భారత మార్కెట్లో పవర్‌పుల్ ఎస్‌యూవీ; 2021 టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ వీడియో

ఫార్చ్యూనర్ దేశీయ మార్కెట్లో ప్రారంభమైనప్పటి నుంచి మోస్ట్ వాంటెడ్ ఎస్‌యూవీగా నిలిచింది. ఈ ఎస్‌యూవీ మార్కెట్లో తన స్థితిని బలంగా నిలదొక్కుకోవడానికి క్రమం తప్పకుండా అప్‌డేట్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే 2021 ప్రారంభంలో, టయోటా భారతదేశంలో ఫేస్‌లిఫ్టెడ్ ఫార్చ్యూనర్‌ను ప్రారంభించింది.

2021 ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌తో పాటు, కంపెనీ ఈ ఎస్‌యూవీ యొక్క 'లెజెండర్' వెర్షన్‌ను కూడా విడుదల చేసింది. లెజెండర్ అనేది స్టాండర్డ్ ఫార్చ్యూనర్ యొక్క స్పోర్టియర్ వెర్షన్. ఈ కొత్త టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ వెర్షన్‌ను ఇటీవల మేము రెండు రోజులు పాటు నగరంలో మరియు హైవేపై డ్రైవ్ చేసాము. కావున ఈ కొత్త టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ వెర్షన్‌ గురించి పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ అధునాత ఫీచర్స్ మరియు పరికరణము కలిగి ఉంటుంది, ఇందులో 2.8-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 3,000 - 3,400 ఆర్‌పిఎమ్ వద్ద 201 బిహెచ్‌పి పవర్ మరియు 1,600-2,800 ఆర్‌పిఎమ్ వద్ద 500 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త లెజెండర్ కేవలం 10 సెకన్లలోపు గంటకు 0 నుంచి 100 కి.మీ వేగవంత అవుతుంది.

టయోటా ఫార్చ్యూనర్ 2009 నుండి భారత మార్కెట్లో ఉన్న దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ కొత్త లెజెండర్ వెర్షన్ దేశవ్యాప్తంగా ఉన్న ఆదరణను మరింత పెంచడంలో సహాయపడుతుంది. అయితే ఈ కొత్త లెజెండర్ ఎస్‌యూవీలో సన్‌రూఫ్ హిల్ హోల్డ్ మరియు హిల్ డీసెంట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ లేదు.

ఈ ఫీచర్లు మినహా మిగిలిన అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కొత్త 2021 ఫార్చ్యూనర్ లెజెండర్ యొక్క ఆన్-రోడ్‌ ప్రైస్ సుమారు రూ. 46 లక్షల వరకు ఉంటుంది. ఫార్చ్యూనర్ లెజెండర్ భారత మార్కెట్లో ఎంజి గ్లోస్టర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

2021 టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ రివ్యూ వీడియో
Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota Fortuner Legender Review Video. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X