వచ్చే నెలలో భారత్‌లో విడుదలకానున్న కార్లు.. వాటి వివరాలు

ప్రపంచ దేశాల్లోని అతి పెద్ద కార్ల మార్కెట్ కలిగిన దేశాలలో భారతదేశం కూడా ఒకటి. భారతీయ మార్కెట్లోని అనేక వాహన తయారీ సంస్థలు ప్రతి నెల అనేక కొత్త కార్లను విడుద చేస్తూనే ఉంటాయి. ప్రస్తుతం దేశంలో పండుగ సీజన్ మొదలయ్యింది. ఈ తరుణంలో చాలా కంపెనీ మంచి అమ్మకాలతో ముందుకు సాగడానికి కొత్త కొత్త వాహనాలను అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలతో విడుదల చేస్తున్నాయి.

వచ్చే నెలలో భారత్‌లో విడుదలకానున్న కార్లు.. వాటి వివరాలు

New Gen Maruti Suzuki Celerio (న్యూ జనరేషన్ మారుతి సుజుకి సెలెరియో):

ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి త్వరలో దేశీయ మార్కెట్లో కొత్త తరం సెలెరియోను విడుదల చేయనుంది. ఇప్పటికే కొత్త సెలెరియో యొక్క టెస్టింగ్ సమయంలో పట్టుబడిన ఫోటోలు చాలానే వెలువడ్డాయి. కొత్త మారుతి సుజుకి సెలెరియో మునుపటి మోడల్ కంటే కూడా చాలా మరియు మరింత విశాలంగా ఉంటుంది.

వచ్చే నెలలో భారత్‌లో విడుదలకానున్న కార్లు.. వాటి వివరాలు

త్వరలో విడుదల కానున్న కొత్త మారుతి సుజుకి సెలెరియో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 67 బిహెచ్‌పి పవర్ మరియు 90 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఇందులో 82 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే శక్తివంతమైన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా పొందే అవకాశం ఉంటుంది.

వచ్చే నెలలో భారత్‌లో విడుదలకానున్న కార్లు.. వాటి వివరాలు

ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి. కంపెనీ తన CNG వెర్షన్‌ని కూడా అందించే అవకాశం ఉందని భావిస్తున్నాము. దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త మారుతి సుజుకి సెలెరియో అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండే అవకాశం ఉంటుంది.

వచ్చే నెలలో భారత్‌లో విడుదలకానున్న కార్లు.. వాటి వివరాలు

Tata Tiago CNG (టాటా టియాగో సిఎన్‌జి):

దేశీయ వాహన తయారీ సంస్థ అయినా Tata Motors (టాటా మోటార్స్) తమ తొలి సిఎన్‌జి కారును త్వరలో భారతీయ విఫణిలో విడుదల చేయడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తుంది. కొత్త టాటా టియాగో సిఎన్‌జి త్వరలో భారతదేశంలో లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు.

వచ్చే నెలలో భారత్‌లో విడుదలకానున్న కార్లు.. వాటి వివరాలు

త్వరలో విడుదల కానున్న ఈ సిఎన్‌జి వెర్షన్ కోసం దేశ రాజధాని నగరం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ వంటి ఎంపిక చేసిన టాటా మోటార్స్ డీలర్‌షిప్‌లలో అనధికారిక బుకింగ్‌లు కూడా స్వీకరించబడుతున్నాయి. ఇది లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది.

వచ్చే నెలలో భారత్‌లో విడుదలకానున్న కార్లు.. వాటి వివరాలు

టాటా టియాగో యొక్క రాబోయే సిఎన్‌జి వేరియంట్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ యొక్క డి-ట్యూన్డ్ వెర్షన్‌ను పొందే అవకాశం ఉంటుంది. ఈ ఇంజిన్ 86 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్‌తో AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది, అయితే CNG వేరియంట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జతచేయబడుతుంది.

వచ్చే నెలలో భారత్‌లో విడుదలకానున్న కార్లు.. వాటి వివరాలు

Tata Tigor CNG (టాటా టిగోర్ సిఎన్‌జి):

దేశంలో రోజురోజుకి సిఎన్‌జి వాహనాలను ఆదరణ పెరుగుతోంది, ఈ సమయంలో Tata Motors (టాటా మోటార్స్) తన కొత్త ఎలక్ట్రిక్ మోడల్‌ అయిన టిగోర్‌ని ఇప్పుడు సిఎన్‌జిలో కూడా తీసుకురావడానికి సిద్ధమవుతోంది. కొన్ని టాటా డీలర్‌షిప్‌లలో టిగోర్ సిఎన్‌జి యొక్క అనధికారిక బుకింగ్ కూడా ప్రారంభమయ్యాయి.

వచ్చే నెలలో భారత్‌లో విడుదలకానున్న కార్లు.. వాటి వివరాలు

టాటా టిగోర్ యొక్క సిఎన్‌జి మోడల్ టెస్టింగ్ సమయంలో ఇప్పటికే చాలా సార్లు గుర్తించబడ్డాయి. కొత్త టాటా టిగోర్ CNG లో, కంపెనీ పెట్రోల్ మోడల్ యొక్క 1.2 లీటర్ రివోట్రాన్ ఇంజిన్‌ను ఉపయోగించబోతోంది, ఇది 85 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే, సిఎన్‌జి మోడల్‌లో పవర్ మరియు టార్క్ అవుట్‌పుట్ కొద్దిగా తక్కువగా ఉండవచ్చు.

వచ్చే నెలలో భారత్‌లో విడుదలకానున్న కార్లు.. వాటి వివరాలు

Volkswagen Tiguan Facelift (ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్‌):

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా నవంబర్ 2021 లో తన కొత్త టైగన్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేయనుంది. కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ అనేక కాస్మెటిక్ అప్‌డేట్‌లతో పాటు కొత్త ఇంజన్‌ను పొందుతుంది. ఇందులో కొత్త బిఎస్ 6 2.0-లీటర్ టిఎస్ఐ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో అందించబడుతుంది.

వచ్చే నెలలో భారత్‌లో విడుదలకానున్న కార్లు.. వాటి వివరాలు

ఈ ఇంజిన్‌లో కంపెనీ డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను ఉపయోగించవచ్చు. ఈ ఇంజన్ గరిష్టంగా 190 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ DSG (డైరెక్ట్ షిఫ్ట్ గేర్‌బాక్స్) మరియ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో జతచేయబడుతుంది. ఇది కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో వస్తుంది, కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Upcoming cars november 2021 india new celerio tiago tigor cng and more
Story first published: Saturday, October 23, 2021, 16:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X