భారతదేశంలో 10 అత్యంత సురక్షితమైన కార్లు.. టాటా నెక్సాన్ నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ700 వరకూ..

భారతదేశంలో విక్రయించబడుతున్న మేడ్ ఇన్ ఇండియా కార్లు ఇప్పుడు చాలా సురక్షితమైనవిగా మారుతున్నాయి. టాటా మోటార్స్ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా వంటి దేశీయ కార్ కంపెనీలు తయారు చేస్తున్న కార్లు గ్లోబల్ ఎన్‌సిఏపి (Global NCAP) క్రాష్ టెస్టులలో అత్యధిక పాయింట్లను స్కోర్ చేసి 4-స్టార్ లేదా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంటున్నాయి. ఈ క్రాష్ టెస్టులలో ఓవరాల్ సేఫ్టీ రేటింగ్ 3-స్టార్ కన్నా ఎక్కువగా ఉన్న వాటిని సురక్షితమైన కార్లుగా పరిగణిస్తారు.

భారతదేశంలో 10 అత్యంత సురక్షితమైన కార్లు.. టాటా నెక్సాన్ నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ700 వరకూ..

మనదేశంలో టాటా నెక్సాన్ నుండి ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన మహీంద్రా ఎక్స్‌యూవీ700 వరకూ 10 అత్యంత సురక్షితమైన కార్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. గ్లోబల్ ఎన్‌క్యాప్ గత కొన్నేళ్లుగా 40 కి పైగా మేడ్ ఇన్ ఇండియా కార్లకు క్రాష్ టెస్టులు నిర్వహించింది. వీటిలో కొన్ని జీరో (0) స్టార్ రేటిగ్ దక్కించుకోగా మరికొన్ని అత్యధికంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకున్నాయి. వీటిలో చిన్న కార్లు మొదలుకొని పెద్ద ఎస్‌యూవీల వరకూ ఉన్నాయి. మరి ఆ టాప్ 10 మేడ్ ఇన్ ఇండియా సేఫెస్ట్ కార్లు ఏవో మనం కూడా చూసేద్దాం రండి.

భారతదేశంలో 10 అత్యంత సురక్షితమైన కార్లు.. టాటా నెక్సాన్ నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ700 వరకూ..

1. Mahindra XUV700: 5-స్టార్ సేఫ్టీ రేటింగ్

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా నుండి లేటెస్ట్‌గా మార్కెట్లోకి వచ్చిన ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ, గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. పెద్దల సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, పిల్లల భద్రత విషయంలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసి ఓవరాల్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.

భారతదేశంలో 10 అత్యంత సురక్షితమైన కార్లు.. టాటా నెక్సాన్ నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ700 వరకూ..

ఈ కారుకి అడల్ట్ సేఫ్టీ విషయంలో 5-స్టార్ మరియు చైల్డ్ సేఫ్టీ విషయంలో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో కంపెనీ రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. అయితే, టాప్-ఎండ్ వేరియంట్లలో కంపెనీ మరికొన్ని అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడిఏఎస్)తో కూడిన సేఫ్టీ ఫీచర్లను కూడా అందిస్తోంది. - ఎక్స్‌యూవీ700 పూర్తి టెస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

భారతదేశంలో 10 అత్యంత సురక్షితమైన కార్లు.. టాటా నెక్సాన్ నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ700 వరకూ..

2. Tata Punch: 5-స్టార్ సేఫ్టీ రేటింగ్

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ నుండి లేటెస్ట్‌గా వచ్చిన చిన్న కారు టాటా పంచ్ సేఫ్టీ విషయంలో శభాష్ అనిపించుకుంది. పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ, గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఈ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ క్రాష్ టెస్టులో టాటా పంచ్ పెద్దల సేఫ్టీ విషయంలో 17 పాయింట్లకు గాను 16.45 పాయింట్లు మరియు పిల్లల రక్షణలో 49 పాయింట్లకు గానూ 40.89 పాయింట్లను స్కోర్ చేసి ఓవరాల్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ కారులో రెండు ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్‌లు స్టాండర్డ్‌గా లభిస్తాయి.

భారతదేశంలో 10 అత్యంత సురక్షితమైన కార్లు.. టాటా నెక్సాన్ నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ700 వరకూ..

3. Mahindra XUV300: 5-స్టార్ సేఫ్టీ రేటింగ్

మహీంద్రా అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ300 ఈ బ్రాండ్ నుండి మొదటిసారిగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కారుగా నిలిచింది. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఈ కారు పెద్దల భద్రత విషయంలో 17 పాయింట్లకు గాను 16.42 పాయింట్ల స్కోర్‌తో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందగా, పిల్లల భద్రత విషయంలో 49 పాయింట్లకు గాను 37.44 పాయింట్ల స్కోర్‌తో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ కారులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, అన్ని డిస్క్ బ్రేక్‌లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ మరియు ఫ్రంట్ సీట్‌బెల్ట్ ప్రిటెన్షనర్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

భారతదేశంలో 10 అత్యంత సురక్షితమైన కార్లు.. టాటా నెక్సాన్ నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ700 వరకూ..

4. Tata Altroz: 5-స్టార్ సేఫ్టీ రేటింగ్

టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ కూడా ఈ గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. అడల్ట్ సేఫ్టీలో ఇది 17 పాయింట్లకు గాను 16.13 పాయింట్లను స్కోర్ చేయగా, చైల్డ్ సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు గాను 29 పాయింట్లను స్కోర్ చేసి, ఓవరాల్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. టాటా మోటార్స్ ఈ కారులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్ మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లను స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లుగా అందిస్తోంది.

భారతదేశంలో 10 అత్యంత సురక్షితమైన కార్లు.. టాటా నెక్సాన్ నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ700 వరకూ..

5. Tata Nexon: 5-స్టార్ సేఫ్టీ రేటింగ్

టాటా మోటార్స్ సంస్థకు గేమ్ ఛేంజర్ మోడల్‌గా మారిన కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ కూడా సేఫ్టీలో బెస్ట్ అనిపించుకుంది. ఈ స్టైలిష్ ఎస్‌యూవీ కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. అడల్ట్ సేఫ్టీలో టాటా నెక్సాన్ 17 పాయింట్లకు గాను 16.06 పాయింట్లను స్కోర్ చేయగా, చైల్డ్ సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు గాను 25 పాయింట్లను స్కోర్ చేసింది. కంపెనీ ఈ కారులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రోల్‌ఓవర్ మిటిగేషన్ మరియు ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తుంది.

భారతదేశంలో 10 అత్యంత సురక్షితమైన కార్లు.. టాటా నెక్సాన్ నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ700 వరకూ..

6. Mahindra Thar: 4-స్టార్ సేఫ్టీ రేటింగ్

యుటిలిటీ వాహనాల తయారీలో చేయి తిరిగిన సంస్థ మహీంద్రా నుండి లేటెస్ట్‌గా వచ్చిన కొత్త తరం లైఫ్ స్టైల్ ఎస్‌యూవీ థార్ ఈ క్రాష్ టెస్టులో ఓవరాల్ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ ఎస్‌యూవీ పెద్దల భద్రత విషయంలో 17 పాయింట్లకు గాను 12.52 పాయింట్లను స్కోర్ చేయగా, పిల్లల భద్రత విషయంలో 49 పాయింట్లకు గాను 41.11 పాయింట్లను స్కోర్ చేసింది. కంపెనీ ఈ ఎస్‌యూవీలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తోంది.

భారతదేశంలో 10 అత్యంత సురక్షితమైన కార్లు.. టాటా నెక్సాన్ నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ700 వరకూ..

7. Tata Tigor: 4-స్టార్ సేఫ్టీ రేటింగ్

టాటా మోటార్స్ అందిస్తున్న టిగోర్ మరియు టిగోర్ ఈవీ రెండు మోడళ్లు కూడా గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ చేసిన మొదటి ఎలక్ట్రిక్ కారు కూడా టాటా టిగోర్ ఈవీ కావడం విశేషం. కాగా, ఈ క్రాష్ టెస్టులో పెట్రోల్ వెర్షన్ టాటా టిగోర్ అడల్ట్ సేఫ్టీ విషయంలో 17 పాయింట్లకు గాను 12.52 పాయింట్లను స్కోర్ చేయగా, చైల్డ్ సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు గాను 34.15 పాయింట్లను స్కోర్ చేసింది. ఈ కారులో ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు స్టాండర్డ్‌గా లభించవు. కాబట్టి, ఇది చైల్డ్ సేఫ్టీలో 3-స్టార్ రేటింగ్ పొందింది.

భారతదేశంలో 10 అత్యంత సురక్షితమైన కార్లు.. టాటా నెక్సాన్ నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ700 వరకూ..

8. Tata Tigor EV: 4-స్టార్ సేఫ్టీ రేటింగ్

ఇదివరకు చెప్పుకున్నట్లుగా పెట్రోల్ వెర్షన్ టాటా టిగోర్ మాదిరిగానే ఎలక్ట్రిక్ వెర్షన్ టాటా టిగోర్ ఈవీ కూడా ఈ క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ ఎలక్ట్రిక్ కారు పెద్దల భద్రత విషయంలో విషయంలో 17 పాయింట్లకు గాను 12 పాయింట్లను స్కోర్ చేయగా, పిల్లల భద్రత విషయంలో 49 పాయింట్లకు గాను 37.24 పాయింట్లను స్కోర్ చేసింది. ఈ కారులో మరిన్ని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను ఆఫర్ చేసి ఉంటే, టిగోర్ ఎలక్ట్రిక్ వెహికల్ దీని కన్నా ఎక్కువ సేఫ్టీ రేటింగ్ పొంది ఉండేదని గ్లోబల్ ఎన్‌క్యాప్ పేర్కొంది.

భారతదేశంలో 10 అత్యంత సురక్షితమైన కార్లు.. టాటా నెక్సాన్ నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ700 వరకూ..

9. Tata Tiago: 4-స్టార్ సేఫ్టీ రేటింగ్

టాటా మోటార్స్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టియాగో, దాని సెడాన్ వెర్షన్ టిగోర్ మాదిరిగానే 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. పెద్దల సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 12.52 పాయింట్లను స్కోర్ చేసి 4-స్టార్ రేటింగ్ దక్కించుకోగా, పిల్లల సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు గాను 34.15 పాయింట్లను స్కోర్ చేసి 3-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకుంది. ఈ కారులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు ఏబిఎస్ ఫీచర్లను కంపెనీ స్టాండర్డ్‌గా అందిస్తుంది. అయితే, ఇందులో ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు మాత్రం స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌గా లభించవు.

భారతదేశంలో 10 అత్యంత సురక్షితమైన కార్లు.. టాటా నెక్సాన్ నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ700 వరకూ..

10. Maruti Suzuki Vitara Brezza: 4-స్టార్ సేఫ్టీ రేటింగ్

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి నుండి ఈ జాబితాలో చేరిన ఏకైక మోడల్ విటారా బ్రెజ్జా. దీన్నిబట్టి చూస్తుంటే, దేశంలోనే అత్యధికంగా కార్లను తయారు చేసి, విక్రయించే కంపెనీ ఎంతటి సురక్షితమైన కార్లను ప్రజలకు అందిస్తుందో అర్థమవుతుంది. విటారా బ్రెజ్జా కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఇది 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. అడల్ట్ సేఫ్టీలో ఇది 17 పాయింట్లకు గాను 12.51 పాయింట్లను స్కోర్ చేయగా, చైల్డ్ సేఫ్టీలో 49 పాయింట్లకు గాను కేవలం 17.93 పాయింట్లను మాత్రమే స్కోర్ చేసింది. ఈ కారులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లును , ఏబిఎస్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు మరియు ఫ్రంట్ సీట్‌బెల్ట్ ప్రిటెన్షనర్లు స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌గా లభిస్తాయి.

భారతదేశంలో 10 అత్యంత సురక్షితమైన కార్లు.. టాటా నెక్సాన్ నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ700 వరకూ..

పైన పేర్కొన్న పది కార్లు మాత్రమే కాకుండా, మహీంద్రా మారాజో (Mahindra Marazzo), ఫోక్స్‌వ్యాగన్ పోలో (Volkswagen Polo) రెనో ట్రైబర్ (Renault Triber) వంటి కార్లు కూడా గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకున్నాయి. అలాగే, భారత మార్కెట్లో డిస్‌కంటిన్యూ అయిన టొయోటా ఎతియోస్ (Toyota Etios) మరియు టాటా జెస్ట్ (Tata Zest) కార్లు కూడా 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకున్నాయి. అయితే, ఈ జాబితాలో ఒక్క హ్యుందాయ్ (Hyundai) కారు కూడా లేకపోవడం గమనార్హం. ఓవరాల్‌గా చూస్తే, టాటా మరియు మహీంద్రా కంపెనీలకు చెందిన కార్లు ఎక్కువ సురక్షితమైనవిగా ఉన్నాయి.

Most Read Articles

English summary
Top 10 safest cars in india global ncap crash test results nexon to xuv700
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X