ఆగస్ట్‌లో భారతదేశం నుండి అత్యధికంగా ఎగుమతి చేయబడిన టాప్ 10 కార్లు

భారతదేశంలో పండుగ సీజన్ మొదలు కావడంతో గడచిన ఆగస్ట్ 2021 నెలలో కార్ల కార్ల అమ్మకాలు మిశ్రమంగా ఉన్నాయి. కొన్ని కార్ కంపెనీలు అమ్మకాలు జోరుగా ఉంటే, మరికొన్ని కంపెనీల అమ్మకాలు మాత్రం క్షీణంచాయి. కార్ల ఎగుమతుల విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది.

ఆగస్ట్‌లో భారతదేశం నుండి అత్యధికంగా ఎగుమతి చేయబడిన టాప్ 10 కార్లు

గత నెలలో కొన్ని కార్ల తయారీదారుల ఎగుమతులు పెరిగినప్పటికీ, మరికొన్ని కంపెనీల ఎగుమతులు మాత్రం తగ్గుముఖం పట్టాయి. మొత్తంగా చూసుకుంటే, గడచిన ఆగస్ట్ 2021 నెలలో అన్ని కంపెనీలు కలిసి 51,204 యూనిట్ల కార్లను భారతదేశం నుండి పలు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేశాయి.

ఆగస్ట్‌లో భారతదేశం నుండి అత్యధికంగా ఎగుమతి చేయబడిన టాప్ 10 కార్లు

అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (అంటే, ఆగస్ట్ 2020లో) అన్ని ఆటోమొబైల్ కంపెనీలు కలిసి మొత్తంగా 34,257 కార్లను విదేశాలకు ఎగుమతి చేశాయి. ఈ సమయంలో మొత్తం ఎగుమతులు 49.47 శాతం వృద్ధిని కనబరచాయి. ఈ కథనంలో, గడచిన ఆగస్టు 2021 నెలలో అత్యధికంగా ఎగుమతి చేయబడిన టాప్ 10 కార్ల గురించి తెలుసుకుందాం రండి.

ఆగస్ట్‌లో భారతదేశం నుండి అత్యధికంగా ఎగుమతి చేయబడిన టాప్ 10 కార్లు

1. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ( Ford EcoSport)

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ ఇండియా (Ford India) నుండి పాపులర్ అయిన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ (Ford EcoSport) ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. కంపెనీ గడచిన ఆగస్టు 2021 నెలలో మొత్తం 5,015 ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీలను భారత దేశం నుండి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసింది. గత ఏడాది ఆగస్ట్ 2020 నెలలో ఇవి 6,361 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో ఎకోస్పోర్ట్ అంతర్జాతీయ అమ్మకాలు 21.16 శాతం క్షీణించాయి.

ఆగస్ట్‌లో భారతదేశం నుండి అత్యధికంగా ఎగుమతి చేయబడిన టాప్ 10 కార్లు

2. మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno)

ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నది మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno) ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. గత నెలలో (ఆగస్ట్ 2021లో) మొత్తం 4,000 బాలెనో కార్లు భారతదేశం నుండి ఎగుమతి చేయబడ్డాయి. గత సంవత్సరం ఇదే సమయంలో (ఆగస్టు 2020లో) కంపెనీ 2,001 యూనిట్ల బాలెనో కార్లను ఎగుమతి చేసింది. ఈ సమయంలో మారుతి బాలెనో ఎగుమతులు 99.90 శాతం వృద్ధి చెందాయి.

ఆగస్ట్‌లో భారతదేశం నుండి అత్యధికంగా ఎగుమతి చేయబడిన టాప్ 10 కార్లు

3. హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna)

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ వెర్నా ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. గడచిన ఆగస్ట్ 2021 నెలలో హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna) ఎగుమతులు 3,761 యూనిట్లుగా ఉన్నాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (ఆగస్ట్ 2020లో) ఇవి 2,806 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో వెర్నా ఎగుమతులు 34.03 శాతం పెరిగాయి.

ఆగస్ట్‌లో భారతదేశం నుండి అత్యధికంగా ఎగుమతి చేయబడిన టాప్ 10 కార్లు

4. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso)

మారుతి సుజుకి నుండి అత్యధికంగా ఎగుమతి చేయబడిన రెండవ మోడల్ మరియు ఈ జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచిన మోడల్ మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso). గడచిన నెలలో మొత్తం 3,274 యూనిట్ల ఎస్-ప్రెసో హ్యాచ్‌బ్యాక్ కార్లు భారతదేశం నుండి ఎగుమతి చేయబడ్డాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 2,399 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో ఎస్-ప్రెసో ఎగుమతులు 36.47 శాతం పెరిగాయి.

ఆగస్ట్‌లో భారతదేశం నుండి అత్యధికంగా ఎగుమతి చేయబడిన టాప్ 10 కార్లు

5. మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift)

మారుతి సుజుకి అందిస్తున్న పాపులర్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ (Swift) ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. గత ఆగస్ట్ 2021లో మొత్తం 3,051 యూనిట్ల స్విఫ్ట్ కార్లు భారతదేశం నుండి ఎగుమతి చేయబడ్డాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (ఆగస్ట్ 2020లో) ఇవి 1,329 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో స్విఫ్ట్ ఎగుమతులు 129.57 శాతం పెరిగాయి.

Rank Exports Model Aug-21 Aug-20 Growth (%)
1 Ford Ecosport 5,015 6,361 -21.16
2 Maruti Baleno 4,000 2,001 99.90
3 Hyundai Verna 3,761 2,806 34.03
4 Maruti S-Presso 3,274 2,399 36.47
5 Maruti Swift 3,051 1,329 129.57
6 Volkswagen Vento 2,954 1,808 63.38
7 Kia Seltos 2,626 3,592 -26.89
8 Maruti Dzire 2,606 389 569.92
9 Hyundai Grand i10 2,555 1,194 113.99
10 Maruti Vitara Brezza 2,452 102 2,304
ఆగస్ట్‌లో భారతదేశం నుండి అత్యధికంగా ఎగుమతి చేయబడిన టాప్ 10 కార్లు

6. ఫోక్స్‌గన్ వెంటో (Volkswagen Vento)

ఇక ఈ జాబితాలో ఆరవ స్థానంలో ఉన్నది ఫోక్స్‌గన్ వెంటో (Volkswagen Vento). జర్మన్ కార్ బ్రాండ్ విక్రయిస్తున్న ఈ ఎంట్రీ లెవల్ సెడాన్ గత నెలలో ఈ కారు మొత్తం 2,954 యూనిట్ల ఎగుమతులను నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే సమయంలో 1,808 యూనిట్ల వెంటో కార్లు భారతదేశం నుండి ఎగుమతి చేయబడ్డాయి. ఈ సంవత్సరం వెంటో ఎగుమతులు 63.38 శాతం వృద్ధిని సాధించాయి.

ఆగస్ట్‌లో భారతదేశం నుండి అత్యధికంగా ఎగుమతి చేయబడిన టాప్ 10 కార్లు

ఇకపోతే, ఈ జాబితాలో కియా సెల్టోస్ 2,626 యూనిట్ల (26.89 శాతం క్షీణత) తో ఏడవ స్థానంలో, మారుతి డిజైర్ 2,606 యూనిట్ల (569.92 శాతం వృద్ధి) తో ఎనిమిదవ స్థానంలో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 2,555 యూనిట్ల (113.99 శాతం వృద్ధి) తో తొమ్మిదవ స్థానంలో మరియు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా 2,452 యూనిట్ల (2304 శాతం వృద్ధి) తో పదవ స్థానాల్లో ఉన్నాయి.

Most Read Articles

English summary
Top 10 cars exported from india in august 2021 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X