రెండు శాతం పెరగనున్న టయోటా ఇన్నోవా క్రిస్టా ధరలు; ఆగస్ట్ 1 నుంచి అమలు

ప్రముఖ వాహన తయారీదారు టయోటా బ్రాండ్ యొక్క ప్రధాన వాహనం 'ఇన్నోవా క్రిస్టా'. ఇన్నోవా క్రిష్టా మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందిన ఎంపివి. అయితే ఈ ఎంపివి యొక్క ధరలను రెండు శాతం పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల ధరల పెరుగుదల జరుగుతోందని కంపెనీ తెలిపింది.

టయోటా ఇన్నోవా క్రిస్టా ధరలు రెండు శాతం పెంపు; ఆగస్ట్ 1 నుంచి అమలు

ఇన్నోవా క్రిష్టా యొక్క కొత్త ధరలు 2021 ఆగస్టు 1 నుంచి కంపెనీ యొక్క అధికారిక సైట్లలో కనిపిస్తాయని వాహన తయారీసంస్థ తెలిపింది. టయోటా ప్రస్తుతం భారతదేశంలో 18 వేరియంట్లలో ఇన్నోవా క్రిస్టా ఎంపివిని విక్రయిస్తోంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా ధరలు రెండు శాతం పెంపు; ఆగస్ట్ 1 నుంచి అమలు

కంపెనీ యొక్క ఈ ఫ్లాగ్‌షిప్ లో 2.7-లీటర్ జిఎక్స్ 7-సీటర్ పెట్రోల్ వేరియంట్‌ ధర రూ. 16.52 లక్షలు కాగా, దీని టాప్-స్పెక్ 2.4-లీటర్ డీజిల్ జెడ్ఎక్స్ 7-సీటర్ ఆటోమేటిక్ ధర రూ. 24.59 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇప్పుడు ఈ మోడల్స్ ధరలు అగస్ట్ 01 నుంచి మరింత పెరగనున్నాయి. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఉత్పత్తి వ్యయం పెరగడమే అని కంపెనీ వెల్లడించింది.

టయోటా ఇన్నోవా క్రిస్టా ధరలు రెండు శాతం పెంపు; ఆగస్ట్ 1 నుంచి అమలు

తయారీ ప్రక్రియలో కార్ల తయారీదారులకు అవసరమైన మెటీరియల్‌లో ప్రధాన భాగమైన స్టీల్‌తో పాటు పల్లాడియం వంటి ఇతర విలువైన లోహాల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ పెరుగుదల ప్రాభవం ఈ కార్లపై పడటంవల్ల ధరల పెరుగుదల జరిగింది.

టయోటా ఇన్నోవా క్రిస్టా ధరలు రెండు శాతం పెంపు; ఆగస్ట్ 1 నుంచి అమలు

అధిక ధరల ప్రభావాన్ని తగ్గించడానికి ఈ విధంగా పాక్షికంగా ధరలను పెంచినట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్రభావం కస్టమర్ల మీద కూడా కొంత పడుతుంది. టయోటా ఒక ప్రకటనలో, కస్టమర్-ఫోకస్డ్ కంపెనీగా, వినియోగదారులపై పెరుగుతున్న ఖర్చుల ప్రభావాన్ని తగ్గించడానికి మేము ప్రయత్నిస్తున్నామని, మా కస్టమర్ల యొక్క అవసరాలను తీర్చడానికి మేము కట్టుబడి ఉన్నామని ఇది వరకే తెలిపింది.

టయోటా ఇన్నోవా క్రిస్టా ధరలు రెండు శాతం పెంపు; ఆగస్ట్ 1 నుంచి అమలు

టయోటా తన వాహనాల ధరల ఇప్పుడు ప్రకటించింది. అయితే భారతీయ మార్కెట్లో ఇప్పటికీ చాలా కంపెనీలు తమ వాహనాల ధారాలనుగణనీయంగా పెంచాయి. ఇందులో భాగంగానే టాటా మోటార్స్ కూడా త్వరలో తమ వాహనాల ధరలను పెంచబోతున్నట్లు భావిస్తున్నారు.

టయోటా ఇన్నోవా క్రిస్టా ధరలు రెండు శాతం పెంపు; ఆగస్ట్ 1 నుంచి అమలు

అయితే టాటా మోటార్స్ ధరల పెరుగుదల జరిగితే, కంపెనీ ఒకే సంవత్సరంలో ధరలు పెంచడం ఏకంగా మూడవ సారి అవుతుంది. ధరల పెరుగుదలకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. కొనుగోలుదారులు దీనిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

టయోటా ఇన్నోవా క్రిస్టా ధరలు రెండు శాతం పెంపు; ఆగస్ట్ 1 నుంచి అమలు

హోండా కార్స్ ఇండియా కూడా వచ్చే నెల నుండి భారతదేశంలోని అన్ని కార్ల ధరల పెరుగుదలను ప్రకటించింది. దేశంలో కరోనా లాక్ డౌన్ ముగిసిన తరువాత, కార్ కంపెనీల అమ్మకాలు నిరంతరం పెరుగుతున్నాయి. అయితే కంపెనీలకు లాక్ డౌన్ లో కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ విధమైన ధరల పెరుగుదల జరుగుతోందని తెలుస్తోంది.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota Innova Crysta Price Increase Announced. Read in Telugu.
Story first published: Friday, July 30, 2021, 12:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X