అదిరిపోయే లుక్‌లో ఉన్న మాడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్; వివరాలు

భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన వాహన తయారీదారులలో టయోటా ఒకటి. టయోటా కంపెనీ యొక్క ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ ఒక దశాబ్దానికి పైగా దేశీయ మార్కెట్లో ఎంతో ఆదరణ పొందుతోంది. ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని ఇప్పటికీ దేశీయ మార్కెట్లో అధిక డిమాండ్‌తో విక్రయిస్తున్నారు. దీని బట్టి చూస్తే ఫార్చ్యూనర్ కి దేశీయ మార్కెట్లో ఎంత ప్రజాదరణ ఉందొ అర్థమవుతుంది.

అదిరిపోయే లుక్‌లో ఉన్న మాడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్; వివరాలు

ప్రస్తుతం ఇది ఫుల్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన మోడల్. ఫార్చ్యూనర్ తక్కువ ఖర్చు నిర్వహణ మరియు విశ్వసనీయతకు ప్రసిద్ది చెందింది. కానీ డ్రైవింగ్ అప్పుడు కొంత అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఆఫ్-రోడ్ సామర్థ్యాలతో కూడిన ఎస్‌యూవీ.

అదిరిపోయే లుక్‌లో ఉన్న మాడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్; వివరాలు

టయోటా ఫార్చ్యూనర్ లో యజమానులు ఎదుర్కొనే ప్రధాన సమస్య రైడ్ క్వాలిటీ. అయితే ఇప్పుడు వాహనదారునికి అన్నివిధాలా అనుకూలంగా ఉండటానికి వీలుగా ఉన్న మాడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్ ఇక్కడ చూద్దాం రండి.

MOST READ:ఒకే ఛార్జ్‌తో 100 కి.మీ వెళ్లగల ఎలక్ట్రిక్ సైకిల్ ఇప్పుడు భారత్‌లో; ధర & వివరాలు

అదిరిపోయే లుక్‌లో ఉన్న మాడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్; వివరాలు

వన్ డ్రైవ్ యూట్యూబ్ ఛానెల్‌ ఈ మాడిఫైడ్ 2021 ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ వీడియోని అప్‌లోడ్ చేసింది. ఈ వీడియోలో మాడిఫైడ్ 2021 ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని చూడవచ్చు. వీడియోలో షోరూమ్‌ను సందర్శించినప్పుడు, వారి ఫార్చ్యూనర్ యొక్క రైడ్ క్వాలిటీ మెరుగుపరిచే సస్పెన్షన్ సెటప్‌ను వారు చూశారు.

అదిరిపోయే లుక్‌లో ఉన్న మాడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్; వివరాలు

ఇది టయోటాకి చాలా అనుకూలమైన సస్పెన్షన్ సెటప్. ఈ క్రొత్త సెటప్‌ను చేర్చడానికి పాత సస్పెన్షన్ మరియు కూలర్లు తొలగించబడ్డాయి, అంతే కాకుండా ఇందులో మందమైన కాయిల్ నుండి సస్పెన్షన్ ఏర్పాటు చేయబడింది. ఈ సస్పెన్షన్ స్టాండర్డ్ కారుకి కొంత భిన్నంగా ఉంటుంది. కొత్త సస్పెన్షన్ సెటప్ ఫార్చ్యూనర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ను కొంతవరకు పెంచుతుంది.

MOST READ:మా నాన్న పోలీస్.. నేను ఏమైనా చేస్తా.. కరోనా వేళ ఢిల్లీలో యువతి హల్‌చల్ [వీడియో]

అదిరిపోయే లుక్‌లో ఉన్న మాడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్; వివరాలు

టయోటా కంపెనీ తన 2021 ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ రూపకల్పన విషయానికొస్తే, 2021 ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో అప్‌డేట్ చేసిన ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌ను కలిగి ఉంది.

అదిరిపోయే లుక్‌లో ఉన్న మాడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్; వివరాలు

ఇది క్రోమ్ సరౌండ్‌తో పెద్ద ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంది, ఫాగ్ లాంప్స్ కి కొత్త హౌసింగ్‌తో అప్‌డేట్ చేసిన ఫ్రంట్ బంపర్ లభిస్తుంది. వెనుకవైపు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు ఎల్ఈడి టెయిల్ లాంప్స్ అమర్చారు.

MOST READ:మినీ కూపర్ కొనుగోలుచేసిన బిగ్ బాస్ 6 కన్నడ టైటిల్ విన్నర్: వివరాలు

అదిరిపోయే లుక్‌లో ఉన్న మాడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్; వివరాలు

టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు కొన్ని కొత్త ఫీచర్లతో మరింత ప్రీమియం వెర్షన్ గా అప్‌గ్రేడ్ చేయబడింది. ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో కొత్త 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు కనెక్టివిటీ కార్ టెక్నాలజీ ఇందులో ఇవ్వబడ్డాయి.

అదిరిపోయే లుక్‌లో ఉన్న మాడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్; వివరాలు

ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 11-స్పీకర్ జెబిఎల్ ఆడియో సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ మరియు ఇతర ఫీచర్లు ఉన్నాయి. కొత్త ఫార్చ్యూనర్ లో ఇప్పుడు చాలా ఫీచర్స్ ఉన్నాయి కావున ఇది తన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది

MOST READ:కరోనా నేపథ్యంలో కలర్ స్టిక్కర్స్.. ఏ వాహనానికి ఏ స్టిక్కర్ అంటే?

ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలలో లభిస్తుంది. ఈ ఎస్‌యూవీలో 2.7-లీటర్ పెట్రోల్, 2.8-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్ 166 బిహెచ్‌పి పవర్ మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

అదిరిపోయే లుక్‌లో ఉన్న మాడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్; వివరాలు

టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ యొక్క డీజిల్ ఇంజిన్‌ కూడా మంచి పనితీరుని అందిస్తుంది. మునుపటి ఫార్చ్యూనర్ మోడల్‌తో పోలిస్తే కొత్త ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ చాలా నవీకరణలను అందుకుంది. టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీకి మంచి ఆఫ్-రోడ్ సామర్ధ్యం ఉంది. కావున ఇప్పటికి మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు వెళ్తుంది.

Image Courtesy: ONE DRIVE

Most Read Articles

English summary
2021 Toyota Fortuner Modified With Adaptive Suspension. Read in Telugu.
Story first published: Tuesday, April 20, 2021, 9:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X