2021 జూన్ నెలలో టయోటా వెల్‌ఫైర్‌ అమ్మకాల అదుర్స్

భారత మార్కెట్లో అత్యధిక అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న కంపెనీలలో ఒకటి జపాన్ వాహన తయారీ సంస్థ టయోటా. టయోటా కంపెనీ ఇతర కంపెనీలకు ఏ మాత్రమే తీసిపోకుండా మంచి అమ్మకాలతో కొనసాగుతోంది. టయోటా కంపెనీ ఇప్పటికే దేశీయ మార్కెట్లో చాలా మోడల్స్ ప్రవేశపెట్టి మంచి ప్రజాదరణ పొందాయి.

2021 జూన్ నెలలో టయోటా వెల్‌ఫైర్‌ అమ్మకాల అదుర్స్

ఇటీవల కాలంలో టయోటా కంపెనీ తన లగ్జరీ టయోటా వెల్‌ఫైర్‌ యొక్క అమ్మకాల నివేదికను విడుదల చేసింది. టయోటా వెల్‌ఫైర్‌ అనేది కంపెనీ యొక్క లగ్జరీ కారు. దీనిని భారతీయ మార్కెట్లో అధిక డిమాండ్‌తో విక్రయిస్తున్నారు. దేశీయ మార్కెట్లో ఈ టయోటా వెల్‌ఫైర్ భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్‌ కి ప్రత్యర్థిగా ఉంటుంది.

2021 జూన్ నెలలో టయోటా వెల్‌ఫైర్‌ అమ్మకాల అదుర్స్

టయోటా కంపెనీ నివేదికల ప్రకారం ఏడాది జూన్‌లో 63 యూనిట్ల వెల్‌ఫైర్‌లను విక్రయించినట్లు తెలిసింది. అదే విధంగా గత ఏడాది 2020 జూన్‌లో టయోటా 49 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది అమ్మకాలతో పోలిస్తే ఇది 29 శాతం వృద్ధిని నమోదు చేయగలిగింది.

2021 జూన్ నెలలో టయోటా వెల్‌ఫైర్‌ అమ్మకాల అదుర్స్

2021 మే నెలలో మాత్రం టయోటా తన వెల్‌ఫైర్‌ ను కేవలం ఒక యూనిట్ మాత్రమే విక్రయించగలిగింది. గత నెల అమ్మకాలతో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధిని సాధించిందని తెలుస్తుంది.

2021 జూన్ నెలలో టయోటా వెల్‌ఫైర్‌ అమ్మకాల అదుర్స్

జూన్ 2021 లో, టయోటా కేవలం 5 యూనిట్ల యారిస్‌ను విక్రయించగా, 38 కామ్రీ యూనిట్లను విక్రయించింది. టయోటా తన ప్రసిద్ధ ఇన్నోవా క్రిస్టా యొక్క 2,973 యూనిట్లను విక్రయించింది. ఇవన్నీ ఈ విధమైన అమ్మకాలను నమోదు, కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా కంపెనీ ఈ లగ్జరీ కారు 63 యూనిట్లు విక్రయించడం అనేది నిజంగా గొప్ప విషయమే.

2021 జూన్ నెలలో టయోటా వెల్‌ఫైర్‌ అమ్మకాల అదుర్స్

టయోటా యొక్క వెల్‌ఫైర్‌ ధర దేశీయ మార్కెట్లో రూ. 79.50 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంటుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో చాలా వరకు లగ్జరీ ఫీచర్స్ ఉంటాయి.

2021 జూన్ నెలలో టయోటా వెల్‌ఫైర్‌ అమ్మకాల అదుర్స్

టయోటా వెల్‌ఫైర్ హెడ్‌ల్యాంప్ సరౌండ్స్ మరియు బంపర్, ఫ్రంట్ బంపర్లలో ఫాగ్ ల్యంప్స్ తో కూడిన ట్రైయాంగిల్ క్రోమ్ ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ అయితే విండో లైన్, డోర్ హ్యాండిల్స్ మరియు రూఫ్‌లైన్‌లోని క్రోమ్ ఎలిమెంట్స్‌ ని కలిగి ఉంటుంది. 17 ఇంచెస్ హైపర్ క్రోమ్ అల్లాయ్ వీల్స్ కూడా ఇందులో ఉంటాయి.

2021 జూన్ నెలలో టయోటా వెల్‌ఫైర్‌ అమ్మకాల అదుర్స్

టయోటా వెల్‌ఫైర్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.5-లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటారులతో జతచేయబడింది, ఇవి 198 బిహెచ్‌పి పవర్ మరియు 235 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇంజిన్ సివిటి గేర్‌బాక్స్‌కు జోడించబడింది.

2021 జూన్ నెలలో టయోటా వెల్‌ఫైర్‌ అమ్మకాల అదుర్స్

ఇందులో రెండవ వరుసలో రెండు విఐపి సీట్లు ఉన్నాయి, అవి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ గా ఉంటాయి. వీటితో పాటు లెగ్ రెస్ట్ మరియు రీక్లినబుల్ బ్యాకెస్ట్ మరియు మెమరీ ఫంక్షన్ ఉన్నాయి. అంతే కాకుండా ఈ ఎంపివిలో 13 ఇంచెస్ రియర్ డిస్ప్లే, 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటివి కూడా ఉన్నాయి.

2021 జూన్ నెలలో టయోటా వెల్‌ఫైర్‌ అమ్మకాల అదుర్స్

స్పీకర్‌లో జెబిఎల్ సౌండ్ సిస్టమ్, రెండవ మరియు మూడవ వరుసలకు సన్ బ్లైండ్స్, 16 కలర్ యాంబియంట్ లైటింగ్, త్రీ టైప్ ఆటో క్లైమేట్ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఇది మొత్తానికి చాలా లగ్జరీగా ఉటుంది.

2021 జూన్ నెలలో టయోటా వెల్‌ఫైర్‌ అమ్మకాల అదుర్స్

ఈ లగ్జరీ వెల్‌ఫైర్ లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, పనోరమిక్ వ్యూ మానిటర్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. అంతే కాకుండా, ఎబిఎస్ విత్ ఇబిడి మరియు బ్రేక్ అసిస్ట్, వెహికల్ డైనమిక్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, బ్రేక్ హోల్డ్, ఎ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు మరెన్నో లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota Sold 60 Units Of Vellfire In June 2021. Read in Telugu.
Story first published: Monday, July 12, 2021, 12:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X