గుడ్ న్యూస్: భారత్‌కు రానున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్

మనదేశంలో పికప్ ట్రక్స్‌ని చాలా వరకూ వాణిజ్య ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తుంటారు. అదే, విదేశాల్లో అయితే వీటిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తుంటారు. అంతర్జాతీయ మార్కెట్లలో సాధారణ కార్లతో పోల్చుకుంటే, పికప్ వాహనాలే అధిక ధరను కలిగి ఉంటాయి.

గుడ్ న్యూస్: భారత్‌కు రానున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్

అయితే, భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మారుతున్నట్లుగా తెలుస్తోంది. పికప్ ట్రక్ వాహనాలను పర్సనల్ వాహనాలుగా వినియోగించుకునేందుకు కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో, కార్ కంపెనీలు కూడా అధునాత ఫీచర్లతో కూడిన మరియు ప్రస్తుత కార్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే పికప్ ట్రక్కులను సిద్ధం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి.

గుడ్ న్యూస్: భారత్‌కు రానున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్

తాజాగా, జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఈ విభాగంలో ఓ సరికొత్త పికప్ ట్రక్కును పరిచయం చేయాలని ప్లాన్ చేస్తోంది. టొయోటా హైలక్స్ పేరుతో ఓ కొత్త పికప్ ట్రక్కును ఈ ఏడాది భారత మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. టొయోటా ఇప్పటికే ఈ వాహనాన్ని భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది.

MOST READ:ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి

గుడ్ న్యూస్: భారత్‌కు రానున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్

టొయోటా హైలక్స్ పికప్ ట్రక్ ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న ఫార్చ్యూనర్ మరియు ఇన్నోవా మోడళ్ల మాదిరిగానే అదే ఐఎమ్‌వి ప్లాట్‌ఫామ్‌పై తయారు కానుంది. గ్లోబల్ మార్కెట్లలో ఇప్పటికే ఈ పికప్ ట్రక్ మంచి సక్సెస్‌ఫుల్ మోడల్‌గా కొనసాగుతోంది.

గుడ్ న్యూస్: భారత్‌కు రానున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్

టొయోటా హైలక్స్ మంచి లైఫ్‌స్టైల్ వాహనంగా ఉంటుంది. అడ్వెంచర్స్ చేయాలనుకునే వారు, తరచూ క్యాంపింగ్‌లకు వెళ్లాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. ఇందులో డబుల్ క్యాబిన్ ఉండి, డ్రైవర్‌తో సహా ఐదుగురు ప్రయాణీకులు సౌకర్యంగా ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది. ఈ పికప్ ట్రక్కు వెనుక భాగంలో విశాలమైన ట్రక్ బెడ్ ఉంటుంది.

MOST READ:ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

గుడ్ న్యూస్: భారత్‌కు రానున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్

గ్లోబల్ మార్కెట్లలో టొయోటా హైలక్స్ అనేక ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. అయితే, భారత మార్కెట్ కోసం, ఇది ఇటీవల ప్రారంభించిన ఫార్చ్యూనర్ ఫేస్ లిఫ్ట్ మాదిరిగానే 2.8-లీటర్ డీజిల్ ఇంజన్‌తో లభించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 201 పిఎస్ పవర్‌ను మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

గుడ్ న్యూస్: భారత్‌కు రానున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్

ఒకవేళ కంపెనీకి ఇది ఖరీదైన ఆప్షన్ అయితే, ఇందులో టొయోటా ఇన్నోవాలో ఉపయోగిస్తున్న 2.4-లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఈ పికప్ ట్రక్కులో ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 150 పిఎస్ పవర్‌ను మరియు 360 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఉవకాశం ఉంది.

MOST READ:బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]

గుడ్ న్యూస్: భారత్‌కు రానున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్

అంతర్జాతీయ మార్కెట్లలో టొయోటా హైలక్స్ 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 166 పిఎస్ పవర్‌ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బహుశా ఈ వేరియంట్ భారత మార్కెట్లో లభ్యం కాకపోవచ్చు.

గుడ్ న్యూస్: భారత్‌కు రానున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్

టొయోటా హైలక్స్ స్టాండర్డ్ వేరియంట్లలో రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది. కాకపోతే, ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్లలో ఆప్షనల్ 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కూడా ఇందులో ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇది మొత్తం 5.3 మీటర్ల పొడవును మరియు 3,085 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉండి పొడవులో ఫార్చ్యూనర్ కన్నా పెద్దదిగా ఉంటుంది.

MOST READ:ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!

గుడ్ న్యూస్: భారత్‌కు రానున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్

టొయోటా తమ హైలక్స్ పికప్ ట్రక్కు ధరను అందుబాటులో ఉంచేందుకు ఈ మోడల్‌ని ఎక్కువ భాగం స్థానికంగా అసెంబుల్ చేసే అవకాశం ఉంది. మార్కెట్లో దీని ధర సుమారు రూ.15 లక్షల నుండి రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఇది ఈ విభాగంలో ఇసుజు డి-మాక్స్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
According to reports, Toyota is planning to launch new Hilux pick up truck in India by mid of this year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X