Toyota నుంచి మరో కొత్త ఎడిషన్ 'Hilux GR Sport': వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన Toyota (టయోటా) మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటి. కంపెనీ యొక్క వాహనాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. అయితే కంపెనీ ఇప్పుడు 2022 Toyota Hilux GR Sport (టయోటా హిలక్స్ జిఆర్ స్పోర్ట్) అనే ఒక కొత్త పికప్ ట్రక్కుని పరిచయం చేసింది. ఈ కొత్త వెహికల్ గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.. రండి.

Toyota నుంచి మరో కొత్త ఎడిషన్ 'Hilux GR Sport': వివరాలు

2022 టయోటా హిలక్స్ జిఆర్ స్పోర్ట్ చూడటానికి ఈ సంవత్సరం ఆగస్టులో థాయ్‌లాండ్‌లో ప్రవేశపెట్టిన హిలక్స్ రెవో జిఆర్ స్పోర్ట్ తరహాలో ఉంటుంది. అయితే ఇది దాని హిలక్స్ రెవో జిఆర్ స్పోర్ట్ కంటే కూడా ఎక్కువ కాస్మొటిక్స్ అప్డేట్స్ పొందుతుంది. కానీ ఇందులో ఆశించిన స్థాయిలో హ్యాండ్లింగ్ అప్డేట్స్ లేవు అని తెలుస్తుంది.

Toyota నుంచి మరో కొత్త ఎడిషన్ 'Hilux GR Sport': వివరాలు

కొత్త Toyota Hilux GR Sport మోడల్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది పూర్తిగా ఒక ప్రత్యేకమైన ఫ్రంట్ ఫాసియాను పొందుతుంది. అంతే కాకుండా ఇది కొత్త బ్లాక్ గ్రిల్‌ను కలిగి ఉంది. ఈ కొత్త మోడల్ చుట్టూ మరియు ముందు భాగంలో బ్రాండ్ లోగో వంటివి ఉన్నాయి.

Toyota నుంచి మరో కొత్త ఎడిషన్ 'Hilux GR Sport': వివరాలు

Toyota Hilux GR Sport యొక్క వెడల్పు మునుపటికంటే కూడా 45 మి.మీ ఎక్కువగా ఉంటుంది. ఇందులో 18 ఇంచెస్ వీల్స్, బ్లాక్ రాక్ స్లైడర్‌లు, ముందు భాగంలో రెడ్ బ్రేక్ కాలిపర్‌లు, కొత్త బ్లాక్ రియర్ బంపర్ మరియు కొన్ని GR స్పోర్ట్ బ్యాడ్జ్‌లు ఉన్నాయి. ఇవన్నీఈ కూడా వాహనాన్ని చాలా దూకుడుగా కనిపించే విధంగా చేస్తాయి.

Toyota నుంచి మరో కొత్త ఎడిషన్ 'Hilux GR Sport': వివరాలు

ఇక ఈ కొత్త మోడల్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో సింథటిక్ లెదర్ అపోల్స్ట్రే కూడిన కొత్త సీట్లు, హెడ్‌రెస్ట్‌లపై GR లోగోలు మరియు ముందు సీట్లలోని బోల్స్టర్‌లపై రెడ్ కలర్ స్వెడ్‌తో సహా క్యాబిన్ లోపల చాలా అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. వీటితో పాటు ఇది రెడ్ కాంట్రాస్ట్ స్టిచింగ్, కొత్త GR-బ్రాండ్ స్టీరింగ్ వీల్, స్పోర్టీ అల్యూమినియం పెడల్స్, మెటాలిక్ ప్యాడిల్ షిఫ్టర్‌లు, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు GR-బ్రాండెడ్ ఇంజిన్ స్టార్ట్ బటన్‌ వంటివి కూడా ఇందులో ఉంటాయి.

Toyota నుంచి మరో కొత్త ఎడిషన్ 'Hilux GR Sport': వివరాలు

ఈ టయోటా హిలక్స్ పికప్ యొక్క కొత్త GR స్పోర్ట్ వెర్షన్ ఇప్పటికే అందుబటులో ఉన్న దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే 2.4-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 147 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. అంతే కాకుండా ఇది ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో జత చేయబడింది.

Toyota నుంచి మరో కొత్త ఎడిషన్ 'Hilux GR Sport': వివరాలు

మెరుగైన స్టీరింగ్ మరియు మెయింటెన్స్ రెస్పాన్స్ కోసం హైలక్స్ GR స్పోర్ట్ ఒక ప్రత్యేకమైన సస్పెన్షన్ కూడా పొందుతుంది. కొత్త Hilux GR స్పోర్ట్ మోడల్ జపాన్‌ మార్కెట్లో మాత్రమే పరిచయం చేసినప్పటికీ, దాని స్టాండర్డ్ Hilux పికప్ భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Toyota నుంచి మరో కొత్త ఎడిషన్ 'Hilux GR Sport': వివరాలు

ఇప్పుడు పరిచయం చేయబడిన కొత్త మిడ్-సైజ్ పికప్ ట్రక్కు, దాని బలమైన ఇంజిన్ ఆప్సన్ మరియు అనేక ప్రీమియం ఫీచర్లను కలిగి ఉన్న కారణంగా ఇది విదేశీ మార్కెట్‌లో అధిక ధరకు విక్రయించబడుతుంది. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, వాహన వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

Toyota నుంచి మరో కొత్త ఎడిషన్ 'Hilux GR Sport': వివరాలు

కొత్త Toyota Hilux GR Sport దాని విభాగంలో ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ మోడల్‌కి ప్రత్యర్థిగా ఉంటుంది. హిలక్స్ పికప్ మంచి ఇంటీరియర్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా, ఇది 5,285 మిమీ పొడవు మరియు 4x4 ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. దీనితో పాటు 3,085 మిమీ వీల్‌బేస్‌తో మార్కెట్‌లో వివిధ వేరియంట్‌లలో లాంచ్ చేయబడుతుంది.

Toyota నుంచి మరో కొత్త ఎడిషన్ 'Hilux GR Sport': వివరాలు

ఇప్పుడు కంపెనీ పరిచయం చేసిన ఈ కొత్త Toyota Hilux GR Sport మోడల్ జపాన్ మార్కెట్లో మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉంది, అయితే ఇది భారతీయ మార్కెట్లో విడుదలవుతుందా.. లేదా.. అనేది ఇంకా ఖచ్చితంగా తెలియదు. ఒకవేల ఈ మోడల్ దేశీయ మార్కెట్లో విడుదలైతే ఇసుజు వి-క్రాస్‌కి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota introduced new gr sport version for the hilux pickup truck details
Story first published: Monday, October 25, 2021, 14:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X