భారతదేశంలో లభిస్తున్న అత్యంత చవకైన కార్లు (అన్ని విభాగాలలో)

మన దేశంలో చాలా మంది కొత్త కారు కొనడానికి వెళ్ళినప్పుడు, వారు మెరుగైన, సరసమైన మరియు ఫుల్లీ ఫీచర్ లోడెడ్ కార్ల కోసం చూస్తుంటారు. అలాగే, కొందరు తాము కొనుగోలు చేయాలనుకునే కారులో లభించే ఫీచర్లతో సంబంధం లేకుండా, తక్కువ ధరకే ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాంటి వారికోసమే ఈ కథనం.

భారతదేశంలో లభిస్తున్న అత్యంత చవకైన కార్లు (అన్ని విభాగాలలో)

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ సెడాన్, సెడాన్, క్రాసోవర్, కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఎస్‌యూవీ ఇలా అనేక వాహన విభాగాలు ఉన్నాయి. ప్రతి వాహన విభాగంలో కూడా కొన్ని సంస్థలు అందిస్తున్న కార్లు సరసమైన ధరకే అందుబాటులో ఉన్నాయి. అలాంటి చవకైన కార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

భారతదేశంలో లభిస్తున్న అత్యంత చవకైన కార్లు (అన్ని విభాగాలలో)

1. ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ - మారుతి ఆల్టో 800 (స్టాండర్డ్)

ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో సరసమైన మరియు మన్నికైన కార్ మారుతి సుజుకి ఆల్టో 800 (స్టాండర్డ్ వేరియంట్). ప్రస్తుతం మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర కేవలం రూ.2.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) మాత్రమే. ఇది బేస్ వేరియంట్, ఇందులో ఎక్కువ ఫీచర్లు ఉండవు. ఈ కారులో బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్-టోన్ ఇంటీరియర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ వంటి ఫీచర్లు మాత్రమే ఉన్నాయి. ఈ కారులో ఏసి కూడా ఉండదు.

భారతదేశంలో లభిస్తున్న అత్యంత చవకైన కార్లు (అన్ని విభాగాలలో)

2. మిడ్-లెవల్ హ్యాచ్‌బ్యాక్ - హ్యుందాయ్ శాంత్రో ఎరా

కొరియన్ కార్ బ్రాండ్, భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తమ పాపులర్ శాంత్రో కారు లేటెస్ట్‌గా అప్‌గ్రేడ్ చేసి మార్కెట్లో అందిస్తోంది. ఇధి చాలా కాలంగా భారత మార్కెట్లో బలమైన బ్రాండ్‌గా కొనసాగుతోంది. మిడ్-లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో హ్యుందాయ్ శాంత్రో ఎరా ఎగ్జిక్యూటివ్ వేరియంట్ అగ్రగామిగా ఉంటుంది. మార్కెట్లో దీని ధర రూ.4.73 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉంది.

భారతదేశంలో లభిస్తున్న అత్యంత చవకైన కార్లు (అన్ని విభాగాలలో)

3. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ - టాటా ఆల్ట్రోజ్ ఎక్స్‌ఈ

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో టాటా ఆల్ట్రోజ్ కారు కేవలం రూ.5.73 లక్షల ప్రారంభ ధరకే అందుబాటులో ఉంటుంది. ఇందులో మీరు బేస్ ఎక్స్ఈ వేరియంట్‌ను కొనుగోలు చేస్తున్నప్పటికీ, మీకు ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో అనేక ఫీచర్లు లభిస్తాయి. ఇందులో టిల్ట్ అడ్జస్టబల్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, బాడీ-కలర్డ్ బంపర్స్, మల్టీ డ్రైవ్ మోడ్, హై-స్పీడ్ అలర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

భారతదేశంలో లభిస్తున్న అత్యంత చవకైన కార్లు (అన్ని విభాగాలలో)

4. కాంపాక్ట్ సెడాన్ - హ్యుందాయ్ ఔరా ఈ

పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవున్న సెడాన్ బాడీ టైప్ (సబ్-4 మీటర్) కార్లను కాంపాక్ట్ సెడాన్లుగా వర్గీకరిస్తారు. ఈ విభాగంలో హ్యుందాయ్ ఔరా యొక్క బేస్ వేరియంట్, భారత మార్కెట్లో లభించే అత్యంత సరసమైన సబ్-4 మీటర్ సెడాన్. ఈ విభాగంలో ఇది మారుతి డిజైర్ కంటే కూడా చాలా చౌకగా ఉంటుంది. మార్కెట్లో హ్యుందాయ్ ఔరా ఈ వేరియంట్ ప్రారంభ ధర రూ.5.97 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఈ కారులో డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, హై-స్పీడ్ అలర్ట్, బాడీ-కలర్ బంపర్ వంటి అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారతదేశంలో లభిస్తున్న అత్యంత చవకైన కార్లు (అన్ని విభాగాలలో)

5. కాంపాక్ట్ ఎస్‌యూవీ - రెనో కైగర్ ఆర్‌ఎక్స్ఈ ఎమ్‌టి

పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవున్న ఎస్‌యూవీ బాడీ టైప్ (సబ్-4 మీటర్) కార్లను కాంపాక్ట్ ఎస్‌యూవీలుగా వర్గీకరిస్తారు. ఈ విభాగంలో లేటెస్ట్‌గా వచ్చిన రెనో కైగర్ బెస్ట్ మోడల్‌గా ఉంటుంది. రెనో కైగర్ ఆర్‌ఎక్స్ఈ ఎమ్‌టి వేరియంట్ ధర రూ.5.45 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కారులో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, బ్లాక్ సైడ్ మిర్రర్స్, సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్లు, స్పోర్టీ రియర్ స్పాయిలర్, శాటిన్ సిల్వర్ రూఫ్ ట్రాక్స్, సైడ్ డోర్ డెకాల్స్ మరియు వీల్ కవర్లు మొదలైన ఫీచర్లు లభిస్తాయి.

భారతదేశంలో లభిస్తున్న అత్యంత చవకైన కార్లు (అన్ని విభాగాలలో)

6. మిడ్-సైజ్ ఎస్‌యూవీ - రెనో డస్టర్ ఆర్‌ఎక్స్ఈ

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కార్ల విభాగం మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగం మరియు ప్రస్తుతం ఈ విభాగంలో అత్యంత చౌకైన కారుగా రెనో డస్టర్ ఆర్‌ఎక్స్ఈ వేరియంట్ ఉంది. మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర రూ.8.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇందులో డ్యూయల్-టోన్ బంపర్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్, డ్రైవర్ మరియు ప్యాసింజర్ సీట్‌బెల్ట్ రిమైండర్‌ను వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

భారతదేశంలో లభిస్తున్న అత్యంత చవకైన కార్లు (అన్ని విభాగాలలో)

7. సి-సెగ్మెంట్ సెడాన్ - స్కొడా ర్యాపిడ్ రైడర్

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా అందిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ సెడాన్ ర్యాపిడ్ రైడర్ వేరియంట్‌ను ఇటీవలే పునఃప్రారంభించింది. స్కొడా ర్యాపిడ్ 1.0 టిఎస్ఐ యొక్క బేస్ రైడర్ వేరియంట్ సరసమైన ధరతో మంచి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో సెంటర్ ఆర్మ్‌రెస్ట్, రియర్ ఏసి వెంట్స్, ఆల్ పవర్ విండోస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎయిర్‌బ్యాగులు వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ధర రూ.7.80 లక్షలు (ఎక్స్-షోరూమ్).

భారతదేశంలో లభిస్తున్న అత్యంత చవకైన కార్లు (అన్ని విభాగాలలో)

8. ప్రీమియం సెడాన్ - హ్యుందాయ్ ఎలంట్రా ఎస్ఎక్స్ ఎమ్‌టి

ప్రస్తుతం, హ్యుందాయ్ ఎలంట్రా భారతదేశంలో అత్యంత సరసమైన ప్రీమియం సెడాన్‌గా కొనసాగుతోంది. ఇందులోని బేస్ ఎస్ఎక్స్ వేరియంట్ ధర రూ.18.79 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కారులో ఈఎస్ఎస్, హెచ్ఏసి, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్, సర్దుబాటు చేయగల సీట్లు, ఆర్మ్‌రెస్ట్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

భారతదేశంలో లభిస్తున్న అత్యంత చవకైన కార్లు (అన్ని విభాగాలలో)

9. ఎమ్‌పివి - రెనో ట్రైబర్ ఆర్ఎక్స్ఈ

భారతదేశంలో లభించే చౌకైన 7-సీటర్ కారు రెనో ట్రైబర్ ఆర్‌ఎక్స్ఈ వేరియంట్. ఈ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.5.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) మాత్రమే. ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఈబిడితో కూడిన ఏబిఎస్, లోడ్ లిమిటర్, పాదచారుల రక్షణ, హై-స్పీడ్ అలెర్ట్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

భారతదేశంలో లభిస్తున్న అత్యంత చవకైన కార్లు (అన్ని విభాగాలలో)

10. ఎస్‌యూవీ - మహీంద్రా థార్

ఎస్‌యూవీ విభాగంలో లభిస్తున్న అత్యంత సరసమైన ఎస్‌యూవీలలో మహీంద్రా థార్ ఏఎక్స్ ముందంజలో ఉంటుంది. ఈ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.14.06 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇదొక 4-సీటర్ ఎస్‌యూవీ, కంపెనీ ఇందులో 6-సీటర్ వెర్షన్‌ను నిలిపివేసింది. ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. బేస్ వేరియంట్లో పెద్దగా చెప్పుకోదగిన ఫీచర్లు ఏమీ ఉండవు.

భారతదేశంలో లభిస్తున్న అత్యంత చవకైన కార్లు (అన్ని విభాగాలలో)

11. ఎలక్ట్రిక్ కారు - మహీంద్రా ఈ-వెరిటో డి

ఇక చివరగా, భారతదేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు విషయానికి వస్తే, ఈ విభాగంలో మహీంద్రా ఈ-వెరిటో డి బేస్ వేరియంట్ రూ.8.42 లక్షల ధరతో నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. అయితే, ఈ ధర ఇందులో ఎక్కువ ఫీచర్లను ఆశించలేము.

Most Read Articles

English summary
Top Cheapest Cars From Each Vehicle Segment In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X