Toyota Fortuner Legender 4x4 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

టొయోటా కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఫార్చ్యూనర్ లెజండర్ (Fortuner Legender) లో కంపెనీ ఓ కొత్త 4x4 (ఆల్-వీల్ డ్రైవ్) వేరియంట్ ను నేడు (అక్టోబర్ 7, 2021) మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ 4X4 ధర రూ.42.33 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది.

Toyota Fortuner Legender 4x4 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ప్రస్తుత పండుగ సీజన్ నేపథ్యంలో కంపెనీ ఈ కొత్త Toyota Fortuner Legender 4x4 వేరియంట్ ను విడుదల చేసింది. ఆసక్తి గల కస్టమర్లు కొత్త ఫార్చ్యూనర్ లెజెండర్ 4x4 (AWD) వేరియంట్ ను నేటి నుండి కంపెనీ వెబ్‌సైట్ లేదా దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత టొయోటా డీలర్‌షిప్ ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ ఎస్‌యూవీ డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి.

Toyota Fortuner Legender 4x4 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ 4x4 ఎస్‌యూవీ శక్తివంతమైన 2.8 లీటర్ డీజిల్ ఇంజన్‌తో లభిస్తుంది మరియు ఈ అంజన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కొత్త వేరియంట్ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌తో (పెరల్ వైట్ బాడీ కలర్ మరియు బ్లాక్ రూఫ్ కలర్) అందుబాటులో ఉంటుంది. ఈ కలర్ ఆప్షన్ ఇంతకు ముందు ఇది 4x2 డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌లో ఉండేది.

Toyota Fortuner Legender 4x4 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

స్టాండర్డ్ ఫార్చ్యూనర్ ఎస్‌యూవీకి ఎగువన స్పోర్టీ వెర్షన్‌గా వచ్చిన కొత్త ఫార్చ్యూనర్ లెజెండర్ ను టొయోటా ఈ ఏడాది జనవరి 2021 నెలలో మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి ఈ మోడల్ కేవలం 4x2 (టూవీల్ డ్రైవ్) ఆప్షన్ తో మాత్రమే లభ్యమయ్యేది. కాగా, ఇప్పుడు కస్టమర్ల డిమాండ్ మేరకు కంపెనీ ఇందులో 4x4 (ఫోర్-వీల్ డ్రైవ్) వేరియంట్ ను కూడా ప్రవేపెట్టింది.

Toyota Fortuner Legender 4x4 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

టొయోటా ఇప్పటి వరకూ 4x2 ఆప్షన్ కలిగిన ఫార్చ్యూనర్ లెండర్ ఎస్‌యూవీలను 2700 యూనిట్లకు పైగా విక్రయిచింది. ఇది ఈ విభాగంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రీమియం ఫుల్-సైజ్ ఎస్‌యూవీ. ఈ ఏడాది సరికొత్త లుక్ అండ్ ఫీల్ తో వచ్చిన కొత్త ఫార్చ్యూనర్ మరియు ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీ అమ్మకాలు మునుపటి కన్నా మెరుగ్గా సాగుతున్నాయి.

Toyota Fortuner Legender 4x4 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త టొయోటా ఫార్చ్యూనర్ లెజెండరీ 4x4 వేరియంట్ విషయానికి, ఇందులో డ్రైవ్‌ట్రైన్ మార్పు మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. ఎప్పటి లాగే ఈ ఎస్‌యూవీ ముందు వైపు నుండి చాలా అగ్రెసివ్ గా కనిపిస్తుంది. సన్నని ఫ్రంట్ గ్రిల్, హై ఫ్రంట్ బంపర్, పెద్ద ఎయిర్ డ్యామ్, కొత్త మరియు విభిన్నమైన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లతో ఇది ప్రీమియం లుక్ ని కలిగి ఉంటుంది.

Toyota Fortuner Legender 4x4 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

స్టాండర్డ్ ఫార్చ్యూనర్ తో పోల్చుకుంటే, ఈ కొత్త ఫార్చ్యూనర్ లెజెండర్ లో స్టైలిష్ 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, యాంబియంట్ క్యాబిన్ లైటింగ్, రియర్ యూఎస్‌బి పోర్టులు, గెశ్చర్ కంట్రోల్డ్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, వెంటిలేటెడ్ అండ్ పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Toyota Fortuner Legender 4x4 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ క్యాబిన్ లోపల 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు టొయోటా కనెక్ట్ వంటి లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ, 11 స్పీకర్లతో కూడిన ప్రీమియం జెబిఎల్ సౌండ్ సిస్టమ్ మరియు టిఎఫ్‌టి మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే మొదలైన ఫీచర్లు లభిస్తాయి.

Toyota Fortuner Legender 4x4 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారులో 7 ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్, స్టెబిలిటీ కంట్రోల్, ఐఎస్ఓ ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్ మరియు 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా మొదలైనవి ఉన్నాయి.

Toyota Fortuner Legender 4x4 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఏడబ్ల్యూడి ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 2.8 లీటర్ టర్బోచార్జ్డ్, ఇన్‌లైన్-4 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 204 బిహెచ్‌పి పవర్‌ను మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది.

Toyota Fortuner Legender 4x4 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఫార్చ్యూనర్ లెజెండర్ ఏడబ్ల్యూడిలో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఉండదు. పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కావాలనుకునే వారు ఇతర వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని కొనుగోలు చేయవచ్చు. సమాచారం కొరకు, ఇందులోని 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 166 బిహెచ్‌పి పవర్ ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Toyota Fortuner Legender 4x4 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

భారీగా పెరిగిన టొయోటా కార్ల ధరలు

టయోటాకు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, తాజాగా కంపెనీ తమ కార్ల ధరలను పెంచింది. టొయోటా గ్లాంజా, అర్బన్ క్రూయిజర్, ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ మరియు క్యామ్రీ కార్ల ధరలను కంపెనీ పెంచింది, కాగా, వెల్‌ఫైర్ లగ్జరీ ఎమ్‌పివి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. వీటిలో అత్యధికంగా క్యామ్రీ ధర రూ. 61,000 వరకూ పెరిగింది. - ఏయే మోడళ్ల ధరలు ఎంత మేర పెరిగాయో తెలుసుకోవటానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Toyota fortuner legender awd variant launched in india price specs features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X