

2020లో టాప్ 10 బెస్ట్ కార్ కంపెనీలు ఇవే..

టాటా మోటార్స్ గతేడాది ద్వితీయార్థంలో అద్భుతమైన పనితీరును చూపింది. దేశంలో కొత్త పోటీదారులు ఉన్నప్పటికీ కంపెనీ, ఈ కంపెనీ కొన్ని మేజర్ బ్రాండ్లను అధిగమించి మూడవ స్థానానికి చేరుకుంది. గత 2020లో టాటా మోటార్స్ మొత్తం 1.70 లక్షల యూనిట్లను విక్రయించి 11.3 శాతం వృద్ధిని నమోదు చేసింది.

2020లో టాప్ 10 బెస్ట్ కార్ కంపెనీలు ఇవే..

అనంతపురం కేంద్రంగా పనిచేస్తున్న కియా మోటార్స్, గడచిన సంవత్సరం అమ్మకాల పరంగా నాల్గవ స్థానంలో ఉంది. కేవలం మూడు ఉత్పత్తులనే మార్కెట్లో విక్రయిస్తున్న ఈ కంపెనీ 2020లో మొత్తం 1.40 లక్షల కార్లను విక్రయించింది. గత 2019 అమ్మకాల (45,494 యూనిట్ల)తో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 208% వృద్ధిని నమోదు చేశాయి. ఈ సమయంలో కంపెనీ మార్కెట్ వాటా 1.5 శాతం నుండి 5.8 శాతానికి పెరిగింది.

MOST READ:ఒక ఛార్జ్‌తో 240 కి.మీ అందించగల సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

2020లో టాప్ 10 బెస్ట్ కార్ కంపెనీలు ఇవే..

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా ఈ జాబితాలో 5 స్థానాన్ని దక్కించుకుంది. గత 2020లో కంపెనీ మొత్తం 1.36 యూనిట్లను విక్రయించింది. అయితే, 2019 అమ్మకాల (2.19 లక్షల యూనిట్ల)తో పోలిస్తే కంపెనీ అమ్మకాలు భారీగా 37.9 శాతం క్షీణతను నమోదు చేశాయి. ఫలితంగా, దీని మార్కెట్ వాటా కూడా 5.6 శాతానికి పడిపోయింది.

2020లో టాప్ 10 బెస్ట్ కార్ కంపెనీలు ఇవే..

గతేడాదితో పోలిస్తే, ఈ మూడు కంపెనీల అమ్మకాలు పడిపోతున్నప్పటికీ 2020లో రెనాల్ట్, టొయోటా మరియు హోండా అమ్మకాలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. కొత్త సంవత్సరంలో కొత్త ఉత్పత్తులను విడుదల చేసేందుకు రెనాల్ట్ మరియు టొయోటా కంపెనీలు సిద్ధమవుతున్నాయి.

MOST READ:గుడ్ న్యూస్.. రెనాల్ట్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్.. ఏ వేరియంట్‌పై ఎంతో చూడండి

2020లో టాప్ 10 బెస్ట్ కార్ కంపెనీలు ఇవే..

దేశంలోకి కొత్తగా ప్రవేశించిన చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్, అనూహ్యంగా ఈ జాబితాలో 10వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ బ్రాండ్ కేవలం మూడు ఉత్పత్తులతో టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకోవటం విశేషం. ఇకపై ప్రతి ఆరునెలలకు ఒకసారి కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేస్తామని ఎమ్‌జి మోటార్ తెలిపింది.

Source: Autopunditz

Most Read Articles

English summary
Top 10 Best Car Companies In 2020 In Terms Of Sales. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X