Toyota Yaris డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో రానున్న సియాజ్ క్లోనింగ్ మోడల్!

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా (Toyota) భారత మార్కెట్లో విక్రయిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ (Yaris) ను కంపెనీ డిస్‌కంటిన్యూ చేసింది. టొయోటా యారిస్ మోడల్‌ను నేటి నుండి అంటే 27 సెప్టెంబర్ 2021 వ తేదీ నుండి భారత మార్కెట్లో నిలిపివేయనున్నట్లు టొయోటా ప్రకటించింది.

Toyota Yaris డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో రానున్న సియాజ్ క్లోనింగ్ మోడల్!

టొయోటా యారిస్ (Toyota Yaris) ఈ బ్రాండ్ నుండి లభిస్తున్న అత్యంత ఆకర్షణీయమైన సెడాన్. కానీ, అమ్మకాల పరంగా ఇది అంత ప్రాచుర్యం పొందలేకపోయింది. దీంతో, కంపెనీ ఈ మోడల్ అమ్మకాలను నిలిపివేయాలని నిర్ణయించింది. అయితే, యారిస్ సెడాన్ స్థానంలో టొయోటా మరో కొత్త మోడల్‌ని జనవరి 2022 నాటికి మార్కెట్లోకి తీసుకురాబోతోంది.

Toyota Yaris డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో రానున్న సియాజ్ క్లోనింగ్ మోడల్!

ఈ కొత్త సెడాన్ మారుతి సుజుకి అందిస్తున్న సియాజ్ (Maruti Suzuki Ciaz) సెడాన్ యొక్క రీబ్యాడ్జ్ మోడల్ గా ఉండబోతోందని సమాచారం. టొయోటా యారిస్ కారులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ వంటి అనేక గొప్ప ఫీచర్లు ఉన్నప్పటికీ, ఇది ప్రైవేట్ కొనుగోలుదారులలో అంతగా ప్రాచుర్యం పొందలేదు.

Toyota Yaris డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో రానున్న సియాజ్ క్లోనింగ్ మోడల్!

అయితే, యారిస్ సెడాన్ ఇప్పటికీ క్యాబ్ ఆపరేటర్లు మరియు హోటల్స్‌తో సహా అనేక ప్రదేశాలలో ప్రధానంగా ఉపయోగించబడుతోంది. కాగా, యారిస్ సెడాన్ డిస్‌కంటిన్యూ అయిన నేపథ్యంలో, ఇప్పటికే ఈ కారును కలిగి ఉన్న కస్టమర్‌లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. ఈ మోడల్ పై సర్వీస్, స్పేర్స్ మరియు వారంటీ అంశాలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

Toyota Yaris డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో రానున్న సియాజ్ క్లోనింగ్ మోడల్!

వచ్చే పదేళ్ల పాటు టొయోటా అధీకృత డీలర్‌షిప్ లు మరియు సర్వీస్ సెంటర్ల ద్వారా యారిస్ విడిభాగాలు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా తమ మిడ్-సైజ్ సెడాన్ టొయోటా యారిస్‌ను మే 2018 లో భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే, ఈ సెడాన్ కంపెనీకి మార్కెట్లో ఆశించిన విజయాలను తెచ్చిపెట్టలేకపోయింది.

Toyota Yaris డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో రానున్న సియాజ్ క్లోనింగ్ మోడల్!

టొయోటా గత కొంత కాలంగా తమ ప్రస్తుత ప్రోడక్ట్ లైనప్ ను అప్‌డేట్ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే, యారిస్ సెడాన్ ను కొత్త అవతార్‌లో తీసుకురాబడుతుందని అందరూ ఊహించారు. అయితే, కంపెనీ ఇప్పుడు ఈ ఉత్పత్తిని నిలిపివేసింది. ఈ నేపథ్యంలో, యారిస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు కంపెనీ ఇప్పుడు కొత్త ప్లాన్ చేస్తోంది.

Toyota Yaris డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో రానున్న సియాజ్ క్లోనింగ్ మోడల్!

ప్రస్తుతం టొయోటా మరియు మారుతి సుజుకి సంస్థల మధ్య భాగస్వామ్యంలో భాగంగా, మారుతి సుజుకి అందిస్తున్న కొన్ని కార్లను రీబ్యాడ్డ్ చేసి టొయోటా విక్రయిస్తోంది. ఇలా వచ్చిన మోడళ్లలో బాలెనో ఆధారంగా రూపొందించిన గ్లాంజా మరియు విటారా బ్రెజ్జా ఆధారంగా రూపొందించిన అర్బన్ క్రూయిజర్ కార్లు ఉన్నాయి. కాగా, ఇప్పుడు ఇదే తరహాలో సియాజ్ ఆధారంగా టొయోటా ఓ కొత్త సెడాన్ ను తీసుకురాబోతున్నట్లు సమాచారం.

Toyota Yaris డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో రానున్న సియాజ్ క్లోనింగ్ మోడల్!

టొయోటా తమ గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ మోడళ్ల మాదిరిగానే సియాజ్ సెడాన్ ను కూడా మారుతి సుజుకి నుండి ఓఈఎమ్ (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యాన్యుఫాక్చరర్) రూపంలో కొనుగోలు చేసి, ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి కొత్త పేరుతో విడుదల చేసే అవకాశం ఉంది. తయారీ ఖర్చును తక్కువగా ఉంచడం కోసం సియాజ్ లోని ఇంజన్లనే ఈ కొత్త సెడాన్ లోనూ కొనసాగించనున్నారు.

Toyota Yaris డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో రానున్న సియాజ్ క్లోనింగ్ మోడల్!

టొయోటా ఈ కొత్త సెడాన్ పేరును ఇంకా ప్రకటించనప్పటికీ, దీనిని బెల్టా అనే పేరుతో విక్రయించవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త సెడాన్ ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ చూడటానికి సియాజ్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే, దీని ఫ్రంట్ గ్రిల్, అల్లాయ్ వీల్స్ మరియు ఇంటీరియర్‌లో కొన్ని సాధారణ అప్‌డేట్‌లు మరియు టొయోటా లోగో మొదలైనవి జోడించబడతాయి.

Toyota Yaris డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో రానున్న సియాజ్ క్లోనింగ్ మోడల్!

డిస్‌కంటిన్యూ చేయబడిన టొయోటా యారిస్ మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో మారుతి సుజుకి సియాజ్‌తో పోటీపడేది. కానీ, ఇప్పుడు టొయోటా మారుతి సియాజ్ యొక్క రీబాడ్జ్డ్ వెర్షన్‌ను తీసుకురాబోతున్నందున, యారిస్ ను నిలిపివేయాలని నిర్ణయించింది. ఇందుకు ప్రధాన కారణం యారిస్ అమ్మకాలు తక్కువగా ఉండటం మరియు కంపెనీ వేరొక పేరుతో కొత్త మోడల్ ని తీసుకురావటం.

Toyota Yaris డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో రానున్న సియాజ్ క్లోనింగ్ మోడల్!

టొయోటా బ్రాండింగ్ తో రానున్న రీబాడ్జ్ మారుతి సుజుకి సియాజ్ కేవలం ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో లభ్యం కానుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఇదే ఇంజన్ ను సియాజ్, బ్రెజ్జా మరియు ఎర్టిగా వంటి మోడళ్లలో ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ 104 బిహెచ్‌పి పవర్ మరియు 138 న్యూటన్ మీటర్ల టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

Toyota Yaris డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో రానున్న సియాజ్ క్లోనింగ్ మోడల్!

సాధారణంగా, టొయోటా రీబ్యాడ్డ్ చేసి విక్రయించే మోడళ్ల ధరలను గమనిస్తే, ఇవన్నీ కూడా వాస్తవ మారుతి సుజుకి మోడళ్ల ధరల కన్నా కాస్తంత ప్రీమియంగా ఉంటాయి. కాబట్టి, ఈ కొత్త టొయోటా సెడాన్ ధర కూడా సియాజ్ ధర కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Toyota yaris discontinued in india will be replaced with new model soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X