భారత మార్కెట్లో 15 లక్షల కన్నా తక్కువ ధర కలిగిన టాప్ 5 కార్లు; వివరాలు

భారత మార్కెట్లో వివిధ రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అతి తక్కువ ధరకు లభ్యమయ్యేవి, ఎక్కువ ధరకు లభ్యమయ్యేవి ఉన్నాయి. చాలా మంది వాహన వినియోగదారులు అతి తక్కువ ధరతో మంచి ఫీచర్స్ ఉన్న వాహనాలను ఎంచుకుంటారు. కొంత మంది కొంత ఎక్కువ వెచ్చించి మరింత అధునాతల లక్షణాలు మరియు పరికరాలు ఉన్న వాహనాలను కొనుగోలుచేయాలనుకుంటారు.

ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో 15 లక్షలలోపు ధర కలిగి ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 5 కార్లను గురించి తెలుసుకుందాం.. రండి.

భారత మార్కెట్లో 15 లక్షల కన్నా తక్కువ ధర కలిగిన టాప్ 5 కార్లు; వివరాలు

కియా సొనెట్:

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సౌంత్ కొరియా బ్రాండ్ 'కియా మోటార్స్' యొక్క కాంపాక్ట్ SUV కియా సొనెట్. ఇది భారత మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలతో ముందుకు సాగింది. కియా సొనెట్ మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, వాహనదారునికి మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

భారత మార్కెట్లో 15 లక్షల కన్నా తక్కువ ధర కలిగిన టాప్ 5 కార్లు; వివరాలు

కియా సొనెట్ రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్లతో విక్రయించబడుతుంది. ఇందులో మొదటిది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కాగా, మొరొకటి 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 83 బిహెచ్‌పి పవర్ మరియు 115 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 120 బిహెచ్‌పి పవర్ మరియు 172 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కారు ధర రూ. 6.79 లక్షల నుండి రూ. 13.35 లక్షలు(ఎక్స్-షోరూమ్).

భారత మార్కెట్లో 15 లక్షల కన్నా తక్కువ ధర కలిగిన టాప్ 5 కార్లు; వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి:

దేశీయ మార్కెట్లోని ప్రముఖ కార్ల జాబితాలో రెండవ స్థానంలో ఉన్న మోడల్ వోక్స్‌వ్యాగన్ పోలో జిటి. దీని ధర రూ. 6.16 లక్షల నుండి రూ. 9.99 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది కూడా చాలా వరకు లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా మంచి ఇంధన సామర్త్యాన్ని కూడా అందిస్తుంది.

వోక్స్‌వ్యాగన్ పోలో జిటి1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఇది ఒకే ఇంజిన్ ఆప్షన్‌లో మార్కెట్లో విక్రయానికి ఉంది. ఈ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్ మరియు 175 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

భారత మార్కెట్లో 15 లక్షల కన్నా తక్కువ ధర కలిగిన టాప్ 5 కార్లు; వివరాలు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10:

ప్రముఖ కార్ తయారీ సంస్థ హ్యుందాయ్ కంపెనీ యొక్క పాపులర్ మోడల్ గ్రాండ్ ఐ10 నియోస్. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధర భారత మార్కెట్లో రూ. 5.23 లక్షల నుండి రూ. 8.45 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారు మూడు ఇంజిన్ ఎంపికలతో విక్రయించబడుతుంది. అవి 1.2-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ డీజిల్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్స్.

భారత మార్కెట్లో 15 లక్షల కన్నా తక్కువ ధర కలిగిన టాప్ 5 కార్లు; వివరాలు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ లోని పవర్ పుల్ ఇంజిన్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, ఇది 100 బిహెచ్‌పి పవర్ మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా, దీని డీజిల్ ఇంజన్ ఇంజిన్ 75 బిహెచ్‌పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

భారత మార్కెట్లో 15 లక్షల కన్నా తక్కువ ధర కలిగిన టాప్ 5 కార్లు; వివరాలు

టాటా నెక్సాన్:

సేఫ్టీ ఫీచర్స్ విషయంలో తనకుతానే సాటిగా నిలిచిన టాటా మోటార్స్ యొక్క బ్రాండ్ టాటా నెక్సాన్. మనం చెప్పుకుంటున్న ఈ జాబితాలో టాటా నెక్సాన్ నాల్గవ స్థానంలో ఉంది. దీని ధర రూ. 7.19 లక్షల నుండి రూ. 13.23 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.

భారత మార్కెట్లో 15 లక్షల కన్నా తక్కువ ధర కలిగిన టాప్ 5 కార్లు; వివరాలు

టాటా నెక్సాన్ 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1. లీటర్ టర్బో డీజిల్ రెండు ఇంజిన్లలో విక్రయించబడింది. దీని పెట్రోల్ ఇంజన్ 120 బిహెచ్‌పి మరియు 170 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక ఇందులోని డీజిల్ ఇంజన్ 110 బిహెచ్‌పి మరియు 260 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

భారత మార్కెట్లో 15 లక్షల కన్నా తక్కువ ధర కలిగిన టాప్ 5 కార్లు; వివరాలు

హ్యుందాయ్ వెర్నా:

హ్యుందాయ్ బ్రాండ్ లో అత్యంత విశిష్టమైన కారు వెర్నా. హ్యుందాయ్ కంపెనీ దీనిని రూ. 9.19 లక్షల నుండి రూ. 15.25 లక్షల మధ్య విక్రయిస్తోంది. ఇది మూడు ఇంజిన్ ఎంపికలతో విక్రయానికి ఉంది. అవి 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌లు.

భారత మార్కెట్లో 15 లక్షల కన్నా తక్కువ ధర కలిగిన టాప్ 5 కార్లు; వివరాలు

ఇందులో ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 115 బిహెచ్‌పి మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగా, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 120 బిహెచ్‌పి మరియు 172 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక చివరగా 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
Top 5 Cars Under 15 Lakhs In India. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X