ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

ఫిట్‌నెస్ సరిగ్గా లేని మరియు కాలుష్యం అధికంగా విడుదల చేసే పాత వాహనాలకు స్వస్తి పలికేందుకు గాను ప్రతిపాదించిన 'గ్రీన్ టాక్స్' (హరిత పన్ను)కు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

ఈ ప్రతిపాదన ప్రకారం, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పునరుద్ధరించే సమయంలో 8 సంవత్సరాల కంటే పైబడిన పాత రవాణా వాహనాలకు (ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్)పై అధనంగా గ్రీన్ టాక్స్‌ను వసూలు చేయనున్నారు. రహదారి పన్ను (రోడ్ టాక్స్) మొత్తంలో సుమారు 10 శాతం నుండి 25 శాతం వరకూ ఈ గ్రీన్ టాక్స్‌ని వసూలు చేసే అవకాశం ఉంది.

ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

అంతేకాకుండా, ప్రభుత్వ విభాగాలు మరియు పిఎస్‌యుల యాజమాన్యంలో ఉన్న 15 ఏళ్లకు పైగా పాతబడిన వాహనాలను స్క్రాప్ చేసే విధానాన్ని కూడా త్వరలో తెలియజేసే అవకాశం ఉందని, ఏప్రిల్ 1, 2022వ తేదీ నుండి దీనిని అమలు చేయనున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ విధానానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఆమోదం తెలిపారు.

MOST READ:బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]

ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

భవిష్యత్తులో ఈ విధానం ప్రైవేట్ మరియు రవాణా వాహనాల కోసం కూడా వర్తింపజేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ ప్రతిపాదన అధికారికంగా తెలియజేయబడటానికి ముందే సంప్రదింపుల కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్తుంది.

ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

కాగా, ఈ పథకం కింద, హైబ్రిడ్ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు సిఎన్‌జి, ఇథనాల్, ఎల్‌పిజి వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలకు అలాగే వ్యవసాయ రంగంలో ఉపయోగించే ట్రాక్టర్, హార్వెస్టర్, టిల్లర్ వంటి వాహనాలకు మినహాయింపు ఇవ్వాలని నితిన్ గడ్కరీ నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

MOST READ:ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివరాలు

ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

అయితే, ఇలా ప్రజల నుంచి వసూలు చేసిన గ్రీన్ టాక్స్‌ను తిరిగి ప్రజల కోసమే ఉపయోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇలా వచ్చిన ఆదాయాన్ని ప్రత్యేక ఖాతాలో ఉంచి, దేశంలో పెచ్చుమీరుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు మరియు ఉద్గార పర్యవేక్షణ కోసం రాష్ట్రాలు అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ఉపయోగించనున్నట్లు కేంద్ర తమ ప్రకటనలో తెలిపింది.

ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

వాహనం యొక్క రకం మరియు అది వినియోగించుకునే ఇంధనం (పెట్రోల్ / డీజిల్)ను బట్టి, సదరు వాహనాలపై గ్రీన్ టాక్స్ విభిన్నంగా ఉంటుందని కేంద్రం తెలిపింది. అత్యధిక కాలుష్యం ఉన్న నగరాల్లో వాహనాలపై సుమారు 50 శాతానికి పైగా హరిత పన్ను (గ్రీన్ టాక్స్) విధించే అవకాశం ఉన్నట్లు రోడ్లు, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది.

MOST READ:కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి

ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

వ్యక్తిగత వాహనాల విషయంలో గ్రీన్ టాక్స్ విధింపు కాలాన్ని 15 ఏళ్లకు పరిమితం చేశారు. పదిహేనేళ్లు నిండిన వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెన్యువల్ చేసే సమయంలో వాటిపై గ్రీన్ టాక్స్‌లను వసూలు చేయనున్నారు. అదే సమయంలో సిటీ బస్సులు వంటి ప్రజా రవాణా వాహనాలపై మాత్రం తక్కువ మొత్తంలో గ్రీన్ టాక్స్‌ను వసూలు చేయనున్నారు.

ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

కాగా, దేశంలో పర్యావరణ హితమైన గ్రీన్ వాహనాలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. 'ఫేమ్ 2' అనే పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకంలో భాగంగా, గ్రీన్ వాహనాల కొనుగోలుపై ప్రత్యేకమైన రాయితీలను ఇవ్వడం జరుగుతుంది. అలాగే, ఛార్జర్లపై తగ్గింపులు మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలపై డిస్కౌంట్స్ వంటి మరెన్నో ప్రయోజనాలను అందిస్తున్నారు.

MOST READ:ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!

ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

ఇటీవలి కాలంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి స్పందన లభిస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఫేమ్ 2 పథకం మరియు కఠినమైన ఈ గ్రీన్ టాక్స్ విధానాల వలన దేశంలో గ్రీన్ వాహనాల (ఎలక్ట్రిక్, హైబ్రిడ్, సిఎన్‌జి మొదలైనవి) వినియోగం పెరిగి కాలుష్య స్థాయిలు గణనీయంగా తగ్గే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
Transport Ministry Approves Proposal For Green Tax On Old Vehicles. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X