Toyota bZ4X ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; త్వరలో విడుదల

భూమిలో శిలాజ ఇంధనాలు (పెట్రోల్, డీజిల్ మొదలైనవి) అంతరించిపోతున్న నేపథ్యంలో, ఇప్పుడు యావత్ ప్రపంచం ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు పరుగులు తీస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మరియు సులువుగా లభ్యమయ్యే ప్రత్యామ్నాయ ఇంధన వనరు 'ఎలక్ట్రిక్ పవర్'. అందుకే, ఆటోమొబైల్ కంపెనీలన్నీ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల తయారీపై ఆసక్తి చూపుతున్నారు.

Toyota bZ4X ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; త్వరలో విడుదల

భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలపై ఆధారపడుతుందనే ఆలోచనతో, కార్ల తయారీ సంస్థలు క్రమంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా, జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టొయోటా మోటార్స్ (Toyota Motors) కూడా తమ మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టొయోటా బిజీ4ఎక్స్ (Toyota bZ4X) ని ఆవిష్కరించింది.

Toyota bZ4X ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; త్వరలో విడుదల

ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వాహనాల కోసం టొయోటా సిద్ధం చేస్తున్న bZ సిరీస్‌లో bZ4X అనేది మొదటి మోడల్. సమీప భవిష్యత్తులో కంపెనీ ఈ సిరీస్ ఆధారంగా అనేక కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయనుంది. ఈ పేరులో bZ అంటే అర్థం 'బియాండ్ జీరో' (beyond Zero) (జీరోకి మించి అని అర్థం). అంటే, ఇది కార్బన్ న్యూట్రాలిటీ విషయంలో టొయోటా యొక్క విధానాన్ని ప్రతిబింబింపజేస్తుంది.

Toyota bZ4X ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; త్వరలో విడుదల

టొయోటా తమ bZ శ్రేణి ప్రకటనతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు బలమైన డిమాండ్ ఉన్న చైనా, యూఎస్ఏ, యూరప్ మరియు జపాన్ వంటి దేశాలలో తమ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలని టొయోటా లక్ష్యంగా పెట్టుకుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సుబారు కార్పొరేషన్ సహకారంతో టొయోటా తన bZ4X కోసం EV ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది.

Toyota bZ4X ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; త్వరలో విడుదల

ఆఫ్-రోడ్ పనితీరు సామర్థ్యాలతో కూడిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సన్నద్ధం చేసే లక్ష్యంతో ఇరు కంపెనీలు ఈ ప్లాట్‌ఫామ్ ను అభివృద్ధి చేశాయి. చాలా ఏళ్ల పాటు సురక్షితంగా మరియు సులభంగా నడపగలిగే బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (బీఈవీ)ని తయారు చేయాలనుకుంటున్నట్లు టొయోటా తెలిపింది.

Toyota bZ4X ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; త్వరలో విడుదల

ముఖ్యంగా శీతాకాలపు సమయాల్లో క్రూజింగ్ రేంజ్‌ని సాధించడం మరియు టాప్-క్లాస్ బ్యాటరీ సామర్థ్యం నిలుపుదల నిష్పత్తిని అందించడమే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది. ఈ కొత్త bZ4X EV లో 71.4 kWh బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించారు. ఈ బ్యాటరీ ప్యాక్ పూర్తి చార్జ్ పై ఫ్రంట్-వీల్-డ్రైవ్ వెర్షన్‌తో 500 కి.మీ రేంజ్ ను మరియు ఆల్-వీల్-డ్రైవ్ వెర్షన్‌తో దాదాపు 460 కి.మీ రేంజ్ ను ఆఫర్ చేస్తుందని టొయోటా పేర్కొంది.

Toyota bZ4X ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; త్వరలో విడుదల

కాగా, టొయోటా bZ4X ఫ్రంట్-వీల్-డ్రైవ్ వెర్షన్ కేవలం ఒకే 150 kW మోటార్‌ ను కలిగి ఉంటుంది. కాగా, ఆల్-వీల్-డ్రైవ్ వెర్షన్ bZ4X మోడల్ లో ప్రతి యాక్సిల్‌ పై చేయబడిన 80 kW మోటార్‌ అమర్చబడి ఉంటుంది. ఈ టొయోటా ఎలక్ట్రిక్ వాహనం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అధిక అవుట్‌పుట్ ఛార్జర్‌ లకు కూడా అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

Toyota bZ4X ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; త్వరలో విడుదల

ఈ కారులోని బ్యాటరీని ప్యాక్ ను 150 kW డైరెక్ట్ కరెంట్ (డిసి) చార్జర్ సాయంతో కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతానికి సరిపడా ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. కొత్త టొయోటా బిజెడ్4ఎక్స్ ఎలక్ట్రిక్ వెహికల్ చూడటానికి ఒక మిడ్-సైజ్ ఎస్‌యూవీలా ఉంటుంది. ఇది చాలా ఆధునికమైన మరియు స్టైలిష్ ఎక్స్టీరియర్ డిజైన్‌ ను కలిగి ఉంటుంది.

Toyota bZ4X ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; త్వరలో విడుదల

టొయోటా బిజెడ్4ఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లను గమనిస్తే, ఈ కారులో సంప్రదాయ ఆకారపు స్టీరింగ్‌తో పాటు వింగ్-ఆకారపు స్టీరింగ్ ఎంపిక కూడా ఉంటుంది. వీటి మధ్య స్టీర్-బై-వైర్ సిస్టమ్‌ను కూడా ఎంచుకోవచ్చు. కంపెనీ ఈ టెక్నాలజీకి టొయోటా వన్-మోషన్ గ్రిప్ అనే పేరును పెట్టింది.

Toyota bZ4X ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; త్వరలో విడుదల

ఈ టెక్నాలజీ వలన డ్రైవర్ కు మరింత లెగ్‌రూమ్, మెరుగైన డ్రైవింగ్ పొజిషన్ స్వేచ్ఛ మరియు ప్రవేశ మరియు నిష్క్రమణ సౌలభ్యాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, ఇది డ్రైవర్‌ కు మెరుగైన స్టీరింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుందని, డ్రైవ్ మోడ్ ఎంపికతో పాటు స్టీరింగ్ ఫీచర్లను కూడా మార్చుకోవచ్చని కంపెనీ తెలిపింది.

Toyota bZ4X ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; త్వరలో విడుదల

నడవటం మానండి.. Toyota C+walk T ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కండి..

ఇదిలా ఉంటే, టొయోటా ఇటీవల ఓ సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం పేరు టొయోటా సి ప్లస్ వాక్ టి (Toyota C+walk T). ఇది సాంప్రదాయ ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగా కాకుండా, ప్రత్యేక ప్రయోజనాల కోసం రూపొందించబడింది. ఇదొక మూడు చక్రాల బ్యాటరీ పవర్డ్ స్టాండ్ ఓరియెంటెడ్ సిటీ కమ్యూటింగ్ వెహికల్.

Toyota bZ4X ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; త్వరలో విడుదల

టొయోటా సి+వాక్ టి దాని పేరుకు తగినట్లుగానే ఇది నడవటానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడే ఎలక్ట్రిక్ వాహనం. సాధారణ ప్రజలే కాకుండా వికలాంగులు మరియు నడవటానికి కష్టపడే వృద్ధులు కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆరోగ్యవంతులు ఈ Toyota C+walk T ఈవీపై ఎంచక్కా నిలుచుకొని ముందుకి సాగిపోవచ్చు. అలాగే, ఇందులోని వీల్ చైర్ ఆప్షన్ సాయంతో దీనిని తమ సాధారణ వీల్ చైర్ కి కూడా కనెక్ట్ కూడా చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Toyota unveils bzx4 all electric suv specs features range details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X