Tata Punch వద్దా..? అయితే ఈ మూడు కార్లపై ఓ లుక్కేస్కోండి.. పంచ్‌కి ప్రత్యామ్యాయాలు

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) తమ లేటెస్ట్ కారు టాటా పంచ్ (Tata Punch) ను దేశీయ విపణిలో విడుదల చేసిన సంగతి తెలిసినదే. టాటా పంచ్ విడుదలతో భారత ఆటోమోటివ్ మార్కెట్లో సరికొత్త (మైక్రో ఎస్‌యూవీ) విభాగాన్ని ప్రారంభించామని కంపెనీ పేర్కొంది.

Tata Punch వద్దా..? అయితే ఈ మూడు కార్లపై ఓ లుక్కేస్కోండి.. పంచ్‌కి ప్రత్యామ్యాయాలు

వాస్తవానికి, టాటా మోటార్స్ తమ పంచ్ మైక్రో ఎస్‌యూవీ సబ్-కాంపాక్ట్ ( పొడవులో 4 మీటర్ల కన్నా తక్కువగా ఉన్న) ఎస్‌యూవీ విభాగంలో ప్రవేశపెట్టినప్పటికీ, ధర పరంగా ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీలు మరియు కొన్ని ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లతో పోటీ పడుతుంది. ఈ నేపథ్యంలో, టాటా పంచ్ కొనడానికి ముందు మీరు పరిగణించగల టాప్ 3 ప్రత్యామ్నాయ మోడళ్ల గురించి మనం ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Tata Punch వద్దా..? అయితే ఈ మూడు కార్లపై ఓ లుక్కేస్కోండి.. పంచ్‌కి ప్రత్యామ్యాయాలు

1. టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)

నిజానికి, టాటా ఆల్ట్రోజ్ ఒక ఎస్‌యూవీ కాకపోవచ్చు. కానీ, ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ దాని అండర్‌పిన్నింగ్‌ లను టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీతో పంచుకుంటుంది. అంటే, ఆల్ట్రోజ్ నిర్మించిన సిఎమ్‌జి (CMP) కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగానే కొత్త టాటా పంచ్ ఎస్‌యూవీ కూడా రూపుదిద్దుకుంది. కాబట్టి, ఆల్ట్రోజ్ - పంచ్ కార్లు ఒకేరకమైన ఇంజన్ మరియు అనేక విడిభాగాలను పంచుకుంటాయి.

Tata Punch వద్దా..? అయితే ఈ మూడు కార్లపై ఓ లుక్కేస్కోండి.. పంచ్‌కి ప్రత్యామ్యాయాలు

గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో టాటా పంచ్ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంది. అయితే, టాటా మోటార్స్ నుండి లభిస్తున్న ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మాత్రం వయోజన రక్షణలో 5-స్టార్ క్రాష్ రేటింగ్‌ ను దక్కించుకుంది. భారతదేశంలో లభిస్తున్న అత్యంత సురక్షితమైన కార్లలో టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ కూడా ఒకటిగా రేట్ చేయబడింది.

Tata Punch వద్దా..? అయితే ఈ మూడు కార్లపై ఓ లుక్కేస్కోండి.. పంచ్‌కి ప్రత్యామ్యాయాలు

టాటా పంచ్ ఒకే ఇంజన్ ఆప్షన్ తో లభిస్తుంది. కానీ టాటా ఆల్ట్రోజ్ మాత్రం వివిధ రకాల ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. వీటిలో 84.88 బిహెచ్‌పి పవర్ ను జనరేట్ చేసే 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ మరియు 108.48 బిహెచ్‌పి శక్తిని జనరేట్ చేసే మరింత శక్తివంతమైన టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. వీటితో పాటుగా 88.77 బిహెచ్‌పి పవర్ ను జనరేట్ చేసే 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది.

Tata Punch వద్దా..? అయితే ఈ మూడు కార్లపై ఓ లుక్కేస్కోండి.. పంచ్‌కి ప్రత్యామ్యాయాలు

కాగా, టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీలో కంపెనీ 1.2 లీటర్, త్రీ సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించింది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ ను మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం టాటా మోటార్స్ ఇదే ఇంజన్ ను ఆల్ట్రోజ్ తో పాటుగా టియాగో కారులో కూడా ఉపయోగిస్తోంది. ఇది మ్యాన్యువల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

Tata Punch వద్దా..? అయితే ఈ మూడు కార్లపై ఓ లుక్కేస్కోండి.. పంచ్‌కి ప్రత్యామ్యాయాలు

అయితే, టాటా ఆల్ట్రోజ్ మాత్రం టాటా పంచ్ మాదిరిగా కాకుండా, ఒకేఒక ట్రాన్స్మిషన్ ఆప్షన్ తో (5 -స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్) మాత్రమే అందించబడుతుంది. ఇక ధర విషయానికి వస్తే, మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్ ధరలు రూ. 5.84 లక్షల నుండి ప్రారంభమవుతాయి. కాగా, టాటా పంచ్ ధరలు రూ. 5.49 లక్షల నుండి ప్రారంభం అవుతాయి. అంటే, ఆల్ట్రోజ్ బేస్ వేరియంట్ ధర పంచ్ యొక్క బేస్ వేరియంట్ ధర కంటే కేవలం రూ. 35,000 మాత్రమే ఖరీదైనదిగా ఉంటుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

Tata Punch వద్దా..? అయితే ఈ మూడు కార్లపై ఓ లుక్కేస్కోండి.. పంచ్‌కి ప్రత్యామ్యాయాలు

2. రెనో కైగర్ (Renault Kiger)

ఫ్రెంచ్ కార్ బ్రండ్ రెనో, దేశీయ విపణిలో విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ కైగర్. ప్రస్తుతం, ఇది భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన కాంపాక్ట్ ఎస్‌యూవీ. మార్కెట్లో రెనో కైగర్ ప్రారంభ ధర రూ. 5.64 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది. అంటే, కేవలం రూ. 15,000 అధిక ధర వద్ద మీరు టాటా పంచ్ కంటే పెద్ద సైజులో ఉండే రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కొనుగోలు చేయవచ్చు.

Tata Punch వద్దా..? అయితే ఈ మూడు కార్లపై ఓ లుక్కేస్కోండి.. పంచ్‌కి ప్రత్యామ్యాయాలు

రెనోల్ట్ కైగర్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో ఒకటి 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, ఈ ఇంజన్ 71.01 బిహెచ్‌పి పవర్ ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మరింత శక్తివంతమైన ఇంజన్ కోరుకునే వారి కోసం 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 98.63 బిహెచ్‌పి పవర్ ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తుంది.

Tata Punch వద్దా..? అయితే ఈ మూడు కార్లపై ఓ లుక్కేస్కోండి.. పంచ్‌కి ప్రత్యామ్యాయాలు

రెనో కైగర్ లోని ఈ రెండు ఇంజన్‌లను 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. అయితే, ఇందులోని 1.0 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మాత్రం ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌ ఆప్షన్ తో లభిస్తుంది. అలాగే, ఇందులోని మరింత శక్తివంతమైన టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది.

Tata Punch వద్దా..? అయితే ఈ మూడు కార్లపై ఓ లుక్కేస్కోండి.. పంచ్‌కి ప్రత్యామ్యాయాలు

3. మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift)

టాటా పంచ్ కి ప్రత్యామ్నాయంగా ఉన్న మూడవ మోడల్ మారుతి సుజుకి స్విఫ్ట్. ఈ విభాగంలో మీరు ఫన్-టు-డ్రైవ్ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నట్లయితే, మీకు మారుతి సుజుకి స్విఫ్ట్‌ను బుక్ చక్కటి ఆప్షన్ గా ఉంటుంది. స్విఫ్ట్ చూడటానికి ఎస్‌యూవీ కాకపోవచ్చు, కానీ దాని ఏరోడైనమిక్స్ మరియు డ్రైవింగ్ డైనమిక్స్ మాత్రం మంచి ఫన్ టూ డ్రైవ్ అనుభూతిని అందిస్తాయి.

Tata Punch వద్దా..? అయితే ఈ మూడు కార్లపై ఓ లుక్కేస్కోండి.. పంచ్‌కి ప్రత్యామ్యాయాలు

దశాబ్ధాల కాలం నుంచి మారుతి సుజుకి స్విఫ్ట్ ఇప్పటికీ ఈ విభాగంలో ఓ గొప్ప కారుగా ఉంది. పదునైన హ్యాండ్లింగ్ మరియు సాటిలేని బాడీ కంట్రోల్‌తో ఇది కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న లేటెస్ట్ మారుతి సుజుకి స్విఫ్ట్ కారులో మరింత మెరుగైన ఇంటీరియర్‌లు మరియు మరిన్ని ఫీచర్లు లభిస్తున్నాయి.

Tata Punch వద్దా..? అయితే ఈ మూడు కార్లపై ఓ లుక్కేస్కోండి.. పంచ్‌కి ప్రత్యామ్యాయాలు

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్‌లో 1.2 లీటర్ 4 సిలిండర్ బిఎస్ 6 పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 88.5 బిహెచ్‌పి పవర్ ను మరియు 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. టాటా పంచ్ మాదిరిగానే, కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ కూడా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5 స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

Tata Punch వద్దా..? అయితే ఈ మూడు కార్లపై ఓ లుక్కేస్కోండి.. పంచ్‌కి ప్రత్యామ్యాయాలు

ధర విషయానికి వస్తే, మార్కెట్లో మారుతి సుజుకి స్విఫ్ట్ ధరలు రూ. 5.85 లక్షల నుండి ప్రారంభం అవుతాయి. అంటే, సుమారు రూ. 36,000 ఎక్కువ ధరతో టాటా పంచ కన్నా విశాలమైన మరియు ఫన్ టూ డ్రైవ్ హ్యాచ్‌బ్యాక్ ను కొనుగోలు చేయవచ్చు. మరి ఈ నాలుగు కార్లలో (టాటా పంచ్, టాటా ఆల్ట్రోజ్, రెనో కైగర్ మరియు మారుతి స్విఫ్ట్) మీ ఫేవరేట్ మోడల్ ఏంటి? కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Most Read Articles

English summary
Top 3 alternative cars to tata punch suv altroz kiger swift
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X