కొత్త సంవత్సరంలో విడుదల కానున్న సరికొత్త టొయోటా హైలక్స్ పికప్ ట్రక్!

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా (Toyota) గత కొంత కాలంగా భారతదేశంలో ఎలాంటి కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టలేదు. మారుతి సుజుకి సంస్థతో ఉన్న భాగస్వామ్యంలో భాగంగా, కంపెనీ మారుతి నుండి కొనుగోలు చేసిన రీబ్యాడ్జ్ వాహనాలను భారత మార్కెట్లో విక్రయిస్తోంది. ఇలా ఇప్పటికే, మారుతి బాలెనో ఆధారంగా రూపొందించిన గ్లాంజా మరియు మారుతి విటారా బ్రెజ్జా ఆధారంగా రీబ్యాడ్జ్ చేసిన అర్బన్ క్రూయిజర్ మోడళ్లను టొయోటా విక్రయిస్తోంది.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న సరికొత్త టొయోటా హైలక్స్ పికప్ ట్రక్!

ఇవి రెండే కాకుండా, త్వరలోనే మారుతి సియాజ్ రీబ్యాడ్జ్ వెర్షన్ గా టొయోటా బెల్టా సెడాన్ మరియు భవిష్యత్తులో మారుతి ఎర్టిగా ఆధారంగా ఓ టొయోటా బడ్జెట్ ఎమ్‌పివిలు కూడా మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. మరి, ఇక టొయోటా కేవలం మారుతి సుజుకి వాహనాలు రీబ్యాడ్జ్ చేసి మాత్రమే విక్రయిస్తుందా లేక స్వంతంగా ఏవైనా వాహనాలు మార్కెట్లోకి తీసుకువస్తుందా అనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే, టొయోటా భారతదేశంలో తన పూర్వవైభవాన్ని తెచ్చుకునేందుకు తన ప్రయత్నాలను మాత్రం కొనసాగిస్తూనే ఉంది.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న సరికొత్త టొయోటా హైలక్స్ పికప్ ట్రక్!

ఇందులో భాగంగానే, టొయోటా తమ లైఫ్ స్టైల్ యుటిలిటీ వెహికల్ 'హైలక్స్' (Hilux) ను భారతదేశంలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కు ఈ ఏడాది చివరి నాటికి భారత మార్కెట్లో విడుదల చేయాలని భావించారు. కాకపోతే, పరిస్థితులు అందుకు అనుకూలించలేదు, దీంతో ఇప్పుడు కంపెనీ తమ మొట్టమొదటి పికప్ ట్రక్కును వచ్చే ఏడాది ఆరంభంలో భారత మార్కెట్లో విడుదల చేయాలని భావిస్తోంది.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న సరికొత్త టొయోటా హైలక్స్ పికప్ ట్రక్!

టొయోటా ఇప్పటికే భారతదేశంలో హైలక్స్ బ్రాండ్ పేరును కూడా ట్రేడ్‌మార్క్ చేసింది. ఈ హైలక్స్ పికప్ ట్రక్కు తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు దీనిని ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ మోడళ్ల మాదిరిగానే అదే IMV-2 ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేయనున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ పై తయారైనప్పటికీ, కొత్త టొయటా హైలక్స్ పికప్ ట్రక్కు పైన పేర్కొన్న రెండు మోడళ్ల కంటే కూడా ఎక్కువ పొడవును కలిగి ఉంటుంది.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న సరికొత్త టొయోటా హైలక్స్ పికప్ ట్రక్!

టొయోటా హైలక్స్ పికప్ పొడవు దాదాపు 5.3 మీటర్లు మరియు వీల్‌బేస్ 3 మీటర్ల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం. హైలక్స్ ఈ విభాగంలో ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ మోడల్ తో పోటీ పడనుంది. ప్రస్తుతం భారతదేశంలో పికప్ ట్రక్కులు అంతగా ప్రాచుర్యం పొందనప్పటికీ, టొయోటా మాత్రం ఈ విభాగంలోకి ప్రవేశించడం ద్వారా ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించాలని ప్లాన్ చేస్తోంది. ఈ హైలక్స్ పేరుకు పెద్ద చరిత్రే ఉంది, టొయోటా 1980 కాలం నుండి తమ హైలక్స్ బ్రాండ్ పేరును ఉపయోగిస్తోంది.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న సరికొత్త టొయోటా హైలక్స్ పికప్ ట్రక్!

హైలక్స్ పికప్ డిజైన్ ను పరిశీలిస్తే, ముందు భాగంలో పెద్ద షట్కోణ ఫ్రంట్ గ్రిల్‌తో విలక్షణమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది, దాని చుట్టూ ఎల్ఆడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో స్వెప్ట్ బ్యాక్ హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి. సైడ్ డిజైన్ ను గమనిస్తే, దీని పొడవు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఇందులోని ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, బాడీ క్లాడింగ్ మరియు సైడ్ స్టెప్పులు పికప్ ట్రక్‌కి మంచి రగ్గడ్ లుక్ అని అందించడంలో సహకరిస్తాయి. వెనుక భాగం మిగితా పికప్ ట్రక్కుల మాదిరిగానే ఉంటుంది, కాకపోతే ఇందులో టొయోటా స్టైలింగ్ ఎలిమెంట్స్ చక్కగా కనిపిస్తాయి.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న సరికొత్త టొయోటా హైలక్స్ పికప్ ట్రక్!

కంపెనీ ఇందులో డబుల్ క్యాబిన్ వెర్షన్ భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఫలితంగా, ఇందులో డ్రైవరుతో కలిపి ఐదుగురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు మరియు పికప్ ట్రక్కు వెనుక భాగంలో కావల్సిన పనిముట్లను లేదా సామాగ్రిని తీసుకువెళ్లవచ్చు. విదేశాలలో ఎక్కువగా వాణిజ్య వినియోగం కోసం సింగిల్ క్యాబ్ పికప్ ట్రక్కులు అందుబాటులో ఉంటాయి, వీటిలో డ్రైవరుకు మరియు కోప్యాసింజర్ కు మాత్రమే సరిపడా స్థలం ఉంటుంది. మరి, ఇలాంటి దానిని టొయోటా భారత్ లో విడుదల చేస్తుందో లేదో వేచి చూడాలి.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న సరికొత్త టొయోటా హైలక్స్ పికప్ ట్రక్!

టొయోటా హైలక్స్ పికప్ ధరను అందుబాటులో ఉంచేందుకు, కంపెనీ దీనిని ప్రస్తుతం స్థానికంగా తయారు చేస్తున్న ఇన్నోవా మరియు ఫార్చ్యూనర్‌ మోడళ్ల మాదిరిగానే లోకలైజ్ చేసే అవకాశం ఉంది. ఫలితంగా, ఈ రెండు మోడళ్లలో కనిపించే మరియు ఉపయోగించిన అనేక విడిభాగాలు మరియు పరికరాలను ఈ కొత్త హైలక్స్ పికప్ ట్రక్కులో కూడా ఆశించవచ్చు. ఈ పికప్ ఫార్చ్యూనర్‌ను పోలి ఉన్నందున, అదే డ్యాష్‌బోర్డ్ డిజైన్ మరియు సీట్లు కలిగి ఉంటుందని ఆశించడంలో తప్పు లేదు.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న సరికొత్త టొయోటా హైలక్స్ పికప్ ట్రక్!

రాబోయే టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కులో Android Auto మరియు Apple CarPlayతో కూడిన 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ ఉంటుందని భావిస్తున్నారు. మరికొన్ని వారాల్లోనే ఈ పికప్ ట్రక్కుకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే ఆస్కారం ఉంది. హైలక్స్ పికప్ ట్రక్కు కోసం ఏషియన్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లలో ఇది 5 స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ సేఫ్టీ రేటింగ్ టొయోటా హైలక్స్ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు సహకరిస్తుంది.

కొత్త సంవత్సరంలో విడుదల కానున్న సరికొత్త టొయోటా హైలక్స్ పికప్ ట్రక్!

భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టబోయే టొయోటా హైలక్స్ ఇంజన్ ఎంపికలను కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. అయితే ఇది ఇన్నోవా యొక్క 150 బిహెచ్‌పి, 2.4-లీటర్ డీజిల్ ఇంజన్ తో రియల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ లో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. అదనంగా, ఇందులోని టాప్ ఎండ్ వేరియంట్లను టూ లేదా ఫోర్ వీల్ డ్రైవ్‌తో మరియు ఫార్చూనర్ లో ఉపయోగించిన 204 బిహెచ్‌పి, 2.8 లీటర్ ఇంజన్‌తో విడుదల చేయవచ్చని కూడా భావిస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Toyota gearinup to launch the much awaited hilux pickup truck in india early next year
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X