ఇసుజు పికప్‌లకు పోటీగా వస్తున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్: డీటేల్స్!

జపనీస్ కార్ బ్రాండ్ భారత మార్కెట్ కోసం ఓ కొత్త సరికొత్త పికప్ వాహనాన్ని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న టొయోటా హైలక్స్ అనే పికప్ ట్రక్కును కంపెనీ ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. కొత్త 2021 టొయోటా హైలక్స్‌ను కంపెనీ భారత్‌కు తీసుకువస్తుందని ధృవీకరించబడింది మరియు దీని ధర కూడా చాలా అగ్రెసివ్‌గా ఉంటుందని సమాచారం.

ఇసుజు పికప్‌లకు పోటీగా వస్తున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్: డీటేల్స్!

టొయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయిస్తున్న టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవి మరియు టొయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివి వంటి వాహనాలకు మద్దతు ఇచ్చే ఐఎమ్‌వి-2 ప్లాట్‌ఫామ్‌పైనే ఈ కొత్త టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కును కూడా నిర్మించనున్నారు. అయితే, ఇది దాదాపు 5.3 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది.

ఇసుజు పికప్‌లకు పోటీగా వస్తున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్: డీటేల్స్!

కొత్త 2021 మోడల్ టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కులో కంపెనీ తమ పాపులర్ ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివిలో ఉపయోగిస్తున్న 150 బిహెచ్‌పి 2.4-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఇది టాప్-ఎండ్ వేరియంట్లలో ఆల్-వీల్ డ్రైవ్ మరియు దిగువ వేరియంట్లలో రియర్-వీల్ డ్రైవ్ లేఅవుట్‌తో వచ్చే అవకాశం ఉంది.

ఇసుజు పికప్‌లకు పోటీగా వస్తున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్: డీటేల్స్!

టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో ఉపయోగిస్తున్న పెద్ద మరియు మరింత శక్తివంతమైన 2.8-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను కూడా టొయోటా హైలక్స్ టాప్-ఎండ్ వేరియంట్లలో ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఈ ఇంజన్ 208 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తూ, 4-వీల్-డ్రైవ్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఇసుజు పికప్‌లకు పోటీగా వస్తున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్: డీటేల్స్!

ఈ పికప్ ట్రక్కు విషయంలో టొయోటా యొక్క 'అగ్రెసివ్ ధర' ప్రణాళికలను పరిశీలిస్తే, ఎంట్రీ లెవల్ వేరియంట్లలో 4x4 ఆప్షన్ లభించబోదని తెలుస్తోంది. ఈ విభాగంలో ఇటీవల ఇసుజు మోటార్స్ విడుదల హైల్యాండర్ పికప్ ట్రక్కుకు పోటీగా టొయోటా హైలక్స్ బేస్ వేరియంట్లను విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్లు ఇసుజు వి-క్రాస్ మోడల్‌కి నేరుగా పోటీనిస్తుంది.

ఇసుజు పికప్‌లకు పోటీగా వస్తున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్: డీటేల్స్!

టొయోటా హైలక్స్ మంచి లైఫ్‌స్టైల్ వాహనంగా ఉంటుంది. అడ్వెంచర్స్ చేయాలనుకునే వారు, తరచూ క్యాంపింగ్‌లకు వెళ్లాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. ఇందులో డబుల్ క్యాబిన్ ఉండి, డ్రైవర్‌తో సహా ఐదుగురు ప్రయాణీకులు సౌకర్యంగా ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది. ఈ పికప్ ట్రక్కు వెనుక భాగంలో విశాలమైన ట్రక్ బెడ్ ఉంటుంది.

ఇసుజు పికప్‌లకు పోటీగా వస్తున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్: డీటేల్స్!

ఈ పికప్ ట్రక్కులో పెద్ద హెక్సాగనల్ గ్రిల్, డ్యూయెల్-బీమ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్స్, పెద్ద బంపర్ మరియు భారీ సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో ఇది ముందు వైపు నుండి గాంభీరమైన లుక్‌ని కలిగి ఉంటుంది. టాప్-ఎండే వేరియంట్లలో అల్లాయ్ వీల్స్, సైడ్ స్టెప్‌లను స్టాండర్డ్‌గా ఆఫర్ చేయవచ్చు. ఈ వాహనానికి మరింత ప్రీమియం లుక్‌నిచ్చేందుకు కంపెనీ దీని చుట్టూ క్రోమ్ గార్నిష్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది.

ఇసుజు పికప్‌లకు పోటీగా వస్తున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్: డీటేల్స్!

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, టొయోటా హైలక్స్ ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడానికి టొయోటా ఫార్చ్యూనర్ మరియు ఇన్నోవా క్రిస్టా వాహనాల్లో ఉపయోగించిన అనేక భాగాలను ఇందులోనూ కొనసాగించే అవకాశం ఉంది. టొయోటా హైలక్స్ ప్రధానంగా ఇసుజు వి-క్రాస్‌కి పోటీగా రానున్న నేపథ్యంలో, ఈ పికప్ ట్రక్కులో ప్రీమియం ఫీచర్లను ఆఫర్ చేయవచ్చని అంచనా.

ఇసుజు పికప్‌లకు పోటీగా వస్తున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్: డీటేల్స్!

టాప్-ఎండ్ టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కులో ఫార్చ్యూనర్ మరియు ఇన్నోవా క్రిస్టా మోడళ్లలో ఉపయోగించిన పెద్ద 8.0 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆఫర్ చేయనున్నారు. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో పాటుగా బ్రాండ్ యొక్క స్వంత కనెక్టింగ్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది.

ఇసుజు పికప్‌లకు పోటీగా వస్తున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్: డీటేల్స్!

టొయోటా హైలక్స్ ఈ విభాగంలో నేరుగా ఇసుజు డి-మ్యాక్స్ హై-లాండర్ మరియు వి-క్రాస్ మోడళ్లతో పోటీ పడనుంది. మార్కెట్లో వీటి ధరలు రూ.16.98 మరియు రూ.24.49 లక్షల మధ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, భారత మార్కెట్లో టొయోటా తమ హైలక్స్ పిక్-అప్ ట్రక్కుల ధరను ఎలా నిర్ణయిస్తుందో వేచి చూడాలి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Toyota Hilux Pickup Truck India Launch Around The Corner, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X