Just In
- 8 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 19 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 21 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 22 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- Movies
బీజేపీలో చేరిన డిస్కో డ్యాన్సర్.. ప్రధాని మోదీతో మిథున్ చక్రవర్తి కలిసి..
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- News
viral video: బాలుణ్ని మింగిన భారీ మొసలి -దాన్ని బంధించి, పొట్ట చీల్చి చూడగా...
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2030 నాటికి భారత్‌లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు మరియు మరణాలు సంఖ్య ప్రస్తుతం 50% వరకు తగ్గాయని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన ప్రజల ప్రాణాలను కాపాడటంలో ప్రభుత్వం ఎలాంటి నిర్లక్ష్యం తీసుకోదని, వారికి సరైన చికిత్స లభించేలా చేస్తామని కూడా అయన చెప్పారు.

దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు 415 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ గణాంకాలను తగ్గించడానికి, రహదారి భద్రతపై ప్రభుత్వం తన విధానంలో సమగ్ర మార్పు తీసుకువస్తుంది. ప్రజల ప్రాణాలను రక్షించే పనిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని గడ్కరీ అన్నారు.

గత సంవత్సరం, స్వీడన్ లో జరిగిన ఒక సమావేశానికి కేంద్ర ప్రభుత్వం హాజరైందని, 2030 నాటికి భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను సున్నా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మంత్రి చెప్పారు. మరణాలు మరియు ప్రమాదాలను 50 శాతం తగ్గిస్తామని హామీ ఇచ్చారు.
MOST READ:భారత సర్కార్ సాయం చేసి ఉంటే రూ.5,000 లకే ఈ కార్ లభించేంది..

తమిళనాడులో రహదారి భద్రత గురించి అవగాహన పెంచడం వల్ల ప్రమాదం మరియు మరణాల రేటు ఇప్పుడు సుమారు 53% వరకు తగ్గింది. 2025 సంవత్సరానికి ముందు మరణాల సంఖ్య మరియు ప్రమాదాలను 50% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు.

భారతదేశంలో రోడ్డుప్రమాదాలు జరగటానికి ప్రదహన కారణం సరైన రోడ్లు లేకపోవడం కూడా ఒక సమస్య. రోడ్ల పరిస్థితిని తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం 14,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించవచ్చని గడ్కరీ చెప్పారు. 7,000 కోట్ల రూపాయల విలువైన రెండు ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా డెవెలప్మెంట్ బ్యాంకు) ఆమోదం తెలిపాయి.
MOST READ:స్పోర్ట్స్ కార్‌లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!

ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి పొందిన వెంటనే ఈ పథకానికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో, సరిగ్గాలేని రోడ్లు మరియు ప్రమాదకర రహదారులు గుర్తించబడి పరిష్కరించబడతాయి. మార్చి చివరి నాటికి రోజుకు 40 కిలోమీటర్ల రహదారి నిర్మాణ లక్ష్యాన్ని సాధించవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈసారి, ఇప్పటివరకు, మేము రహదారి నిర్మాణ రికార్డును బద్దలు కొట్టాము. ఈ రోజు మనం 30 కిలోమీటర్లకు పైగా చేరుకున్నాము, బహుశా మార్చి చివరి నాటికి రోజుకు 40 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి చేరుకుంటాము" అని గడ్కరీ అన్నారు.
MOST READ:రోడ్లపై గుంతలు పూడ్చే ప్రత్యేక యంత్రం.. నిజంగా సూపర్ గురూ

ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ "రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే మరణాలు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. జాతీయ రహదారి భద్రతా వంటి కార్యక్రమాలు ప్రజల విశ్వాసాన్ని పెంచడమే కాక, అవగాహన పెంచడానికి కూడా సహాయపడతాయని ఆయన అన్నారు.

దేశవ్యాప్తంగా వివిధ కారణాల వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 1.5 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి వి.కె సింగ్ తెలిపారు. భద్రతను ప్రోత్సహించడానికి నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ ను ఉపయోగించాలని ఆయన అన్నారు.
MOST READ:టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో పెట్రోల్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేయండి

పెరుగుతున్న ప్రమాదాలను అరికట్టడానికి, మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. నీతి కమిషన్ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ భారతదేశం 85 శాతం మంది ప్రజలు, 65 శాతం వస్తువులు రోడ్డు మార్గం ద్వారా వెళుతున్నాయి. కావున దేశంలో పటిష్టమైన రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.