భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ బస్సులు.. వాటి వివరాలు

ప్రపంచం అభివృద్ధి చెందుతున్న తరుణంలో కేవలం కార్లు మరియుబైకులు మాత్రమే కాదు బస్సులు మరియు ఇతర కమర్షియల్ వాహనాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుతున్నాయి. డీజిల్ మరియు పెట్రోల్ వాహనాల వల్ల పెరుగుతున్న అధిక కాలుష్యం వల్ల పర్యవరణం ఆసాంతం కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను తప్పకుండా వినియోగించాలి.

భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ బస్సులు.. వాటి వివరాలు

భారతదేశంలో ఇప్పటికే చాలా నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. కానీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ బస్సుల గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ బస్సులు.. వాటి వివరాలు

Tata Starbus Urban 9/12m AC Bus:

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణపొందిన Tata Motors కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ బస్సులను కూడా తయారుచేస్తుంది. ఈ కంపెనీ టాటా స్టార్‌బస్ అర్బన్ 9/12 మీటర్స్ AC అనే ఎలక్ట్రిక్ బస్సును తీసుకువచ్చింది. ఇది 186 kWh L-ipn బ్యాటరీతో కూడిన సాంకేతికంగా అభివృద్ధి చెందిన వాహనం. ఇది గరిష్టంగా 245 Kw శక్తిని అందిస్తుంది.

ఈ టాటా మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ బస్సు పరిధి దాదాపు 150 కిమీ వరకు ఉంటుంది. అంతే కాకుండా ఇందులోని స్పెషల్ రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఈ వాహనం యొక్క సామర్థ్యాన్ని మరింత పెంచడంలో సహాయపడుతుంది. టాటా స్టార్‌బస్ అర్బన్ 9/12 మీటర్స్ AC బస్సు యొక్క గరిష్ట వేగం 75 కిమీ/గం. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది.

భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ బస్సులు.. వాటి వివరాలు

Ashok Leyland Circuit S:

Ashok Leyland కంపెనీ కమర్షియల్ వాహనాల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఈ కంపెనీ Circuit S అనే ఎలక్ట్రిక్ బస్సును కూడా కలిగి ఉంది. ఈ Ashok Leyland Circuit S బస్సు 500 kWh బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఇది ఒక్క ఛార్జ్ తో గరిష్టంగా 50 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ బస్సులో ఫాస్ట్ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. కావున ఏదైనా మొబైల్ బ్యాటరీ స్టేషన్‌లో 2 నిమిషాల్లో వేగంగా బ్యాటరీని మార్చడానికి అనుమతిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బస్సులో 30 మంది ప్రయాణీకులు కూర్చునే సామర్థ్యం కలిగి ఉంటుంది.

భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ బస్సులు.. వాటి వివరాలు

Olectra C9:

మనం మన దేశీయ రహదారులపైన OLECTRA ఎలక్ట్రిక్ బస్సులను సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాము. ఈ కంపెనీ భారతదేశంలో ఎలక్ట్రిక్ బస్సులు మరియు ప్రీమియం కమర్షియల్ బస్సుల తయారీకి కంపెనీ ప్రధాన ఒప్పందాన్ని కలిగి ఉంది. OLECTRA ఎలక్ట్రిక్ బస్సు ఛార్జ్‌కి 250 నుంచి 300 కిమీల పరిధిని అందిస్తాయి. కావున దేశీయ మార్కెట్లో ఎక్కువ వినియోగంలో ఉన్నాయి.

భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ బస్సులు.. వాటి వివరాలు

Olectra C9 ఎలక్ట్రిక్ బస్సు రెండు 180 kW L-ion ఎలక్ట్రిక్ మోటార్‌ల ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 480 బిహెచ్‌పి పవర్ మరియు 3,000 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలెక్ట్రిక్ బస్సులోని బ్యాటరీని 2-3 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇందులో ఒకేసారి 45-49 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.

భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ బస్సులు.. వాటి వివరాలు

JBM Eco-Life Electric:

ఈ JBM Eco-Life Electric బస్సులు భారతదేశపు మొదటి 100 శాతం ఎలక్ట్రిక్ బస్సుగా పరిగణించబడింది. ఈ బస్సు L-ion బ్యాటరీ కలిగి ఒక ఛార్జింగ్‌కు 250 కిమీల పరిధిని అందిస్తుంది. ఈ బస్సులో ఒక ఎలక్ట్రిక్ మోటార్ మాత్రమే అమర్చబడి ఉంటుంది. JBM Eco-Life Electric బస్సు యొక్క ఎలక్ట్రిక్ మోటార్ 80 నుండి 160 kWh పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌తో పూర్తిగా ఛార్జ్ కావడానికి కేవలం 2 నుంచి 3 గంటలు సమయాన్ని తీసుకుంటుంది.

భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ బస్సులు.. వాటి వివరాలు

ఈ JBM Eco-Life Electric బస్సులు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. ఇందులో సీసీటీవీ కెమెరాలు, స్టాప్ రిక్వెస్ట్ బటన్, అత్యవసర పరిస్థితుల్లో పానిక్ బటన్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి ఆధునిక సౌకర్యాలు కలిగి ఉండటం వల్ల ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ బస్సులు.. వాటి వివరాలు

Olectra eBuzz K6 LuXe:

Olectra Greentech Limited ఈ 7 మీటర్ల ఎలక్ట్రిక్ మినీబస్సును 2018 సంవత్సరంలో ప్రారంభించింది. భారతదేశంలో ఈ తరహాలో నిర్మించిన తొలి బస్సు ఇదే. Olectra eBuzz K6 LuXe బస్సు 180 kWh మోటారుతో శక్తిని పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 1800 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని L-ion బ్యాటరీ ఒక ఛార్జ్‌కు గరిష్టంగా 200 కిమీల పరిధిని అందిస్తుంది. ఇది రీజెనరేటివ్ బ్రేకింగ్‌తో వస్తుంది. కావున ఇది వాహనం యొక్క సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ బస్సులు.. వాటి వివరాలు

ఈ Olectra eBuzz K6 LuXe బస్సులు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. దేశంలో రోజురోజుకి ఇంధన ధరలు అమాంతం పెరుగుతున్న కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం జోరుగా సాగుతోంది. రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ సంఖ్యలో వినియోగంలో ఉండే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Top 5 electric buses in india tata olectra ashok leyland details
Story first published: Friday, November 26, 2021, 19:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X