టొయోటా యారిస్ రీప్లేస్‌మెంట్‌గా రానున్న రీబ్యాడ్జ్ వెర్షన్ మారుతి సియాజ్!

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా మరియు భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి సంస్థల మధ్య కుదిరిన భాగస్వామ్యంలో భాగంగా, మారుతి సుజుకి తయారు చేసే కార్లను టొయోటా రీబ్యాడ్జ్ చేసి తమ బ్రాండ్ క్రింద వేరే పేర్లతో విక్రయిస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే.

టొయోటా యారిస్ రీప్లేస్‌మెంట్‌గా రానున్న రీబ్యాడ్జ్ వెర్షన్ మారుతి సియాజ్!

టొయోటా ఇప్పటికే మారుతి సుజుకి తయారు చేసిన బాలెనో హ్యాచ్‌బ్యాక్‌ను గ్లాంజా పేరుతో మరియు విటారా బ్రెజ్జా ఎస్‌యూవీని అర్బన్ క్రూయిజర్ పేర్లతో విక్రయిస్తోంది. కాగా, టొయోటా ఇప్పుడు మారుతి సుజుకి విక్రయిస్తున్న సియాజ్ సెడాన్‌ను ఇదే విధంగా రీబ్యాడ్జ్ చేసి, తమ బ్రాండ్‌తో విక్రయించాలని చూస్తోంది.

టొయోటా యారిస్ రీప్లేస్‌మెంట్‌గా రానున్న రీబ్యాడ్జ్ వెర్షన్ మారుతి సియాజ్!

మారుతి సుజుకి సియాజ్ సెడాన్‌ను కొత్త టొయోటా యారిస్ సెడాన్‌గా విక్రయించాలని ఈ జపనీస్ కంపెనీ భావిస్తోంది. అయితే, కంపెనీ తమ రీబ్యాడ్జ్ వెర్షన్ సియాజ్‌కు యారిస్ అనే పేరునే కొనసాగిస్తుందా లేక మరేదైనా కొత్త పేరును ఉపయోగిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

MOST READ:మా నాన్న పోలీస్.. నేను ఏమైనా చేస్తా.. కరోనా వేళ ఢిల్లీలో యువతి హల్‌చల్ [వీడియో]

టొయోటా యారిస్ రీప్లేస్‌మెంట్‌గా రానున్న రీబ్యాడ్జ్ వెర్షన్ మారుతి సియాజ్!

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, మిగతా రెండు మోడళ్ల మాదిరిగానే టొయోటా ఈ కొత్త మోడల్‌ను కూడా పూర్తిగా కొత్త ఐడెంటిటీతో తీసుకురావచ్చని తెలుస్తోంది. మరికొన్ని వారాల్లోనే టొయోటా ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించ అవకాశం ఉంది.

టొయోటా యారిస్ రీప్లేస్‌మెంట్‌గా రానున్న రీబ్యాడ్జ్ వెర్షన్ మారుతి సియాజ్!

కొత్త యారిస్ రీప్లేస్‌మెంట్‌గా రానున్న మారుతి సుజుకి సియాజ్ మోడల్‌ను టొయోటా తమ ప్రీమియం టచ్‌తో రీడిజైన్ చేసే అవకాశం ఉంది. అయితే, సియాజ్ మరియు యారిస్ రీప్లేస్‌మెంట్ సెడాన్ల ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం ఒకేలా ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్, బంపర్స్ మరియు అల్లాయ్ వీల్స్‌లో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. ఇంటీరియర్స్‌లో కూడా ఓవరాల్ క్యాబిన్ లేఅవుట్ అలానే ఉంటుందని అంచనా.

MOST READ:చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!

టొయోటా యారిస్ రీప్లేస్‌మెంట్‌గా రానున్న రీబ్యాడ్జ్ వెర్షన్ మారుతి సియాజ్!

టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా తమ మిడ్-సైజ్ సెడాన్ టొయోటా యారిస్‌ను మే 2018 లో భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే, ఈ సెడాన్ కంపెనీకి మార్కెట్లో ఆశించిన విజయాలను తెచ్చిపెట్టలేకపోయింది. టొయోటా తమ రీబ్యాడ్జ్ వెర్షన్ మారుతి సియాజ్‌ను మార్కెట్లో విడుదల చేయగానే, కంపెనీ ఇప్పటి వరకూ విక్రయిస్తూ వచ్చిన యారిస్ సెడాన్‌ను నిలిపివేయనుంది. ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడానికే టొయోటా ఈ రీబ్యాడ్జ్ విధానాన్ని అనుసరిస్తున్నట్లుగా తెలుస్తోంది.

టొయోటా యారిస్ రీప్లేస్‌మెంట్‌గా రానున్న రీబ్యాడ్జ్ వెర్షన్ మారుతి సియాజ్!

ఇంజన్ పరంగా కూడా ఈ కొత్త టొయోటా సెడాన్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవు. ప్రస్తుతం సియాజ్‌లో లభిస్తున్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే టొయోటా యొక్క రీబ్యాడ్జ్ మోడల్‌లోనూ ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 104 బిహెచ్‌పి పవర్‌ను మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

MOST READ:మినీ కూపర్ కొనుగోలుచేసిన బిగ్ బాస్ 6 కన్నడ టైటిల్ విన్నర్: వివరాలు

టొయోటా యారిస్ రీప్లేస్‌మెంట్‌గా రానున్న రీబ్యాడ్జ్ వెర్షన్ మారుతి సియాజ్!

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఇదే ఇంజన్‌ను తమ పాపులర్ సియాజ్, బ్రెజ్జా మరియు ఎర్టిగా వంటి మోడళ్లలో కూడా ఆఫర్ చేస్తోంది. సాధారణంగా టొయోటా రీబ్యాడ్జ్ చేసిన వాహనాలు మారుతి సుజుకి వాహనాల కంటే అధిక ధరను కలిగి ఉంటాయి. ఉదాహరణకు గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ ధరలు బాలెనో, విటారా బ్రెజ్జా ధరల కన్నా ఎక్కువగా ఉంటాయి.

టొయోటా యారిస్ రీప్లేస్‌మెంట్‌గా రానున్న రీబ్యాడ్జ్ వెర్షన్ మారుతి సియాజ్!

ఈ నేపథ్యంలో, టొయోటా యారిస్ రీప్లేస్‌మెంట్‌గా రానున్న కొత్త రీబ్యాడ్జ్ వెర్షన్ మారుతి సుజుకి సియాజ్ ధర కూడా ఎక్కువగానే ఉండొచ్చని అంచనా. గతంలో టొయోటా ప్రవేశపెట్టిన గ్లాంజా, అర్బన్ క్రూయిజ్ మోడళ్ల కారణంగా కంపెనీ అమ్మకాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ కొత్త సెడాన్ వలన కూడా అమ్మకాలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నారు.

MOST READ:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి జాక్ పాట్..

టొయోటా యారిస్ రీప్లేస్‌మెంట్‌గా రానున్న రీబ్యాడ్జ్ వెర్షన్ మారుతి సియాజ్!

ఇదిలా ఉంటే, టొయోటా మరియు మారుతి సుజుకి భాగస్వామ్యంలో నాల్గవ రీబ్యాడ్జ్ మోడల్‌ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈసారి మారుతి సుజుకి విక్రయిస్తున్న పాపులర్ ఎమ్‌పివి ఎర్టిగా యొక్క రీబ్యాడ్జ్ మోడల్‌ను టొయోటా తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా, మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్‌లకు పోటీగా ఓ కొత్త ఎస్‌యూవీని కూడా తీసుకురావాలని ఇరు కంపెనీలు యోచిస్తున్నాయి.

Source: Team BHP And GaadiWaadi

Most Read Articles

English summary
Toyota Yaris To Be Replaced With Rebadge Version Of Maruti Ciaz, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X